Jump to content

ర్యూజిన్

వికీపీడియా నుండి
ర్యూజిన్
ర్యూజిన్ ఆభరణాన్ని దొంగిలిస్తున్న యువరాణి టమటోరి- ఉటగావా కునియోషి వర్ణ చిత్రం
ర్యూజిన్, సముద్రపు దేవుడు (డ్రాగన్)

ర్యూజిన్ (龍神), కొన్ని సంప్రదాయాలలో, జపనీస్ పురాణాలలోని ఇష్ట దైవమైన ఓవటట్సుమీ(Ōwatatsumi)తో సమానంగాకనిపించే సముద్రపు దేవుడు. అనేక పాఠాంతరాల్లో, ర్యూజిన్ కి మానవ ఆకారంలోకి మారగల సామర్థ్యం ఉన్నట్టుగా కనిపిస్తుంది. చాలామంది అతనికి ఔషధాల మీద జ్ఞానం కూడా ఉందని నమ్ముతారు, అలాగే అతన్ని వర్షాన్ని, ఉరుములను రప్పించే వ్యక్తిగా భావిస్తారు. ర్యూజిన్ అనేక కుటుంబ సమూహాలకు కులదైవం (ఉజిగామి) కూడా. [1] [2]

సముద్రపు శక్తిని సూచించే పెద్ద నోరుతో ఉండే ఈ జపనీస్ డ్రాగన్ ని జపాన్ వారు మంచి దేవుడి గా, పోషకుడిగా పరిగణిస్తారు. ఎందుకంటే, వారు సహస్రాబ్దాలుగా సముద్రపు అనుగ్రహంతో జీవిస్తున్నారు. ర్యూజిన్, కుబ్లాయ్ ఖాన్ పంపిన మంగోలియన్ యుద్ధనౌకల గుంపును హరికేన్ తో ముంచెత్తి సవాలును ఎదుర్కున్న ధీరుడిగా ఘనత పొందాడు. ర్యూజిన్ నివాసం ర్యూగూ-జో (Ryūgū-jō) , సముద్రం అడుగున ఎరుపు, తెలుపు రంగు పగడాలతో నిర్మితమైన రాజభవనం. అక్కడి నుండే అతను అద్భుత పోటు ఆభరణాలతో అలలను నియంత్రిస్తాడు. తరచుగా సముద్ర తాబేళ్లు, చేపలు, జెల్లీ ఫిష్, పాములు, ఇతర సముద్ర జీవులు ర్యుజిన్ సేవకులుగా కనిపిస్తాయి. [3] [4]

పురాణాలు

[మార్చు]

జెల్లీ ఫిష్ తన ఎముకలను ఎలా కోల్పోయింది

[మార్చు]

జెల్లీ ఫిష్ తన ఎముకలను ఎలా పోగొట్టుకుంది అనేది, ర్యూజిన్ కు సంబంధించిన ఒక పురాణగాథ . ఈ కథనం ప్రకారం, ర్యూజిన్ కోతి కాలేయాన్ని తినాలని కోరుకున్నాడు (కథకు సంబంధించిన కొన్ని కథనాల్లో, తన నయంకాని దద్దుర్లు నయం చేసుకోవడానికి), దాని కోసం కోతిని తీసుకురావడానికి జెల్లీ ఫిష్‌ను పంపాడు. కోతి తన కాలేయాన్ని అడవిలో ఒక కూజాలో పెట్టానని, దానిని తీసుకువస్తానని అబద్ధం చెప్పి జెల్లీ ఫిష్ నుండి తప్పించుకుంది. జెల్లీ ఫిష్ తిరిగి వచ్చి రియోజిన్‌కి జరిగిన విషయాన్ని చెప్పడంతో, ర్యూజిన్ కోపంతో జెల్లీ ఫిష్‌ని ఎముకలు నలిగేలా కొట్టాడు.

తవారా తోడా కథ

[మార్చు]

  ఒక పౌరాణిక కథనంలో, ర్యూజిన్ తన రాజ్యంపై దండెత్తిన భారీ శతపాదుల ను వదిలించుకోవటం కోసం, తవారా తోడా(Tawara Toda) అనే పేరు గల ఒక వ్యక్తి సహాయం కోరగా, తవారా తోడా దానికి అంగీకరించి ర్యూజిన్‌తో కలిసి అతని ఇంటికి వస్తాడు. ఆ తరువాత తవారా తోడా ఆ శతపాదిని చంపినప్పుడు, ర్యూజిన్ అతనికి ఒక బియ్యపు సంచిని బహుమతిగా ఇస్తాడు.[5]

జింగు మహారాణి

[మార్చు]

పురాణాల ప్రకారం, జింగూ సామ్రాజ్ఞి, ర్యూజిన్ పోటు ఆభరణాల సహాయంతో కొరియాపై తన దాడిని నిర్వహించగలిగింది. ఇంకో కథనంలో జింగూ సామ్రాజ్ఞి, ర్యూజిన్ పోటు ఆభరణాలను రాబట్టుకోవడానికి ఐసోరాను ర్యూజిన్ రాజభవనానికి పంపినట్టు కనిపిస్తుంది. [6]

