రుష్మి చక్రవర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుష్మి చక్రవర్తి
రుష్మి చక్రవర్తి (2010)
దేశంభారతదేశం
నివాసంచెన్నై, భారతదేశం
జననం (1977-10-09) 1977 అక్టోబరు 9 (వయసు 47)
హైదరాబాదు, భారతదేశం
ఎత్తు1.70 మీ. (5 అ. 7 అం.)
ప్రారంభంసెప్టెంబరు 2005
ఆడే విధానంకుడిచేతివాటం
బహుమతి సొమ్ము$124,005
సింగిల్స్
సాధించిన రికార్డులు321–241
సాధించిన విజయాలు12 ITF
అత్యుత్తమ స్థానముNo. 310 (13 సెప్టెంబరు 2004)
డబుల్స్
Career record372–209
Career titles40 ITF
Highest rankingNo. 252 (18 జూన్ 2001)
Other Doubles tournaments
Olympic Games1R (2012 లండన్ ఒలింపిక్స్‌)

రుష్మి చక్రవర్తి (జననం 9 అక్టోబరు 1977) తెలంగాణకు చెందిన ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణి.[1] ఈమె రికార్డుస్థాయిలో 52 ఐటిఎఫ్ టైటిల్స్ గెలుచుకుంది. భారతదేశానికి చెందిన మహిళా క్రీడాకారిణి సాధించిన అత్యధిక బహుమతులు ఇవి. 2005 సెప్టెంబరులో కోల్‌కతాలో జరిగిన డబ్ల్యుటిఏ టూర్ టోర్నమెంట్ సన్‌ఫీస్ట్ ఓపెన్‌లో మొదటి రౌండ్‌లో ఆడిన రుష్మి ప్రొఫెషనల్‌ క్రీడాకారిణిగా ఎదిగింది.

జననం

[మార్చు]

రుష్మి 1977, అక్టోబరు 9న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించింది.

టెన్నిస్ కెరీర్

[మార్చు]

ఐటిఎఫ్ సర్క్యూట్ క్రీడాకారిణి అయిన రుష్మి, తన కెరీర్‌లో 2005, 2006లలో ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యుటిఏ) సన్‌ఫీస్ట్ ఓపెన్‌లో రెండుసార్లు ఆడింది. రెండుసార్లు మొదటి రౌండ్ లోనే ఓడిపోయింది. 2003 ఆఫ్రో-ఏషియన్ గేమ్స్‌లో నాలుగు పతకాలు (రెండు బంగారు పతకాలు) గెలుచుకుంది. 2002, 2006, 2010లలో జరిగిన ఆసియా క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. విదేశాల్లో జరిగిన డబ్ల్యుటిఏ టోర్నమెంట్‌లో తొలిసారిగా పాల్గొన్న రుష్మి, మలేషియా ఓపెన్ క్వాలిఫైయింగ్‌లో ఓడిపోయింది. ఢిల్లీలో జరిగిన 2010 కామన్వెల్త్ క్రీడలలో కూడా పాల్గొని, కేటీ ఓబ్రెయిన్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.[2] సానియా మీర్జాతో కలిసి డబుల్స్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.[3]

2012 లండన్ ఒలింపిక్స్‌లో మహిళల డబుల్స్‌లో సానియా మీర్జాతో ఆడటానికి వైల్డ్‌కార్డ్ ప్రవేశం లభించింది.[4] తొలి రౌండ్ లో తైవాన్ కు చెందిన హ్సీహ్ సు వీ - చువాంగ్ చియా జంగ్ లతో జరిగిన మ్యాచ్ లో మూడు సెట్లలో ఓడిపోయింది.[5]

మూలాలు

[మార్చు]
  1. "Rushmi Chakravarthi continues to march on". The Hindu. 29 May 2009. Archived from the original on 2 June 2009. Retrieved 20 July 2021.
  2. "Perfect outing for journeywoman Rushmi". The Times of India. 7 October 2010. Retrieved 20 July 2021.
  3. "CWG tennis: Sania-Chakravarthi win bronze". Hindustan Times. 10 October 2010. Archived from the original on 23 October 2010. Retrieved 20 July 2021.
  4. "Sania, Somdev get wild cards for London Olympics". 26 June 2012.
  5. 'Sania-Rushmi out of women's doubles' Rediff Sports. Retrieved 20 July 2021.

బయటి లింకులు

[మార్చు]