రివాబా జడేజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రివాబా జడేజా
జననం
రీవా సోలంకి

1990 నవంబర్ 02
జాతీయతఇండియన్
విద్యమెకానికల్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌
విద్యాసంస్థఆత్మియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ కళాశాల, రాజ్‌కోట్‌
వృత్తికర్ణిసేన మహిళా విభాగానికి చీఫ్‌ (2018), 2019 నుంచి భాజపా నాయకురాలు
క్రియాశీల సంవత్సరాలు2018 - ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
శ్రీ మాతృశక్తి చారిటబుల్‌ ట్రస్ట్‌
జీవిత భాగస్వామిరవీంద్ర జడేజా (m 2016 ఏప్రిల్ 17)
పిల్లలుఒక కూతురు నిధ్యాన
తల్లిదండ్రులు
  • హర్‌దేవ్‌ సింగ్‌ సోలంకి (తండ్రి)
  • ప్రఫుల్లాబా సోలంకి (తల్లి)
బంధువులుహరిసింగ్‌ సోలంకి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత (మేనమామ)

రివాబా జడేజా (ఆంగ్లం: Rivaba Jadeja; జననం 1990 నవంబర్ 02) ఒక భారతీయ రాజకీయనాయకురాలు. ఆమె అసలు పేరు రీవా సోలంకి. ఆమె భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు రవీంద్ర జడేజా భార్య. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో జామ్‌నగర్ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసింది.[1]

ఈ ఎన్నికల్లో రివాబా జడేజా 50 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించింది.[2]

బాల్యం, విద్య[మార్చు]

రివాబా జడేజా 1990 నవంబర్ 2న రాజ్‌కోట్‌లో హర్‌దేవ్‌ సింగ్‌ సోలంకి, ప్రఫుల్లాబా దంపతులకు రివా సోలంకిగా జన్మించింది.[3] రాజ్‌కోట్‌లోని ఆత్మియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది.

కెరీర్[మార్చు]

ఆమె 2019లో భారతీయ జనతా పార్టీలో చేరి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసింది. దీనికి ముందు ఆమె 2018లో కర్ణిసేన మహిళా విభాగానికి చీఫ్‌గా వ్యవహరించింది. కమలదళంలో చేరాక ఆమె జామ్‌నగర్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తోంది. ముఖ్యంగా బాలికల సంక్షేమంపై దృష్టిసారించింది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమెకు లక్షల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు.

రివాబా జడేజా స్థాపించిన శ్రీ మాతృశక్తి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఆమె గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

వ్యక్తిగతం[మార్చు]

ఆమె రవీంద్ర జడేజాను 2016 ఏప్రిల్ 17న వివాహమాడింది.[4] వారిద్దరికీ జూన్ 2017లో కూతురు నిధ్యాన జన్మించింది.[5] రవీంద్ర జడేజాతో పరిచయం కాకముందు అతడి సోదరి నైనా జడేజా, రివాబా మంచి స్నేహితులు కావడం విశేషం.

రాజకీయాలు[మార్చు]

రివాబా జడేజా 2022 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నార్త్‌ జామ్‌నగర్‌ నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థిపై 61,065 వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచింది.[6]

మూలాలు[మార్చు]

  1. "Gujarat elections : మోదీకి రవీంద్ర జడేజా ధన్యవాదాలు | ravindra jadeja thanks to pm modi after his wife was given bjp ticket to contest gujarat polls yvr". web.archive.org. 2022-11-11. Archived from the original on 2022-11-11. Retrieved 2022-11-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Cricketer Ravindra Jadeja Wife Rivaba Jadeja-Wins Jamnagar North Seat - Sakshi". web.archive.org. 2022-12-08. Archived from the original on 2022-12-08. Retrieved 2022-12-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Rivaba Jadeja: జడేజా భార్యగానే కాదు.. పాలిటిక్స్‌లో ముందు నుంచీ యాక్టివ్‌ (10 పాయింట్స్‌)". web.archive.org. 2022-11-11. Archived from the original on 2022-11-11. Retrieved 2022-11-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. Andhra Jyothy (7 November 2022). "ప్రత్యర్థులుగా తలపడనున్న రవీంద్ర జడేజా భార్య, సోదరి!". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  5. The Indian Express (13 June 2017). "Ravindra Jadeja, wife give baby daughter Sanskrit inspired name" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  6. Namasthe Telangana (8 December 2022). "గుజరాత్‌ ఎన్నికల్లో జడేజా భార్య రివాబా జడేజా విజయం". Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.