Jump to content

రీటా బహుగుణ జోషి

వికీపీడియా నుండి
రీటా బహుగుణ జోషి
రీటా బహుగుణ జోషి


పదవీ కాలం
23 మే 2019 – ప్రస్తుతం
ముందు శ్యామా చరణ్ గుప్తా
నియోజకవర్గం అలాహాబాద్ లోక్‌సభ నియోజకవర్గం

పదవీ కాలం
16 మే 2017 – 23 మే 2019

ఉత్తరప్రదేశ్ శాసనసభ్యురాలు
పదవీ కాలం
7 మార్చి 2012 – 23 మే 2019
ముందు సురేష్ చంద్ర తివారి
తరువాత సురేష్ చంద్ర తివారి
నియోజకవర్గం లక్నో కంటోన్మెంట్

వ్యక్తిగత వివరాలు

జననం (1949-07-22) 1949 జూలై 22 (వయసు 75)[1]
అలాహాబాద్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2016 - ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ (1992-2016)
జీవిత భాగస్వామి పురాణ్ చంద్ర జోషి (m. 1976)
బంధువులు హేమవతీ నందన్ బహుగుణ (తండ్రి), మాజీ ముఖ్యమంత్రి
కమల బహుగుణ (తల్లి)
విజయ్‌ బహుగుణ (సోదరుడు), ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి
సంతానం మయాంక్ జోషి
నివాసం లక్నో

రీటా బహుగుణ జోషి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం అలాహాబాద్ లోక్‌సభ నియోజకవరం నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుంది.

రాజకీయ జీవితం

[మార్చు]

రీటా బహుగుణ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె 1995 నుండి 2000 వరకు అలహాబాద్ మేయర్‌గా పనిచేసింది. ఆమె 2003 నుండి వరకు అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, 2007 సెప్టెంబరు నుండి పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా, ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా పనిచేసింది. రీటా బహుగుణ 1999 లోక్‌సభ ఎన్నికల్లో అలహాబాద్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయింది. ఆమె 2012 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో లక్నో కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైంది.

రీటా బహుగుణ 2009, 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లక్నో నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. ఆమె 2016లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి తన సమీప ప్రత్యర్థి ఎస్పీ అభ్యర్థి అపర్ణ యాదవ్ పై గెలిచి[2] యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో 2017 మే 16 నుండి 2019 మే 23 వరకు మహిళ, కుటుంబ, శిశు సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రిగా విధులు నిర్వహించింది.[3]

రీటా బహుగుణ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున అలాహాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచింది.[4]

మూలాలు

[మార్చు]
  1. Lok Sabha (2019). "Rita Bahuguna Joshi". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
  2. Deccan Chronicle (11 March 2017). "Aparna Yadav loses to BJP's Rita Bahuguna Joshi" (in ఇంగ్లీష్). Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
  3. Sakshi (19 March 2017). "కాంగ్రెస్‌ను వీడి మంత్రి అయ్యారు". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
  4. The Times of India (23 May 2019). "BJP record win in both seats of Allahabad | India News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.