Jump to content

లక్ష్మీబాయి తిలక్

వికీపీడియా నుండి

లక్ష్మీబాయి తిలక్ (1868 – 1936 ఫిబ్రవరి 24 [1]) భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన మరాఠీ రచయిత్రి.

జీవితం

[మార్చు]

లక్ష్మీబాయి తిలక్ కు 11వ ఏట బాల్య వివాహం ప్రముఖ కవి నారాయణ్ వామన్ తిలక్ తొ జరిగింది. అతను యువ లక్ష్మీబాయికి ప్రాథమిక మరాఠీ చదవడం, వ్రాయగలిగేంత వరకు ప్రాథమిక విద్యను అందించాడు. తన భర్త క్రైస్తవ మతంలోకి మారడంతో లక్ష్మీబాయి దిగ్భ్రాంతికి గురయంది, అయితే కొంతకాలానికి, అతని మతమార్పిడి పట్ల ఆమెకున్న అయిష్టతను అధిగమించి, స్వయంగా క్రైస్తవురాలిగా మారింది. తన పుస్తకంలో స్టెప్ బై స్టెప్ (Step By Step), ఆమె మతమార్పిడి రీతిని సరళమైన పద్ధతిలో వివరించింది.[2] ఆమెకు ప్రాథమిక విద్య ఉన్నప్పటికీ, భర్త నుండి చాలా ప్రోత్సాహంతో, కొన్ని అద్భుతమైన కవిత్వాలను రచించారు. మరాఠీ సాహిత్యానికి అత్యున్నత ఉదాహరణగా పరిగణించబడే ఆమె ఆత్మకథ "స్మృతిచిత్రే" (स्मृतिचित्रे) కుాడా రాశారు. స్మృతిచిత్రే 1934–1937 సంవత్సరాల మధ్య నాలుగు భాగాలుగా ప్రచురించబడింది. 1950లో ఇ. జోసెఫిన్ ఇంక్స్టర్ "ఐ ఫాలో ఆఫ్టర్" (I Follow After) అనే పేరుతో సంక్షిప్త ఆంగ్ల అనువాదించారు.[3]

1910లో యేసుక్రీస్తు యొక్క రచనలను వివరించే "ఖ్రిస్తాయణం" (क्रिस्तायन) అనే పురాణాన్ని నారాయణ రచించడం ప్రారంభించాడు. అయితే, 1919లో మరణించే ముందు ఆయన కేవలం 10 అధ్యాయాలు మాత్రమే రాశారు. లక్ష్మీబాయి తన స్వంత 64 అధ్యాయాలను జోడించి ఈ ఇతిహాసాన్ని పూర్తి చేసింది.[4]


మూలాలు

[మార్చు]
  1. "टिळक, लक्ष्मीबाई". महाराष्ट्र नायक (in మరాఠీ). Archived from the original on 2024-01-18. Retrieved 2024-01-18.
  2. Lakshmibai Tilak, Agadi Step by Step. Testimony of Lakshmibai Tilak in her own words. Ed. Ashok Devdatt Tilak. Nashik: Mayawati A. Tilak, Shantisadan, 1968.
  3. Richard, H. L. (2020). "Smritichitre: The Memoirs of a Spirited Wife". International Bulletin of Mission Research. 44 (1): 67–73. doi:10.1177/2396939319838452. ISSN 2396-9393.
  4. "Two Strands of Liberal Expression : Dr. Anandibai Joshi and Lakshmibai Tilak". Indian Liberals (in ఇంగ్లీష్). 2023-10-26. Retrieved 2024-01-18.