రీతీందర్ సింగ్ సోధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రీతీందర్ సింగ్ సోధి
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1980-10-18) 1980 అక్టోబరు 18 (వయసు 43)
పటియాల, పంజాబ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 82)2000 డిసెంబరు 2 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2002 నవంబరు 21 - వెస్టిండీస్ తో
మూలం: Cricinfo, 2022 ఫిబ్రవరి 6

రీతీందర్ సింగ్ సోధి, పంజాబ్ కు చెందిన మాజీ భారతీయ క్రికెట్ ఆటగాడు. పంజాబ్‌కు చెందిన ఆల్ రౌండర్ కోసం వెతుకుతున్నప్పుడు భారత సెలెక్టర్‌లు ఎంపిక చేసిన వారిలో ఒకడు. భారతదేశపు మొదటి అండర్ 19 ప్రపంచ కప్ విజేత జట్టులో కీలక సభ్యుడు.[1] 2000 డిసెంబరులో కటక్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసాడు.[2]

జననం[మార్చు]

రీతీందర్ సింగ్ సోధి 1980, అక్టోబరు 18న పంజాబ్ లోని పటియాలలో జన్మించాడు.

క్రికెట్ రంగం[మార్చు]

2000లో బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీ మొదటి ఇన్‌టేక్ కోసం ఎంపికయ్యాడు.[3] భారతదేశం అండర్-15 ప్రపంచ కప్ విజయంలో రీతీందర్ సింగ్ సోధీ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. భారతదేశం అండర్-19 ప్రపంచ కప్ విజయంలో వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు.[4] 2000 డిసెంబరులో ఇండియన్ వన్ డే ఇంటర్నేషనల్ స్క్వాడ్‌లో చేర్చబడ్డాడు. చిన్న వయస్సులోనే జాతీయ జట్టులోకి వేగంగా ఎదిగాడు. ఇండియన్ క్రికెట్ లీగ్‌లో అహ్మదాబాద్ రాకెట్స్ తరపున కూడా ఆడాడు.[5]

ఆ తరువాత వెంటనే తొలగించబడ్డాడు. భారత ఎంపిక కోసం ముందున్నవారిలో నిలిచిపోయాడు. ఇప్పుడు ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మ్యాచ్ రిఫరీగా పనిచేస్తున్నాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Chakraborty, Kuntal (2020-02-07). "ABP Exclusive: Reetinder Sodhi Hails Rahul Dravid As X Factor Behind Success Of India's U-19 Team". news.abplive.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-03.
  2. 2.0 2.1 "Reetinder Singh Sodhi overcomes 'tragic' career to become India's youngest match referee". The Times of India. Retrieved 2023-08-03.
  3. Ramchand, Partab (2000-04-15). "First list of NCA trainees". Cricinfo. Retrieved 2023-08-03.[permanent dead link]
  4. "Reetinder Sodhi". ESPN Cricinfo. Retrieved 2023-08-03.
  5. Kumar, Abhishek (2015-10-18). "Reetinder Sodhi: 8 interesting facts about former India and Punjab all-rounder". Cricket Country. Retrieved 2023-08-03.

బయటి లింకులు[మార్చు]