చర్చ:కల్పనా రెంటాల
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
కల్పనా రెంటాల పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
ప్రాముఖ్యం
[మార్చు]వ్యాసం ప్రాముఖ్యత ఎంతవరకు? --రవిచంద్ర (చర్చ) 06:12, 14 జూలై 2009 (UTC)
"తొలగించు" ట్యాగ్ తగిలించబడినది --Svrangarao 02:20, 19 జూలై 2009 (UTC)
- నాకు వీరి గురించి తెలీదు, ఎవరన్న వీరి రచనల చిట్ట ఇస్తే బాగుంటుంది. ఒకనిర్ణయం తీసుకోవచ్చు. Chavakiran 04:55, 19 జూలై 2009 (UTC)
- ఎందుకు తొలగించాలో కారణం రాస్తే సభ్యులు చర్చించేందుకు వీలుండేది. {{తొలగించు}} మూసలో "తొలగించు" తరవాత ఒక పైపు ( | ) పెట్టి దాని తర్వాత కారణం రాయవచ్చు - ఇలాగ {{తొలగించు|కారణం}}__చదువరి (చర్చ • రచనలు) 17:12, 19 జూలై 2009 (UTC)
- పైన రవిచంద్ర గారి వ్యాఖ్యలను బట్టి ఈ వ్యక్తికి వికీలో వ్యాసం ఉండగల ప్రాముఖ్యత ఉన్నదా అన్నది సభ్యుల సందేహమనుకుంటా --వైజాసత్య 18:30, 19 జూలై 2009 (UTC)
- విషయ ప్రాధాన్యత విశ్లేషణ
గతంలో మన తెవికీలో రచయిత విషయ ప్రాధాన్యత విషయంలో రచ్చబండలో చర్చించి తయారుచేసుకున్న సూత్రాలు ఇవి. వీటి ఆధారంగా పరిశీలిస్తే ఆవిడ రాసిన అధికారం కావాలి అన్న పుస్తకాన్ని రచయిత్రి స్వంత ప్రచురణ సంస్థ నుంచి కాకుండా అస్మిత వారు ప్రచురించారు. ఆవిడ రాసిన నవల తన్హాయి (ఇది తొలి తెలుగు బ్లాగ్ నవలట!) గురించి విస్తృతమైన చర్చ, సమీక్ష వంటివి జరిగాయి. ఈవిడ రాసిన కవిత ఆంగ్లంలోకి అనువాదం కావడం, ఆమె కథ ప్రాతినిథ్య కథ 2014లో చోటు దక్కించుకోవడం, పత్రికల్లో బహుమతులు రావడం, ఇంటర్వ్యూలు కావడం వంటివీ చాలానే జరిగాయి. (అన్నిటికీ లింకులు ఇవ్వలేకపోతున్నాను, వెతికితే అన్నీ ఆన్లైన్లోనే దొరికేస్తాయి) ఈ వ్యాసం నిస్సందేహంగా విషయ ప్రాధాన్యత ఉన్నదే. --పవన్ సంతోష్ (చర్చ) 08:57, 28 డిసెంబరు 2016 (UTC)