Jump to content

రోషి అగస్టిన్

వికీపీడియా నుండి
రోషి అగస్టిన్
రోషి అగస్టిన్


జలవనరుల శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
20 మే 2021 (2021-05-20)
ముందు కె. కృష్ణన్‌కుట్టి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
20 మే 2001 (2001-05-20)
ముందు పి. పి. సులైమాన్ రావ్థర్
నియోజకవర్గం ఇడుక్కి

వ్యక్తిగత వివరాలు

జననం 20 జనుఅరీ 1969
పాలా, కేరళ, భారతదేశం
జాతీయత India భారతీయుడు
రాజకీయ పార్టీ కేరళ కాంగ్రెస్ (ఎం)
జీవిత భాగస్వామి రాణి థామస్
సంతానం 3
నివాసం చక్కంపూజ , పాలా, కేరళ, భారతదేశం

రోషి అగస్టిన్ కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై విజయన్ రెండవ మంత్రివర్గంలో 2021 మే 21 నుండి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

రోషి అగస్టిన్ కేరళ రాష్ట్రం, పాలాలో 1969 జనవరి 20న అగస్టీన్, లీలమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన పాలాలోని సెయింట్ థామస్ కాలేజీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఆ తరువాత తిరువనంతపురంలోని కేరళ లా అకాడమీ నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రోషి అగస్టిన్ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి 1995లో కేరళ కాంగ్రెస్ (ఎం) పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన చేపట్టిన లిబరేషన్ 2001 మార్చిలో జరిగిన లిబరేషన్ ర్యాలీ ఆయనకు కేరళలో మంచి గుర్తింపు తెచ్చాయి. ఆయన 1996లో జరిగిన అసీంబ్లీ ఎన్నికల్లో పెరంబ్రా నియోజకవర్గం నుండి పోటీ చేసి సీపీఎం అభ్యర్థి ఎన్‌కే రాధ చేతిలో 1,358 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.

రోషి అగస్టిన్ ఆ తరువాత 2001లో ఇడుక్కి నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై, 2021 మే 20 నుండి పినరయి విజయన్ రెండవ మంత్రివర్గంలో జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[3]

ఎన్నికల్లో పోటీ

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం రాజకీయ ఫ్రంట్ ప్రత్యర్థి ఫలితం మెజారిటీ
1996 పెరంబ్రా యు.డి.ఎఫ్ ఎన్‌కే రాధ ఓటమి 1,358
2001 ఇడుక్కి యు.డి.ఎఫ్ MS జోసెఫ్ (స్వతంత్ర) గెలిచాడు 13,719[4]
2006 ఇడుక్కి యు.డి.ఎఫ్ సీవీ వర్గీస్ ( సీపీఐ (ఎం) ) గెలిచాడు 16,340[5]
2011 ఇడుక్కి యు.డి.ఎఫ్ సీవీ వర్గీస్ ( సీపీఐ (ఎం) ) గెలిచాడు 15,806[6]
2016 ఇడుక్కి యు.డి.ఎఫ్ అడ్వా. కె. ఫ్రాన్సిస్ జార్జ్ (స్వతంత్ర) గెలిచాడు 9,333[7]
2021 ఇడుక్కి ఎల్‌డిఎఫ్ అడ్వా. కె. ఫ్రాన్సిస్ జార్జ్ ( కేరళ కాంగ్రెస్ (జె) ) గెలిచాడు 5,573[8]

మూలాలు

[మార్చు]
  1. Financial Express (21 May 2021). "Kerala Ministers List 2021: Check full list of cabinet ministers and their portfolios" (in ఇంగ్లీష్). Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  2. OnManorama (19 May 2021). "Jose K Mani's trusted aide in Cabinet". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  3. The Hindu (21 May 2021). "Kerala Cabinet | CM Pinarayi Vijayan retains Home, Veena gets Health" (in Indian English). Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  4. "Kerala Assembly Election – 2001". Elections.in. Retrieved 2021-11-24.
  5. "Kerala Assembly Election – 2006". Elections.in. Retrieved 2021-11-24.
  6. "Kerala Assembly Election – 2011". Elections.in. Retrieved 2021-11-24.
  7. "Kerala Assembly Election – 2016". Elections.in. Retrieved 2021-11-24.
  8. "Kerala Assembly Election – 2021". Elections.in. Retrieved 2021-11-24.