Jump to content

కె. కృష్ణన్‌కుట్టి

వికీపీడియా నుండి
కె. కృష్ణన్‌కుట్టి
కె. కృష్ణన్‌కుట్టి


విద్యుత్ & ఫర్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
20 మే 2021 (2021-05-20)
ముందు ఎంఎం మణి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2 జూన్ 2016 (2016-06-02)
ముందు కె. అచ్యుతన్
నియోజకవర్గం చిత్తూరు

పదవీ కాలం
26 నవంబరు 2018 (2018-11-26) – 3 మే 2021 (2021-05-03)
ముందు పి. జె. జోసెఫ్

ఎమ్మెల్యే
పదవీ కాలం
1991 (1991) – 1996 (1996)
ముందు కే. ఏ. చంద్రన్
తరువాత కె. అచ్యుతన్
నియోజకవర్గం చిత్తూరు
పదవీ కాలం
1980 (1980) – 1987 (1987)
ముందు పి. శంకర్
తరువాత కే. ఏ. చంద్రన్
నియోజకవర్గం చిత్తూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1944-08-13) 1944 ఆగస్టు 13 (వయసు 80)
పెరుమట్టి, మలబార్ జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా

(ప్రస్తుతం పాలక్కాడ్, కేరళ, భారతదేశం)

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనతాదళ్ (సెక్యులర్)
జీవిత భాగస్వామి కె. విలాసిని
నివాసం పెరియార్, క్లిఫ్ హౌస్ కాంపౌండ్, నాంథెన్‌కోడ్, తిరువనంతపురం, కేరళ
వృత్తి రాజకీయ నాయకుడు

కె. కృష్ణన్‌కుట్టి కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై విజయన్ రెండవ మంత్రివర్గంలో 2021 మే 21 నుండి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

కె. కృష్ణన్‌కుట్టి కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చి 1969లో కాంగ్రెస్ చీలిపోయిన తరువాత జనతా పార్టీలో చేరి ఆ తరువాత జనతాదళ్‌ పార్టీలో చేరాడు. ఆయన 1980లో జరిగిన కేరళ శాసనసభ ఎన్నికల్లో చిత్తూరు నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి పి.శంకర్‌పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. కె. కృష్ణన్‌కుట్టి 1982లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముళ్లపల్లి రామచంద్రన్ పై గెలిచి 1987లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కె.ఏ. చంద్రన్‌ చేతిలో ఓడిపోయాడు.

కె. కృష్ణన్‌కుట్టి 1996, 2001, 2006, 2011లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కె. అచ్యుతన్ చేతిలో ఓడిపోయాడు. ఆయన 2009 జనతాదళ్‌లో చీలిక తర్వాత ఎం.పీ. వీరేంద్ర కుమార్ నేతృత్వంలోని పార్టీకి మద్దతుగా నిలిచి 2014లో మాథ్యూ టి థామస్ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) పార్టీలో చేరి 2016లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చిత్తూరు నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కె. అచ్యుతన్ పై గెలిచి పినరయి విజయన్ మంత్రివర్గంలో 2016 జూన్ 2 నుండి 2021 వరకు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశాడు.

కె. కృష్ణన్‌కుట్టి 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చిత్తూరు నుండి జనతాదళ్ (సెక్యులర్) పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కె. అచ్యుతన్ పై గెలిచి పినరయి విజయన్ రెండవ మంత్రివర్గంలో 2021 మే 20 నుండి విద్యుత్ & ఫర్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Financial Express (21 May 2021). "Kerala Ministers List 2021: Check full list of cabinet ministers and their portfolios" (in ఇంగ్లీష్). Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  2. OnManorama (20 May 2021). "K Krishnankutty: Chittoor's waterman". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  3. The Hindu (21 May 2021). "Kerala Cabinet | CM Pinarayi Vijayan retains Home, Veena gets Health" (in Indian English). Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.