రొక్కం రాధాకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రొక్కం రాధాకృష్ణ (అక్టోబరు 10, 1942 - జనవరి 28, 2022) విద్యావేత్త, ఆర్థికవేత్త, సామాజిక అధ్యయనవేత్త. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) ప్రస్తుత చైర్మన్‌.[1]

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కురుడు గ్రామంలో అక్టోబరు 10, 1942న జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అర్ధశాస్త్రం, సాంఖ్యాక శాస్ర్తాల్లో పీజీ, పూణె విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు.


ప్రొఫెసర్‌ రొక్కం రాధాకృష్ణ అనారోగ్యంతో జనవరి 28, 2022న విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. ఆయన సతీమణి చంద్రాణి నాలుగేళ్ల కిందట మృతిచెందారు. వారి సంతానం కుమారుడు వంశీ, కుమార్తె అఖిల.[2]

మూలాలు

[మార్చు]
  1. "ఏయూ మాజీ ఉప కులపతి రాధాకృష్ణ కన్నుమూత". andhrajyothy. Retrieved 2022-01-29.
  2. "ఆచార్య రొక్కం రాధాకృష్ణ కన్నుమూత". EENADU. Retrieved 2022-01-29.