అక్షాంశ రేఖాంశాలు: 17°40′17″N 80°51′22″E / 17.6714090°N 80.8560630°E / 17.6714090; 80.8560630

రెడ్డిపాలెం (నాగినేనిప్రోలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెడ్డిపాలెం
(నాగినేనిప్రోలు రెడ్డిపాలెం)
—  రెవిన్యూయేతర గ్రామం  —
అక్షాంశరేఖాంశాలు: 17°40′17″N 80°51′22″E / 17.6714090°N 80.8560630°E / 17.6714090; 80.8560630
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మండలం బూర్గంపాడు
ప్రభుత్వం
 - Type పంచాయతి
 - సర్పంచి బాణోతు సరోజ
పిన్ కోడ్ 507114
ఎస్.టి.డి కోడ్ 08746

రెడ్డిపాలెం, భద్రాద్రి జిల్లా, బూర్గంపహడ్ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఇది పంచాయితీ హోదా కలిగిన గ్రామం.[1]

ఇది ప్రముఖ పుణ్యక్షేమైన భద్రాచలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలోని జనాభా 80 శాతం మంది రెడ్డి కులస్థులే అవడం చేతనూ, అలాగే ఈ గ్రామ నిర్మాణం జరిగినది రెడ్డి కులస్థుల వల్లనే అవడం చేత ఈ గ్రామానికి రెడ్డిపాలెం అని పేరు వచ్చింది. ఈ గ్రామంలో సగానికి పైగా కుటుంబీకులు రైతుకారులే. అలాగే ప్రక్కనే ఉన్న సారపాక ఐ.టి.సి పేపరు కర్మాగారంలో పనిచేసే ఉద్యోగులలో ఈ గ్రామంలోని వారే అధికులు. పచ్చని ప్రకృతితో, పంట పొలాలతో ఈ గ్రామం చూడముచ్చటగా ఉంటుంది. అలాగే పక్కా రోడ్లతో ఈ గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది.

చరిత్ర

[మార్చు]

ఈ గ్రామం భద్రాచలం క్షేత్ర చరిత్రలో ముఖ్య ప్రాంతమైన సాకేతపురిలోని ఒక ప్రదేశం. ఈ గ్రామ చరిత్ర పరిశీలించినట్లయితే గ్రామం ఆవిర్భవించడానికి కారణం గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రెడ్లు ఇక్కడికి వలస రావడమే. వారు ఆ ప్రాంత రైతులు అవడం చేత వారికి అక్కడ వ్యవసాయం అనుకూలించక, కలిసిరాక వలసగా ఈ ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేసి, గ్రామాన్ని నిర్మించుకొని ఇక్కడే స్థిరపడ్డారు. ఇలా ఈ రెడ్డిపాలెం గ్రామం ఆవిర్భవించింది.

రాజకీయం

[మార్చు]

ఈ గ్రామంలోని రెడ్లు ఎక్కువ శాతం మంది రాజకీయ రంగప్రవేశం చేసినవారే. మొదట్లో ఈ గ్రామంలోని వారు మునుసుబులుగా ఉండి గ్రామాన్ని పరిపాలించేవారు.

మూలాలు

[మార్చు]
  1. "నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ చెక్కు పవర్‌ రద్దు". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-03-24. Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-05.

వెలుపలి లంకెలు

[మార్చు]