రేవతీదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేవతీదేవి

రేవతీదేవి తెలుగు రచయిత్రి. ఆమెకు 1983 లో "శిలాశోలిత"కు ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది. స్ర్తీ వాద కవిత్వంలో తొలి తెలుగు కవయిత్రి రేవతీ దేవి. తన అనుగార దగ్థ హృదయ జ్వాల సెగలతో తెలుగు కవితా ప్రపంచాన్ని జ్వలింపచేశారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె స్త్రీవాద సాహిత్యంలో తొలివాద స్త్రీవాద కవయిత్రి. ఆమె కవిత్వంలో స్త్రీవాద ఛాయలే కనిపిస్తాయి. ధిక్కార స్వరమే వినిపిస్తుంది. 1979లో ఆమె తన డైరీలో రాసుకున్న కవితలన్నీ 1980లో "శిలాలోలిత" అనే కావ్యాంగా ప్రచురించబడ్డాయి. ఫిలసాఫికల్ అవుట్ లుక్ తో స్త్రీ సహజ భావోద్వేగంతో చక్కటి కవిత్వం రాసిన కవయిత్రి ఆమె. తరతరాలుగా పురుషాధిక్య సమాజం స్త్రీలను బానిసలుగా భావించి దోచుకున్న వైనాన్ని ఆమె తన కవితల్లో ఎండకట్టారు. గాఢ తాత్వికతతో ఆమె కవితల్లో నిండుతనం వస్తుంది. ‘స్త్రీ భావాల్ని ఉన్నవి ఉన్నట్లుగా ఏ ముసుగులూ, తొడుగులూ లేకుండా వ్యక్తీకరించిన వెైఖరి కనిపిస్తుంది. రేవతిదేవి భావాల్లో నిజాయితీ, ఆమె ఆవేదనలోని శీలతత్వం, ఆమె ఆలోచనలోని పరిపూర్ణత్వం, ఆమె ఆరాటంలోని అస్థిత్వవాద ధోరణి, ఆమె ఆంతరంగంలోని సంక్షుభిత విలయనృత్యాలు’ అని పి. లక్ష్మి వ్యాఖ్యానించారు.[2]

రచనా శైలి[మార్చు]

"నేనెవరినో మీ కెవరికీ తెలియదు. ఆర్తి సెగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పు పువ్వును. ఆ కళ్ళు అనురాగం కళ్ళు. లోకమంతట్లోనూ నన్నే చూసేది ఆ అనురాగపుటందమైన కళ్ళు. యుగ యుగాల సమస్త ప్రాణకోటి అనురాగాన్ని. నా పైన అవిరళంగా వర్షించే అనురాగ మేఘాలు ఆ కళ్ళు. ఈ హృదయం రసజ్వలిత దాహంతో వెచ్చగా విచ్చుకొన్న నెత్తురు పువ్వు". స్ర్తీలంటే కేవలం శరీరాలే తప్ప హృదయాలు గుర్తుకు రాని ప్రపంచంలో రవంత అనురాగ సుగంధం కోసం, కాసింత వలపు పరిమళం కోసం తపించి, జ్వలించి తన హృదయ పుష్పాన్ని నిస్పంకోచంగా రేకులు రేకులుగా విప్పి పరచింది రేవతీ దేవి. అవయవాలకే తప్ప ఆత్మలకు తావు లేని సాహిత్య ప్రపంచంలో మొట్టమొదట ‘అనురాగం’ అనే నాలుగు అక్షరాల పదాన్ని ప్రయోగించిన తొలి కవయిత్రి రేవతీ దేవి.. .తన కలల గాలిపటాన్ని నిర్భయంగా ఎరుగవేసి, తన కాంక్షల చిత్తరువులపై పరదాలు తొలగించి తన అంతరంగ వర్ణాలను ప్రదర్శించిన భావుకురాలు రేవతీదేవి. కోపం, ద్వేషం, కోరిక మొదలైన రంగు రంగుల ఇంద్రధనుస్సుల సౌందర్యాలను పాఠకుల హృదయ వేదికలపై ఆరబోసిన రేవతీ దేవి రచించిన మరో కవిత ‘దిగులు’. ‘దిగులు/ దిగులు దిగులుగా దిగులు/ ఎందుకా/ ఎందుకో చెప్పే వీలుంటే/ దిగులెందుకు’ అని చెప్పలేని దిగులును గురించి అద్భుతంగా వ్యక్తీకరిస్తుంది. స్ర్తీవాద కవిత్వంలో అనితర సాధ్యమైన శైలి రేవతీ దేవిది.[1]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]