Jump to content

రెండవ జయసింహుడు

వికీపీడియా నుండి

రెండవ జయసింహుడు, సా.శ. 706 - 718 మధ్య 13 సంవత్సరాల పాటు వేంగిని పాలించిన తూర్పు చాళుక్య వంశపు రాజు. తండ్రి మంగి యువరాజు మరణం తరువాత అతను రాజ్యానికి వచ్చాడు.

మంగి యువరాజుకు ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. వారి ద్వారా అతనికి కొక్కిలి విక్రమాదిత్య, రెండవ జయసింహుడు, మూడవ విష్ణువర్ధనుడు అనే ముగ్గురు కుమారులు పృథ్వి పోరి అనే ఒక కుమార్తె ఉన్నారు.[1] తండ్రి మరణం తరువాత రెండవ జయసింహుడు రాజయ్యాడు.

Preceded by తూర్పు చాళుక్యులు
సా.శ. 706 – 718
Succeeded by
కొక్కిలి

కొక్కిలి

[మార్చు]

కొక్కిలి పూర్తి పేరు కొక్కిలి విక్రమాదిత్య భట్టారకుడు. అన్న రెండవ జయసింహుని మరణం తరువాత, అధికారం కోసం కుటుంబంలో అంతర్గత పోరాటం జరిగింది. అతని సవతి తమ్ముళ్లలో చిన్నవాడైన కొక్కిలి, తన అన్న మూడవ విష్ణువర్ధనుని ఓడించి అధికారాన్ని చేపట్టాడు. తూర్పు చాళుక్యుల్లో అధికారం కోసం కలహాలు జరిగిన తొలి సందర్భం ఇది. [2]

కొక్కిలి 6 నెలల పాటు మాత్రమే పాలన చేసాడు. అతని అన్న మూడవ విష్ణువర్ధనుడు అతన్ని ఓడించి, తరిమేసి తాను రాజ్యాన్ని చేపట్టాడు. పారిపోయిన కొక్కిలి మధ్య కళింగలో యలమంచిలి రాజధానిగా చిన్న రాజ్యాన్ని ఏర్పరచుకుని పాలించాడు.[1]

కొక్కిలిని తరిమేసి అతని అన్న మూడవ విష్ణువర్ధనుడు పాలనకు వచ్చాడు.

Preceded by
రెండవ జయసింహుడు
తూర్పు చాళుక్యులు
సా.శ, 718
Succeeded by

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "తూర్పు చాళుక్యులు". ఈనాడు ప్రతిభ. Archived from the original on 2024-04-17. Retrieved 2024-04-17.
  2. నేలటూరి, వెంకటరమణయ్య (1950). The Eastern Calukyas of Vengi. మద్రాసు: వేదం వెంకటరాయ శాస్త్రి & బ్రదర్స్. p. 68.{{cite book}}: CS1 maint: date and year (link)