రెడ్ హ్యాట్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్
అభివృద్ధికారులు | రెడ్ హ్యాట్, ఇంక్. |
---|---|
నిర్వహణవ్యవస్థ కుటుంబం | యునిక్స్-వంటిది (రెడ్ హ్యాట్ లినక్స్ ఆధారితం/ఫెడోరా) |
పనిచేయు స్థితి | ప్రస్తుతం |
మూల కోడ్ విధానం | ఉచిత, స్వేచ్ఛా మూల సాప్ఠువేర్ (కొన్ని మినహాయింపులతో) |
తొలి విడుదల | మార్చి 31, 2003 |
ఇటీవల విడుదల | 7.0 / జూన్ 10, 2014 |
Marketing target | వాణిజ్య విపణి (మెయిన్ ఫ్రేమ్స్, సేవకాలు, సూపర్ కంప్యూటర్ తో కలుపుకుని) |
విడుదలైన భాషలు | బహుళబాషలు |
తాజా చేయువిధము | Yum / ప్యాకేజీసామాగ్రి |
ప్యాకేజీ మేనేజర్ | RPM ప్యాకేజీ నిర్వాహకం |
ప్లాట్ ఫారములు | x86, x86-64, IA-64; POWER; S/390; z/Architecture |
Kernel విధము | మోనోలిథిక్ (లినక్స్) |
అప్రమేయ అంతర్వర్తి | గ్నోమ్ |
లైెసెన్స్ | పలు స్వేచ్ఛా సాఫ్టువేర్ లైసెన్సులు, యాజమాన్యితాలు బైనరీ బ్లాబ్స్. |
రెడ్ హ్యాట్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్ అనునది వాణిజ్య విపణి కొరకు రెడ్ హ్యాట్ సంస్థచే అభివృద్ధి చేయబడిన ఒక లినక్స్ ఆధారిత నిర్వాహక వ్యవస్థ. సేవక రూపాంతరాలయిన x86, x86-64, ఇటానియమ్, పవర్ పీసీ, ఐబీయం సిస్టం జడ్ కోసమూ, డెస్కుటాప్ రూపాంతరాలయిన x86, x86-64 కోసం రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ విడుదల చేయబడింది. రెడ్ హ్యాట్ అధికారిక తోడ్పాటు, శిక్షణ, రెడ్ హ్యాట్ ధృవీకరణ కార్యక్రమ కేంద్రాలు అన్నీ రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ తోనే ముడిపడివున్నాయి. అధికారికంగా రెడ్ హ్యాట్ పేర్కొనబడనప్పటికీ, ఇది తరుచూ RHEL గా పిలవబడుతుంది.
నిజానికి రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ యొక్క మొదటి రూపాంతరము అయిన "రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ అడ్వాన్స్డ్ సెర్వర్" పేరుతో విపణిలోకి రావడంతో మొదట్లో అదే పేరుతో(రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్సు) పిలవబడేది. 2003లో రెడ్ హ్యాట్ మరళా రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ అడ్వాన్స్డ్ సెర్వర్ పేరును రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ ఏయస్ గా మార్చి మరో రెండు రూపాలను జోడించింది, రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ ఈయస్, రెడ్ హ్యాట్ లినక్స్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ డబ్యూయస్.
రెడ్ హ్యాట్ ఖచ్ఛితమైన్ ట్రేడ్ మార్కు నియమాలతో ఉన్నప్పుడు రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ యొక్క అధికారిక తోడ్పాటువున్న రూపాంతరాలను ఉచితంగా పునఃపంపిణీ చేయుట పూర్తిగా నిషేధించబడింది. తప్పనిసరి కాకున్నా పంపిణీ సాప్ఠువేర్ కోసం రెడ్ హ్యాట్ ఉచితంగా మూల సంకేతాన్ని అందించింది. ఫలితంగా రెడ్ హ్యాట్ నుండి అధికారిక తోడ్పాటు లేకుండా కొన్ని పంపిణీలు సృష్టించబడి సంఘపు తోడ్పాటుతో రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ పునఃనిర్మించబడి న్యాయబద్దంగా అందుబాటులోకి వచ్చింది. సెంటాస్, సైంటిఫిక్ లినక్స్, ఒరాకిల్ లినక్స్ లు రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్సుతో 100 శాతం అనుగుణ్యతను అందించుటకు లక్షంగా చేసుకున్నాయి. ఇలానే ఇంకా చాలా ఇతర గుర్తించదగిన ఉత్పాదనలు కూడా ఉన్నాయి.
