రెడ్డివారి చెంగారెడ్డి
రెడ్డివారి చెంగారెడ్డి | |||
| |||
మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే
| |||
నియోజకవర్గం | నగరి నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 13 జనవరి 1935. కొప్పేడు గ్రామం నిండ్ర మండలం చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | ఆర్.మురగ రెడ్డి (తండ్రి) | ||
జీవిత భాగస్వామి | ఆర్.సుజాతమ్మ | ||
సంతానం | ఇందిరా ప్రియదర్శిని | ||
నివాసం | బంజారా హిల్స్, హైదరాబాద్ |
రెడ్డివారి చెంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్, ఐ & పిఆర్ శాఖ మంత్రిగా పనిచేశాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]ఆర్.చెంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, నిండ్ర మండలం, కొప్పేడు గ్రామంలో జన్మించాడు. ఆయన ఎస్.వి యూనివర్సిటీ నుండి బి.ఏ.పూర్తి చేసి, మద్రాస్ యూనివర్సిటీ నుండి 1962లో బి.ఎల్. పూర్తి చేశాడు.[1] ఆయనకు భార్య సుజాత, కూతురు ఇందిరా ప్రియదర్శిని ఉన్నారు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]ఆర్.చెంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి కొప్పేడు గ్రామం సర్పంచ్‌గా 15 ఏళ్ళు పనిచేసి, పిచ్చాటూరు సమితి అధ్యక్షుడిగా, జెడ్పిటిసిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్దభ్యుడిగా, కార్యదర్శిగా, చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.
ఆర్.చెంగారెడ్డి 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై తిరిగి, 1985, 1989 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 1994లో ఓడిపోయి తిరిగి 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో న్యాయశాఖ, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు.[3] ఆయన 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినా అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ Andhra Pradesh Minister for Law & Courts, Technical Education and Industrial Training Institutes (1 September 2008). "Profile of Sri Chengareddy Reddyvari -Minister for Law & Courts,Technical Education and Industrial Training Institutes" (in ఇంగ్లీష్). Archived from the original on 1 December 2021. Retrieved 1 December 2021.
{{cite news}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2 ఆగస్టు 2013 suggested (help) - ↑ ETV Bharat News (27 February 2021). "మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డితో ఎమ్మెల్యే రోజా భేటీ". Archived from the original on 1 December 2021. Retrieved 1 December 2021.
{{cite news}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 27 ఫిబ్రవరి 2021 suggested (help) - ↑ I&PR (2004). "I&PR Department, A.P". Archived from the original on 1 December 2021. Retrieved 1 December 2021.
{{cite news}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 23 ఏప్రిల్ 2021 suggested (help)