Jump to content

రేణుకా సింగ్

వికీపీడియా నుండి
రేణుక సింగ్ సరుతా
రేణుకా సింగ్


కేంద్ర‌ గిరిజన శాఖ సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు జాస్వంత్ సింహ్ సుమన్ భాయ్ భంభోర్

లోక్‌సభ సభ్యురాలు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 మే 2019
ముందు కమల్ భాన్ సింగ్ మార్బి
నియోజకవర్గం సుర్గుజా లోక్‌సభ నియోజకవర్గం

రాష్ట్ర మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
7 డిసెంబర్ 2003 – 18 జూన్ 2005
తరువాత లత ఉసెండి

శాసనసభ్యురాలు
పదవీ కాలం
7 డిసెంబర్ 2003 – 8 డిసెంబర్ 2013
ముందు తులేశ్వర్ సింగ్
తరువాత ఖేల్సై సింగ్
నియోజకవర్గం ప్రేమ్ నగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-01-05) 1964 జనవరి 5 (వయసు 60)[1]
పొడి, కొరియా జిల్లా, మధ్యప్రదేశ్, భారతదేశం
(ఇప్పుడు ఛత్తీస్‌గఢ్, భారతదేశం)
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి నరేంద్ర సింగ్
సంతానం 2 కుమారులు & 2 కూతుళ్లు
నివాసం రామానుజ నగర్, సుర్గుజా, ఛత్తీస్‌గఢ్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకురాలు, వ్యవసాయం

రేణుకా సింగ్‌ సరుత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో సుర్గుజా నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర‌ గిరిజన శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వహిస్తుంది.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

రేణుకా సింగ్‌ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2000 నుండి 2003 వరకు జంపద్ పంచాయితీ సభ్యురాలిగా, 2001 నుండి 2003 వరకు సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలిగా పని చేసింది. ఆమె 2003లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రేమ్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. ఆమె 2003 నుండి 2005 వరకు రాష్ట్ర మహిళా & శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పని చేసి, 2008లో జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైంది.

రేణుకా సింగ్‌ 2013లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. ఆమె 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున సుర్గుజా లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖేల్సై సింగ్ పై 157873ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచింది. రేణుకా సింగ్‌ 2019 మే 30న నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర‌ గిరిజన శాఖ సహాయ మంత్రిగా నియమితురాలైంది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Lok Sabha (2019). "Renuka Singh Saruta". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
  2. BBC News తెలుగు (7 July 2021). "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  3. Andhra Jyothy (8 July 2021). "కొలువుదీరిన కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
  4. Eenadu (8 July 2021). "మోదీ కొత్త జట్టు.. మంత్రుల శాఖలివే." Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.