Jump to content

కల్పనా రెంటాల

వికీపీడియా నుండి
(రెంటాల కల్పన నుండి దారిమార్పు చెందింది)
కల్పనా రెంటాల

రెంటాల కల్పన తెలుగు రచయిత్రి, జర్నలిస్ట్. ఆమె అచ్చుపత్రికలతో పాటు వెబ్‌పత్రికలలో కూడా రచనలు చేస్తుంది. ఆమె తూర్పు పడమర వెబ్ పత్రికను నిర్వహిస్తున్నది.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె విజయవాడలో జన్మించింది. ఆమె తండ్రి రెంటాల గోపాలకృష్ణ పాత్రికేయుడు, రచయిత. ఆంధ్రభూమి దినపత్రికలో కొంతకాలం పనిచేసాడు. ఆమె అమెరికాలో నివసిస్తుంది. ఆమెకు చిన్నతనం నుండి తన తండ్రి రాసిన రచనలను చదవడం, వాటిపై చర్చలు చేయడం ద్వారా సాహిత్యంపై ఆసక్తి ఏర్పడింది.

ఆమె మొదటి కథ 1985-86లలో తన 20 ఏళ్ల వయస్సులో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది. ఆ పత్రికకు ఆమె కాలమిస్టుగా సాహిత్య ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆమె రాసిన కవితలనే కథలుగా మార్చే ప్రయోగం చేసింది. ఆమె "ఈస్ట్రోజన్ పిల్" అనే కవిత రాసింది. దానిని ఆమె "ఋతుభ్రమణం" అనే కథగా మలిచింది. ఇది ఆమె మొదటి కథ. ఆమె రాసిన మొదటి కవితా సంకలనం "నేను కనిపించే పదం" నకు అనంతా పురస్కారం లభించింది. ఆమె కథలు, కవితలు, సాహిత్య విమర్శలు, అనువాదాలు అనేకం చేసింది. ఆమె మొదటి నవల తన్హాయీలో అమెరికన్ వాతావరణాన్ని లోతుగా చిత్రించింది. ఆమె కథలు, నవలలలో ప్రధాన వస్తువు స్త్రీలకు సంబంధించిన విషయాలే ఎక్కువగా ఉంటాయి. స్త్రీలు, పిల్లలకు సంబంధించిన ఇతివృత్తాలనే ఎక్కువగా తీసుకుంటుంది.

ప్రచురణలు

[మార్చు]
  • నేను కనిపించే పదం (కవితలసంకలనం)
  • తన్హాయి నవల - ఈ నవలపై విస్తృతంగా చర్చలు జరిగేయి
  • అయిదో గోడ (2021)

కథలు

[మార్చు]
  • ఋతుభ్రమణం
  • టింకూ ఇన్ టెక్సస్
  • ఐయిదో గోడ
  • ఇట్స్ నాట్ ఒకే.

సాహిత్యసేవ

[మార్చు]
  • సారంగ సాహిత్య వారపత్రిక సంపాదకవర్గంలో ఒకరు.

మూలాలు

[మార్చు]
  1. "తూర్పు-పడమర". తూర్పు-పడమర. Archived from the original on 2020-07-15. Retrieved 2020-07-15.

బయటి లింకులు

[మార్చు]