లక్కరాజు రామచంద్రరావు
లక్కరాజు రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన జన్యుపదార్థాల రసాయన శాస్త్రవేత్త.
జీవిత విశేషాలు
[మార్చు]ఈయన పశ్చిమ గోదావరి జిల్లా లోని రావిపాడు గ్రామంలో డిసెంబరు 12, 1916లో జన్మించారు. తండ్రి పేరు వెంకటరామయ్య. ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్.సి (ఆనర్స్), ఎం.ఎస్సీ డిగ్రీలు అందుకున్నారు. ఈ విశ్వవిద్యాలయంలోనే రసాయన శాస్త్ర శాఖలో అధ్యాపకునిగా (1939) లో చేరారు. 1943 లో మైక్రో ఎనలిస్టుగా, 1945లో డి.ఎస్సీ పట్టాఅ పొందడాంతో లెక్చర్ గా ప్రారంభమైన ఈయన ఉద్యోగ పర్వం అంతా ఆంధ్రా విశ్వవిద్యాలయానికే అంకితం అయింది.
పరిశోధనలు
[మార్చు]ఆయన "కొన్ని మొక్కల వర్ణ ద్రవ్యాల రసాయన పరిశీలన" అనే అంశం మీద 1944 లో పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలో ఎన్నో ప్లావోన్ లను, ప్లావనోల్ లను గుర్తించారు. మొక్కలలో ఇవి మృదు ఆక్సీకరణం చెందుతున్నట్లు భావించారు. క్షార పొటాషియం పెర్ సల్ఫేట్ ద్రావనం చేర్చిప్లావోన్ లను కొద్దిగా వేడి చేయడాం వలన అనేక ప్లోవోనోల్ సమ్మేళనాలు పొందవచ్చని నిర్థారించారు. సీమ బంతి పూల నుండి వేరుచేయబడిన ప్లావోనోవ్ పాట్యులెటన్ అణు నిర్మాణం నిర్ధారణ చేసే ప్రయత్నమే ఈయన పరిశోధనలలో ప్రధానాంశం. ఈ పూలలో పాట్యులెటిన్ యొక్క 7 - గ్లైకోసైడ్ గా పాట్యులెటిన్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్గానిక్ రసాయన శాస్త్ర రంగ పరిశోధనలు ఈయన సారథ్యంలో బాగా పుంజుకున్నాయి.
ఆయన విశ్వవిద్యాలయంలో రీడరుగా ఉన్నప్పుడు దశాబ్ది కాలంలో అనగా 1953, 1963 ల మధ్య స్వతంత్రంగా పరిశోధనలు ప్రారంభించారు. వైశ్లేషిక, ఇంజనీరింగు, ఆర్గానిక్, ఫిజికల్, నూక్లియర్ రసాయన శాస్త్ర శాఖలను ఎంతో అభివృద్ధి చేశరు. అనేక మంది పరిశోధక విద్యార్థులకు ఉత్తమస్థాయి ఆచార్యులుగా కీర్తిని ఆర్జించారు. రసాయనశాస్త్ర విభాగం అధిపతిగా 1968నుండి 1976 మధ్య కాలమ్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేసి విశ్వవిద్యాలయ సర్వీసు నుండి రిటైరు అయ్యారు.
ఈయన పర్యవేక్షణలో 14 మంది పరిశోధనలు పూర్తిచేసి డాక్టరేట్ పొందారు. ఈయన రాసిన పరిశోధనా పత్రాలు 175 జాతీయ, అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్ వెలువడినాయి. విదేశీ విశ్వవిద్యాలయాలు అనేకం గౌరవ పదవులు అందించాయి. పలు విదేశాలలో ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ సదస్సులలో తమ పరిశోధన ఫలితాలను వెల్లడించి వృక్ష జన్యు రసాయన శాస్త్ర ఘనతను ఇనుమడింపచేశారు. అమెరికా, జపాన్, బ్రిటన్ విశ్వవిద్యాలయాలను సందర్శించారు.
అశ్వగంథ, కటక్ రొహిణి, మూలికలలో ఉన్న రసాయన అంశాలను వేరు చేసి అధ్యయనం చేసే పరిశోధనలు నిర్వహించారు. ద్రావన నిష్కర్షణం, కాలం క్రోమోటోగ్రఫీ మొదలగు సుదీర్ఘ ప్రయోగాలను కొనసాగించారు. సి.ఎస్.ఐ.ఆర్ వారి ఎక్స్‌ట్రా మ్యూరల్ రీసెర్చి కమిటీ సభ్యులుగా ఉండి విజ్ఞాన శాస్త్ర విషయాలను సామాన్యులకు సైతం సరళ భాషలో అందించే పథకాలకు తోడ్పడ్డారు.