రివాజు (తెలంగాణ కథ 2018)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రివాజు (తెలంగాణ కథ 2018)
రివాజు (తెలంగాణ కథ 2018) పుస్తక ముఖచిత్రం
కృతికర్త: కథా సంకలనం
సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్
డా. వెల్దండి శ్రీధర్[1]
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కథలు
ప్రచురణ: సింగిడి (తెలంగాణ రచయితల సంఘం)
విడుదల: 2019
పేజీలు: 132


రివాజు (తెలంగాణ కథ 2018) అనేది సింగిడి (తెలంగాణ రచయితల సంఘం) ప్రచురించిన పుస్తకం. తెలంగాణ కథా సిరీస్ లో భాగంగా ప్రచురించబడిన ఆరవ పుస్తకం ఇది. 2018లో వివిధ పత్రికల్లోని ఆదివారం ఈనుబంధంలో వచ్చిన తెలంగాణ కథల్లోంచి 13 కథలను ఎంపిక చేసి ఈ పుస్తకం ప్రచురించబడింది. తెలంగాణ ఏర్పాటుకు పూర్వం పరిస్థితులు, ఏర్పాటు అనంతరమూ తప్పని పోరాటం నేపథ్యంలో ఈ కథలు రాయబడ్డాయి.[2]

సంపాదకులు[మార్చు]

కథల నేపథ్యం[మార్చు]

రివాజు అంటే ఆచారం. ఈ సంకలనంలోని కథలు గుండెను పిండేస్తాయి, చరిత్రను చెబుతాయి, భవిష్యత్‌ను వివరిస్తాయి, తెలంగాణ సమాజ ముఖచిత్రాన్ని కళ్ళకు కడతాయి. కష్టాలు, కన్నీళ్ళు, సుఖాలు, సంతోషాలు, సార్వజనీనమైన ప్రేమ మొదలైనవన్ని కలగలిసి తెలంగాణ సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన కథలివి.[3] తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ, సగటు మనిషి జీవితాలే ఇతివృత్తాలుగా సమాజిక స్పృహతో ఈ కథలు రాయబడ్డాయి.

తెలంగాణలోని 1948 కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో ‘ఒక నది రెండుతీరాలు’ (ప్రొ. రామా చంద్రమౌళి) కథ రాయబడింది. భారతదేశంలో కులం ఎంత బలంగా పాతుకుపోయిందో, వేల ఏండ్లుగా కులం నిర్వహిస్తున్న పాత్ర ఏమిటో స్కావెంజర్ (పెద్దింటి అశోక్‌కుమార్) కథ రాయబడింది. తెలంగాణలో నక్సలైట్ ఉద్యమానికి ఉన్న రెండో పార్శాన్ని గురించి నాటుపడ్డ వరిమొక్కలు (ముదిగంటి సుజాతారెడ్డి), రెండో భాగం (పూడూరు రాజిరెడ్డి) కథలు రాయబడ్డాయి. నీళ్లే కాదు, తిండికి దొరుకని పరిస్థితుల్లో కన్నపిల్లల్ని కూడా అమ్ముకోవడం నేపథ్యంలో ‘ఫర్టిలిటీ’ (కొమ్ము రజిత) కథ రాయబడింది.[4] ఒక దళిత యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న ప్రేమ చివరికి ఏ తీరాలకు చేరిందోనన్న నేపథ్యంలో ‘సాయిబోళ్ళ పిల్ల’ (మేడి చైతన్య) కథ రాయబడింది. ప్రేమ, పెళ్లి తరువాత సాఫీగా సాగుతుందనుకున్న జీవితం మధ్యలోనే తెగిపోతే, తెగిపోయాక ఎలా ఉంటుందన్న నేపథ్యంలో ‘వచ్చే పోయే వానలా’ (అఫ్సర్) కథ రాయబడింది. తాగడానికి కూడా చుక్క నీళ్ళు దొరకక ‘పానీపట్టు’ యుద్ధంలో ఆడపడుచులు పడే పెనుగులాట, సంఘర్షణ నేపథ్యంలో ‘నీళ్లబిందె’ (చందు తులసి) కథ రాయబడింది.[5]

విషయసూచిక[మార్చు]

క్రమసంఖ్య కథ పేరు రచయిత పేరు
1 ఒక నది రెండు తీరాలు ప్రో. రామా చంద్రమౌళి
2 స్కావెంజర్ పెద్దింటి అశోక్ కుమార్
3 అవుటర్ రింగ్ రోడ్డు డాక్టర్ వంశీధర్ రెడ్డి
4 యాత్ర కొట్టం రామకృష్ణారెడ్డి
5 రెండో భాగం పూడూరి రాజిరెడ్డి
6 నాటు వడ్డ వరి మొక్కలు డా. ముదిగంటి సుజాత రెడ్డి
7 దూర తీరాలు కటుకోఝ్వుల మనోహరాచారి
8 సాయిబొళ్ల పిల్ల మేడి చైతన్య
9 ఫెర్టిలిటీ రజిత కొమ్ము
10 వచ్చే పోయే వానలా అఫ్సర్
11 అర్బనూరు వి. మల్లికార్జున
12 రాచపుండు డాక్టర్ పసునూరి రవీందర్
13 నీళ్ళ బిందె చందు తులసి

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, ఆదివారం అనుబంధం (10 May 2000). "అనుభూతి కథలు". EENADU. పద్మ. Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  2. ఆంధ్రజ్యోతి, కొత్త పుస్తకాలు. "రివాజు". lit.andhrajyothy.com. చందు తులసి. Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  3. "రివాజు". lit.andhrajyothy.com. Archived from the original on 2021-11-26. Retrieved 2021-11-26.
  4. అస్తిత్వ నిర్మాణంలోకి అడుగు, గుండెబోయిన శ్రీనివాస్, నమస్తే తెలంగాణ చెలిమె, 2020 జనవరి 13
  5. తెలంగాణ కథల 'రివాజు', సంగిశెట్టి శ్రీనివాస్-డా. వెల్దండి శ్రీధర్, మన తెలంగాణ, సంపాదకీయం, 2019 డిసెంబరు 19.