రోహిత్ వేముల
రోహిత్ వేముల | |
---|---|
జననం | |
మరణం | 2016 జనవరి 17 | (వయసు 26)
మరణ కారణం | ఆత్మహత్య |
తల్లిదండ్రులు |
|
రోహిత్ చక్రవర్తి వేముల హైదరాబాదు విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి విద్యార్థిగా చదువుకునేవాడు. జూలై 2015 నుంచి విశ్వవిద్యాలయం రోహిత్‌కు 25,000 ఉపకారవేతనాన్ని నిలిపివేసింది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగే వివిధ సమస్యల వలన రోహిత్‌ను కేంద్రం చేసుకుని ప్రతికూల వర్గాల వ్యక్తులు దాడి చేసారని రోహిత్ స్నేహితులు అంటారు. విద్యార్థిగా రోహిత్ అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్ సభ్యుడు. విశ్వవిద్యాలయం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ఉపకారవేతన నిలుపుదలకు కారణం "పేపర్‌వర్క్"లో జరిగిన ఆలస్యమని చెప్పింది. [1] ఆగస్టు 5న ఎన్. సుశీల్ కుమార్ తనపై రోహిత్ వేముల, మరో నలుగురు విద్యార్థులు దాడి చేసారని ఆరోపించాడు. ఆగస్టు 17న, అప్పటి బిజెపి లోక్‌సభ సభ్యులు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మానవ వనరుల మంత్రికి విశ్వవిద్యాలయంలో కులపరమైన, తీవ్రవాద, దేశద్రోహ రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయంటూ లేఖ రాసారు. సెప్టెంబర్‌లో పర్యవసానంగా ఐదుగురు విద్యార్థులను విశ్వవిద్యాలయం సస్పెండ్ చేసింది. డిసెంబర్ 17న ఈ నిర్ణయంపై మార్పుండదని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.[2]
సస్పెండ్ చేయటం వలన చదువు నిలిచిపోతుందని రోహిత్ 2016 జనవరి 17న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య జరిగిన తరువాత దేశవ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. దళితులకు విరుద్ధంగా జరుగుతున్న వివక్షకు ఉదాహరణగా ఈ ఆత్మహత్యను కొందరు పరిగణిస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ "Rohith Vemula - an unfinished portrait". Hindustantimes.com. Retrieved 3 May 2024.
- ↑ "Behind Rohith Vemula's suicide: how Hyderabad Central University showed him the door". The Indian Express. 19 January 2016. Retrieved 20 January 2016.