రుక్సానా తబస్సుమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుక్సానా తబస్సుమ్
2018లో, న్యూఢిల్లీలో జరిగిన 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో, రుక్షానా తబస్సుమ్ కు రజత్ కమల్ అవార్డును అందజేస్తున్న స్మృతి ఇరాని, కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
జననం (1985-05-13) 1985 మే 13 (వయసు 39)
విద్యఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా,
ది అస్సాం వ్యాలీ స్కూల్

రుక్సానా తబస్సుమ్ (జననం 1985 మే 13) భారతదేశానికి చెందిన చిత్రనిర్మాత, నటి. ప్రధానంగా హిందీ చిత్రాలలో పనిచేస్తున్నది. ఆమె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూర్వ విద్యార్ధి, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా (సిఎఫ్ఎస్ఐ) నిర్మించిన ఆమె చిత్రం 'ది కేక్ స్టోరీ' కోసం 2018లో షార్ట్ ఫిక్షన్ నాన్-ఫీచర్ విభాగంలో జాతీయ చలనచిత్ర అవార్డును (జ్యూరీ ప్రత్యేకం) గెలుచుకుంది, ఎల్ఎక్స్ఎల్ ఐడియాస్ నిర్మించిన ఆమె చిత్రం యాపిల్స్ అండ్ ఆరెంజెస్ కోసం మరొక జాతీయ చలనచిత్ర అవార్డు (ఉత్తమ విద్యా చిత్రం) గెలుచుకుంది.[1][2]

ఆమె ఇండియన్ డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐడిపిఎ) జ్యూరీ ప్యానెల్ లో నామినేటెడ్ సభ్యులలో ఒకరు, ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్ పూర్వ విద్యార్ధి కూడా. చలన చిత్రాలతో పాటు, ప్రకటనలకు కూడా దర్శకత్వం వహిస్తుంది, రిలయన్స్, గోద్రేజ్, కెంట్ ఆర్ఓ సిస్టమ్స్, ఒడిశా టూరిజం, ఏషియన్ పెయింట్స్, నెస్లేతో సహా అనేక సంస్థలకు ప్రకటనలు చేసింది.[3]

ఆమె శాస్త్రీయ నృత్యకారిణి కూడా, ముంబైలోని నలంద నృత్య కళా మహావిద్యాలయ నుండి భరతనాట్యం 'పరంగట' లో అడ్వాన్స్డ్ డిప్లొమా పూర్తి చేసింది. ఆమె స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ విజువల్ ఆర్ట్స్ రోహ్తక్, ఎఫ్టిఐఐ పూణే విజిటింగ్ ఫ్యాకల్టీగా కూడా వ్యవహరిస్తోంది.

ప్రారంభ జీవితం

[మార్చు]

రుక్సానా తబస్సుమ్ తన బాల్యంలో ఎక్కువ భాగం అస్సాంలోని నాగావ్ నగరంలో గడిపింది, బలిపారాలోని ది అస్సాం వ్యాలీ స్కూల్ లో పాఠశాల విద్యను కొనసాగించింది. తరువాత ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ప్రకటనలలో వృత్తిని ప్రారంభించడానికి ముందు, ఆమె విగాన్ & లే కాలేజ్ నుండి అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేసింది, తరువాత పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి ఫిల్మ్ డైరెక్షన్ లో పోస్ట్ గ్రాడ్యూయేట్ కోర్సును పూర్తి చేసింది. ఎఫ్టిఐఐలో చదువుతున్నప్పుడు, ఆమె ఉత్తమ దర్శకురాలు, ఉత్తమ విద్యార్థి అవార్డు రెండింటినీ గెలుచుకుంది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా అవార్డులు గమనిక
బర్నింగ్ [4][5]
2020 డమ్మీ [6] ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (స్టట్గార్ట్) [7] సర్వమంగళ ఆర్ట్స్ ఇనిషియేటివ్
2018 ది కేక్ స్టోరీ జ్యూరీ ప్రత్యేక ప్రస్తావన, జాతీయ చలనచిత్ర అవార్డు 2018

స్మైల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫర్ చిల్డ్రన్ అండ్ యూత్, 2018

చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా
2019 అపిల్స్ అండ్ ఆరెంజెస్ జాతీయ చలనచిత్ర అవార్డు 2020 లో ఉత్తమ విద్యా చిత్రం ఎల్ఎక్స్ఎల్ ఐడియాస్
మిషన్ సన్డే ఎల్ఎక్స్ఎల్ ఐడియాస్
ఐ డు నాట్ ఫిట్
మముల్స్ అండ్ స్టార్స్
2019 వైష్ణవ-బీయింగ్ హ్యూమన్ (సత్రియా డాన్స్ చిత్రం)
2021 ది సోషల్ సొల్యూషన్
2020 సానేషన్-నోట్ టు సెల్ఫ్
రెడ్ బాక్స్

మూలాలు

[మార్చు]
  1. "Rukshana Tabassum – Indisches Filmfestival" (in జర్మన్). Retrieved 2021-10-08.
  2. Anand, Shilpa Nair (2021-03-29). "'Apples and Oranges', awarded the National Award for the Best Educational Film, teaches acceptance despite diversity". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-10-08.
  3. "Rukshana Tabassum About 'Apples And Oranges'". THE STORY MUG (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2021-04-08. Retrieved 2021-10-08.
  4. Kahlon, Sukhpreet. "Burning review: A cumbersome exploration of sisterhood". Cinestaan. Archived from the original on 29 October 2020. Retrieved 2021-10-08.
  5. Rosario, Kennith (2018-12-07). "Death in the ghats of Varanasi". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-10-08.
  6. "Ajayya Kumar gets candid, talks about his incredible journey". The Week (in ఇంగ్లీష్). Retrieved 2021-10-08.
  7. Anand, Shilpa Nair (2021-07-27). "Short film 'Dammy' premieres at the Indian Film Festival (Stuttgart)". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-10-08.