రోజర్ ట్వోసే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోజర్ ట్వోస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రోజర్ గ్రాహం ట్వోస్
పుట్టిన తేదీ (1968-04-17) 1968 ఏప్రిల్ 17 (వయసు 56)
టార్క్వే, ఇంగ్లాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మాధ్యమం
పాత్రబ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 194)1995 25 October - India తో
చివరి టెస్టు1999 19 August - England తో
తొలి వన్‌డే (క్యాప్ 95)1995 15 November - India తో
చివరి వన్‌డే2001 28 February - Pakistan తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1988Devon
1989–1995Warwickshire
1989/90Northern Districts
1991/92–1993/94Central Districts
1994/95–2000/01Wellington
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 16 87 178 333
చేసిన పరుగులు 628 2,717 9,802 9,102
బ్యాటింగు సగటు 25.12 38.81 36.98 34.60
100లు/50లు 0/6 1/20 18/53 11/57
అత్యుత్తమ స్కోరు 94 103 277* 124*
వేసిన బంతులు 211 272 9,130 5,998
వికెట్లు 3 4 133 160
బౌలింగు సగటు 43.33 58.75 31.85 26.87
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 2 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/36 2/31 6/28 5/30
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 37/– 96/– 120/–
మూలం: Cricinfo, 2018 7 September

రోజర్ గ్రాహం ట్వోస్ (జననం 1968, ఏప్రిల్ 17) ఇంగ్లీషులో జన్మించిన న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1990ల మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 16 టెస్ట్ మ్యాచ్‌లు, 87 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. 2021 ఫిబ్రవరిలో, త్వోస్ న్యూజీలాండ్ క్రికెట్ డైరెక్టర్‌గా నియమితులయ్యాడు.[1] 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీని గెలుచుకున్న న్యూజీలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

1998/1999 సీజన్‌లో న్యూజీలాండ్ జట్టుకు తిరిగి వచ్చాడు. "ది స్విచ్-హిట్టర్"గా పిలువబడే ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 1999 క్రికెట్ ప్రపంచ కప్‌లో 79.50 సగటుతో 318 పరుగులు చేశాడు.

టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తరువాత అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 2వ స్థానానికి చేరుకున్నాడు. 2000లో న్యూజీలాండ్ దక్షిణాఫ్రికా పర్యటనలో 75 మ్యాచ్‌ల తర్వాత తన మొదటి, ఏకైక సెంచరీని సాధించాడు. 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ సెమీఫైనల్‌లో పాకిస్తాన్‌పై 87 పరుగులు చేపి, పాకిస్తాన్ ను ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. ఫైనల్‌లో భారత్‌పై వారి విజయానికి కూడా దోహదపడ్డాడు. న్యూజీలాండ్ మొదటి ప్రధాన ఐసీసీ టోర్నమెంట్‌ను గెలిచి, ఆ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీని చేజిక్కించుకుంది.

మూలాలు

[మార్చు]
  1. "Roger Twose appointed New Zealand Cricket director". ESPN Cricinfo. Retrieved 15 February 2021.

బాహ్య లింకులు

[మార్చు]