అపర్ణ యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అపర్ణ యాదవ్

వ్యక్తిగత వివరాలు

జననం 1989 ఫిబ్రవరి 5
ఉత్తరాఖండ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2022 జనవరి 19 - ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు సమాజ్‌వాదీ పార్టీ (2017 - 2022 జనవరి 19 )
జీవిత భాగస్వామి ప్రతీక్ యాదవ్‌
బంధువులు ములాయం సింగ్ యాదవ్ (మామయ్య)
సంతానం ప్రథమ
పూర్వ విద్యార్థి మాంచెస్టర్ విశ్వవిద్యాలయం

అపర్ణా యాదవ్‌ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

అపర్ణ బిష్త్ 1989 ఫిబ్రవరి 5న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అరవింద్ సింగ్ బిష్త్, అంబి బిష్త్ దంపతులకు జన్మించింది. ఆమె మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది.

కుటుంబ నేపథ్యం[మార్చు]

అపర్ణ ములాయం సింగ్ యాదవ్ రెండవ భార్య సాధన గుప్తా కుమారుడు ప్రతీక్ యాదవ్‌ను 2011లో అపర్ణ వివాహం చేసుకుంది. అపర్ణ, ప్రతీక్ దంపతులకు ఓ కూతురు ఉంది.

రాజకీయ జీవితం[మార్చు]

అపర్ణ 2017 అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ తరపున లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి నుండి పోటీ చేసి బిజెపి అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో 33796 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[2][3] అపర్ణ యాదవ్ ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో 2022 జనవరి 19న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీ సభ్యత్వం తీసుకుంది.[4][5] అపర్ణ యాదవ్‌ అయోధ్య మందిర నిర్మాణానికి తన వంతుగా 2022 ఫిబ్రవరిలో 11 లక్షల రూపాయాలను విరాళంగా అందజేసింది.[6] బీజేపీలో చేరిన అపర్ణ యాదవ్‌కు 2022 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు.

మూలాలు[మార్చు]

  1. Eenadu (20 January 2022). "'చిన్న కోడలు'.. పెద్ద మార్పు.. ఎవరీ అపర్ణాయాదవ్‌?". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
  2. The Hans India (11 March 2017). "Aparna Yadav loses to BJP's Rita Bahuguna Joshi" (in ఇంగ్లీష్). Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
  3. Deccan Chronicle (11 March 2017). "Aparna Yadav loses to BJP's Rita Bahuguna Joshi" (in ఇంగ్లీష్). Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
  4. Eenadu (19 January 2022). "సమాజ్‌వాదీ పార్టీకి షాక్‌.. భాజపాలో చేరిన ములాయం కోడలు". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
  5. TV9 Telugu (19 January 2022). "యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. బీజేపీలోకి యులాయం సింగ్ కోడలు." Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Sakshi (20 February 2021). "అయోధ్యకు మాజీ సీఎం కోడలు విరాళం". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.