Jump to content

రైల్‌రాడార్

వికీపీడియా నుండి

రైల్‌రాడార్ GPS (రైల్‌యాత్రి ద్వారా) అనేది భారతదేశంలో నడుస్తున్న ప్యాసింజర్ రైళ్ల కదలికలను మ్యాప్‌లో చూడటానికి వీలు కలిగించే లైవ్ ట్రాకర్. భారతదేశంలోని అన్ని ప్యాసింజర్ రైళ్లను ప్రభుత్వ యాజమాన్యంలోని భారతీయ రైల్వేలు నిర్వహిస్తుంది. మొదటి విడుదలలో మ్యాప్‌లో చూపించే రైళ్ల స్థానం నిజ సమయం నుండి 15 - 30 నిమిషాలు ఆలస్యంగా చూపేది. ఇండియన్ రైల్వేస్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS), రైల్‌యాత్రిలు సంయుక్తంగా రైల్‌రాడార్‌ను సృష్టించాయి.[1] ఈ సేవను 2012 అక్టోబరు 10 న ప్రారంభించారు.[2] రైల్‌రాడార్ దాని వెబ్ మ్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌గా గూగుల్ మ్యాప్స్ని ఉపయోగిస్తుంది. దీన్ని వెబ్‌సైటుగానూ, మొబైల్ యాప్ రూపంలోనూ యాక్సెస్ చేయవచ్చు. 2013 సెప్టెంబరు 6 న ఈ సైటును భారతీయ రైల్వేలు నిలిపివేసాయి. మళ్ళీ 2013 నవంబరులో పునఃప్రారంభించారు. అయినప్పటికీ, రైల్‌రాడార్ సేవ అసలు నడుస్తున్న స్థితిని లేదా రైలు వాస్తవ స్థానాన్ని అందించలేకపోయింది.

రైల్‌యాత్రి, 2015 నవంబరులో రైల్‌రాడార్ GPSతో సైట్‌ను పునఃప్రారంభించింది.[3][4][5] రైల్‌రాడార్ GPS రైలులో కూర్చున్న స్మార్ట్‌ఫోన్ ప్రయాణీకులు ప్రసారం చేసే లొకేషన్‌ల నమూనాను విశ్లేషించి రైలు స్థానాలను నిర్ణయిస్తుంది. గూగుల్ మ్యాప్స్ రోడ్డుపై ట్రాఫిక్ సాంద్రతను నిర్ణయించే విధానం లోనే ఇది కూడా పనిచేస్తుంది. రైల్‌రాడార్ GPS గూగుల్ మ్యాప్‌లో ప్రదర్శించబడే రైలు ట్రాకింగ్ డేటాను చూపుతుంది. ఇది రైళ్ల ఆలస్యం స్థితిని కూడా సూచిస్తుంది - సమయానికి నడిచే రైళ్లకు ఆకుపచ్చ సూచికలు, ఆలస్యంగా నడిచేవి ఎరుపు రంగులో ఉంటాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS)

మూలాలు

[మార్చు]
  1. Rohan Dua (2013-01-29). "Rail Radar: Railway's new toy for anxious travellers". The Times of India. TNN. Archived from the original on 2013-04-11. Retrieved 2013-07-08.
  2. Moulishree Srivastava and Vidhi Choudhary (2012-10-10). "Rail Radar to help track trains". Livemint. Retrieved 2013-07-08.
  3. "RailYatri relaunches RailRadar with GPS train tracking". MediaNama. 25 September 2015. Retrieved 2015-09-27.
  4. "GPS solution makes tracking trains easy on Google Maps - CIOL". 25 September 2015. Retrieved 2015-09-27.
  5. "RailYatri.in brings GPS based train tracking on Google Maps". 26 September 2015. Retrieved 2015-09-27.