Jump to content

రీతా సాహు

వికీపీడియా నుండి
రీటా సాహు
రీతా సాహు


చేనేత, వస్త్ర, హస్తకళలు శాఖ మంత్రి
పదవీ కాలం
2022 జూన్ 5  ప్రస్తుతం
నియోజకవర్గం బిజేపూర్‌ నియోజకవర్గం

ఎమ్మెల్యే
పదవీ కాలం
28 ఫిబ్రవరి 2018  24 మే 2019
ముందు సిబాల్ సాహు
తరువాత నవీన్ పట్నాయక్
పదవీ కాలం
24 అక్టోబర్ 2019  ప్రస్తుతం
ముందు నవీన్ పట్నాయక్

వ్యక్తిగత వివరాలు

జననం 16 జూన్ 1971
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
తల్లిదండ్రులు లక్ష్మి నారాయణ్ మహారణా
జీవిత భాగస్వామి సుబల్ సాహు
సంతానం 2

రీతా సాహు ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె బిజేపూర్‌ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2022 జూన్ 5న చేనేత, వస్త్ర, హస్తకళలు శాఖ మంత్రిగా (స్వతంత్ర హోదా) భాద్యతలు చేపట్టింది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రీతా సాహు తన భర్త నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సుబల్ సాహు మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి 2018లో బిజేపూర్ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో బీజేడీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైంది.[2] ఒడిశా శాసనసభకు 2019లో జరిగిన ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ బిజేపూర్ & హింజిలి స్థానాల నుండి పోటీ చేసి రెండు స్థానాలలో గెలవడంతో ఆయన బిజేపూర్ స్థానానికి రాజీనామా చేయడంతో 2019లో జరిగిన ఉప ఎన్నికలో బీజేడీ అభ్యర్థిగా రీతా సాహు పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[3] 2022 జూన్ 5న నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో చేనేత, వస్త్ర, హస్తకళలు శాఖ మంత్రిగా (స్వతంత్ర హోదా) భాద్యతలు చేపట్టింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. The Indian Express (28 February 2018). "MP, Odisha bye-election results 2018 highlights: BJD sweeps Bijepur; Mungaoli, Kolaras stays with Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
  3. The Hindu (24 October 2019). "BJD's Rita Sahu secures impressive victory in Bijepur bypoll" (in Indian English). Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
  4. Sakshi (6 June 2022). "ఒరిస్సా కొత్త క్యాబినెట్‌.. ఎన్నాళ్లో వేచిన ఉదయం." Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=రీతా_సాహు&oldid=3596882" నుండి వెలికితీశారు