రూపాంతరాలు
[మార్చు]డెస్కుటాప్, సేవక రూపాంతరాలలో "విద్యవిషయక" సంచికలు కూడా ఉన్నాయి. ఇవి పాఠషాలలకు, విద్యార్థులకు తక్కువ ధరకే అందించేవారు ఇంకా రెడ్ హ్యాట్ సాంకేతిక తోడ్పాటు ఐచ్చికంగా అదనం. వినియోగదారులు పరిచయాలు జాల తోడ్పాటు ఆధారంతో వేరేగా కొనుగోలు చేయవచ్చు.
ES, AS, WS అంటే "ప్రారంభ-స్థాయి సేవకం", "ఉన్నత-స్థాయి సేవకం", "కార్య క్షేత్రం". ఇందులో ఎంట్రీ లెవెల్ సేవకం ఉత్పత్తిని కంపెనీ యొక్క మూల ఎంటర్ ప్రైజ్ సెర్వర్ ఉత్పత్తి గానూ, అడ్వాన్స్డ్ లెవెల్ సేవకాన్నిమరింత అధునాతన ఉత్పాదనకు గానూ వినియోగించబడతాయి. ఏదిఏమైనప్పటికీ AS,ES, WS అంటే ఏమిటో రెడ్ హ్యాట్ జాలగూటిలో గానీ అందులోని పత్రీకరణలో గానీ పేర్కొనబడలేదు.
రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ 5లో పాత రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ AS/ES/WS/డెస్కుటాప్ లను ప్రతిస్థాపించే కొత్త సంచికలు ఉన్నాయి.
రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ అధునాతన వేదిక (పాత AS) రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ (పాత ES) (2 సీపీయులకు పరిమితం) రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ డెస్కుటాప్ విత్ వర్క్ స్టేషను, మల్టీ-ఓయస్ ఐచ్ఛికం రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ డెస్కుటాప్ విత్ వర్క్ స్టేషను ఐచ్ఛికం (పాత WS) రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ డెస్కుటాప్ విత్ మల్టీ-ఓయస్ ఐచ్ఛికం రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ డెస్కుటాప్ (పాత డెస్కుటాప్)
అంతేకాకుండా రాబోయే విపణుల కోసం రెడ్ హ్యాట్ వారి రెడ్ హ్యాట్ గ్లోబల్ డెస్కుటాప్ ఎడిషన్ ను కూడా ప్రకటించింది.
RHEL 4, 3, ప్రముఖ విడుదలలు నాలుగు రూపాంతరాలలో ఉంది:
సంక్లిష్ట మిషన్/ఎంటర్ ప్రైజ్ కంప్యూటర్ వ్యవస్థల కోసం రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్. తోడ్పాటుగల నెట్వర్క్ సేవకాల కోసం రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ ES సాంకేతికంగా శక్తివంతమైన వాడుకరి ఎంటర్పైజ్ డెస్కుటాపుల మెరుగైన పనితీరు సంగణన కోసం రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ WS ఎంటర్ ప్రైజ్ కోసం ఏక-వాడుకరి డెస్కుటాపుల యొక్క బహళ విస్తారణకై కోసం రెడ్ హ్యాడ్ డెస్కుటాప్
జీవితచక్రం తేదీలు
[మార్చు]రూపాంతరం | విడుదల తేదీ | తోడ్పాటు ముగింపు తేదీ |
---|---|---|
రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ 2.1 | (AS)(ES) |
(ఉద్పాదన ముగిసింది 1) (ఉద్పాదన ముగిసింది 2) |
రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ 3 | (ఉత్పాదన ముగిసింది 1) (ఉత్పాదన ముగిసింది 2) | |
రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ 4 | (ఉత్పాదన ముగిసింది 1) (ఉత్పాదన ముగిసింది 2) | |
ఉత్పాదన ముగిసింది 5 | (ఉత్పాదన ముగిసింది 1) Q1 2014 (ఉత్పాదన ముగుస్తుంది 2) (ఉత్పాదన ముగుస్తుంది 3 / క్రమ జీవిత చక్రం ముగుస్తుంది) Q1 2020 (పొడిగించిన జీవిత చరిత్ర ముగుస్తుంది) | |
రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ 6 | Q2 2016 (ఉత్పాదన ముగుస్తుంది 1) Q2 2017 (ఉత్పాదన ముగుస్తుంది 2) (ఉత్పాదన ముగుస్తుంది 3 / క్రమ జీవిత చక్రం ముగుస్తుంది) Q4 2023 (పొడిగించిన జీవిత చరిత్ర ముగుస్తుంది) | |
రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ 7 | 10 జూన్ 2014 | Q4 2019 ( తొలి ఉత్పాదన దశ ముగుస్తుంది)
Q4 2020 ( రెండవ ఉత్పాదన దశ ముగుస్తుంది) 30 జాన్ 2024 ( మూడవ ఉత్పాదన దశ ముగుస్తుంది) |