కొరియన్ నౌకాదళాన్ని ఎదుర్కోవటానికి జింగూ రాణి ముందుగా ఆటుపోట్లను తగ్గించే కంజూ(kanju)ఆభరణాన్ని సముద్రంలోకి విసిరేసింది దాంతో కొరియన్ నౌకాదళం నిలిచిపోయి, అందరూ తమ నౌకల నుండి బయటికి వచ్చారు. అప్పుడు రాణి, మంజూ(manju) ఆభరణాలను సముద్రంలోకి విసరగానే నీరు ఒక్కసారిగా పైకి లేచి, కొరియన్ సైనికులను ముంచివేస్తుంది. ఈ పౌరాణిక ప్రాశస్త్యం తెలియచెప్పే పండుగను యాసకా పుణ్యక్షేత్రంలో జియోన్ మత్సూరి అనే పేరుతో ప్రతి ఏటా జరుపుకుంటారు.

కుటుంబం

[మార్చు]

వేటగాడు, యువరాజు అయిన హూరిని వివాహం చేసుకున్న అందమైన దేవత టయోటామా-హిమ్ ర్యూజిన్ కుమార్తె. కాగా, జపాన్ మొదటి చక్రవర్తి, జిమ్ము చక్రవర్తి, ఒటోహిమ్, హూరీల మనవడు అని చెబుతారు. ఈ విధంగా, ర్యూజిన్ జపాన్ సామ్రాజ్య రాజవంశపు పూర్వీకులలో ఒకడిగా చెప్పుకుంటారు.

ఆరాధన

[మార్చు]

ర్యూజిన్ షింకో(Ryūjin shinkō (竜神信仰, "డ్రాగన్ గాడ్ ఫెయిత్"), షింటో మత విశ్వాసం లో జల దైవంగా పూజలందుకునే డ్రాగన్. ఈ విశ్వాసం వ్యవసాయ ఆచారాలతోను, వర్షాలరాకకై జరిపే ప్రార్థనలతోనూ, మత్స్యకారుల వేట సఫలతల తోనూ ముడిపడి ఉంది.

జపాన్ అంతటా, ముఖ్యంగా స్థానికంగా చేపల వేటపైనా, వర్షాధార వ్యవసాయం పైనా ఆధార పడ్డ ముఖ్యమైన గ్రామీణ ప్రాంతాల్లో ఈ దేవునికి పుణ్యక్షేత్రాలు ఎక్కువగా ఉన్నాయి. [2]

ప్రస్తావనలు

[మార్చు]
  1.  1. Ph.D, ఎవాన్స్ లాన్సింగ్ స్మిత్; బ్రౌన్, నాథన్ రాబర్ట్ (2008-07-01). ది కంప్లీట్ ఇడియట్స్ గైడ్ టు వరల్డ్ మిథాలజీ. పెంగ్విన్. ISBN 978-1-101-04716-3.
  2. "ర్యుజిన్". ప్రపంచ చరిత్ర ఎన్సైక్లోపీడియా. 2020-11-13న పునరుద్ధరించడం జరిగింది.
  3. గగ్నే, టామీ (2018-12-15). జపనీస్ గాడ్స్, హీరోస్, మిథాలజీ. ABDO. ISBN 978-1-5321-7070-6.
  4. కౌల్టర్, చార్లెస్ రస్సెల్; టర్నర్, ప్యాట్రిసియా (2013-07-04). పురాతన దేవతల ఎన్సైక్లోపీడియా. రూట్లెడ్జ్. ISBN 978-1-135-96390-3.
  5. https://www.google.com/books/edition/Handbook_of_Japanese_Mythology/gqs-y9R2AekC?hl=en&gbpv=1&bsq=ry%C5%ABjin
  6. రాబర్ట్స్, జెరెమీ (2009). జపనీస్ మిథాలజీ A టూ Z. ఇన్ఫోబేస్ పబ్లిషింగ్. ISBN 978-1-4381-2802-3.

బాహ్య లింకులు

[మార్చు]

Media related to Ryūjin at Wikimedia Commonsమూస:Jmyth navbox long

మూలాలు

[మార్చు]
  1. Ph.D, Evans Lansing Smith; Brown, Nathan Robert (2008-07-01). The Complete Idiot's Guide to World Mythology (in ఇంగ్లీష్). Penguin. ISBN 978-1-101-04716-3.
  2. 2.0 2.1 "Ryujin". World History Encyclopedia. Retrieved 2020-11-13.
  3. Gagne, Tammy (2018-12-15). Japanese Gods, Heroes, and Mythology (in ఇంగ్లీష్). ABDO. ISBN 978-1-5321-7070-6.
  4. Coulter, Charles Russell; Turner, Patricia (2013-07-04). Encyclopedia of Ancient Deities (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-96390-3.
  5. https://www.google.com/books/edition/Handbook_of_Japanese_Mythology/gqs-y9R2AekC?hl=en&gbpv=1&bsq=ry%C5%ABjin
  6. Roberts, Jeremy (2009). Japanese Mythology A to Z (in ఇంగ్లీష్). Infobase Publishing. ISBN 978-1-4381-2802-3.
"https://te.wikipedia.org/w/index.php?title=ర్యూజిన్&oldid=3881571" నుండి వెలికితీశారు