లక్ష్మీ మజుందార్
Jump to navigation
Jump to search
లక్ష్మి మంజుందార్ | |
---|---|
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ కమీషనర్లు | |
In office 1964–1983 | |
అంతకు ముందు వారు | డా. హృద్యనాథ్ కుంజ్రు |
తరువాత వారు | లక్షణ్ సింగ్ |
లక్ష్మీ మజుందార్ 1964 నవంబర్ నుండి 1983 ఏప్రిల్ వరకు భారత స్కౌటింగ్ సంస్థ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ కమిషనరుగా ఉంది. ఆమె వరల్డ్ గర్ల్ గైడ్/గర్ల్ స్కౌట్ సెంటర్ నిర్మాణాన్ని పర్యవేక్షించారు. దీనిని 1966 అక్టోబర్ 16న వరల్డ్ చీఫ్ గైడ్ లేడీ ఒలవ్ బాడెన్-పావెల్ ప్రారంభించారు. ఆమె ఢిల్లీ చెందిన వారు.
మజుందార్ 1922లో చాలా చిన్న వయస్సులోనే గైడింగ్ లో చేరారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఆమె మరింత ఎక్కువ బాధ్యతలను నిర్వర్తించింది. 1969లో ప్రపంచ స్కౌటింగ్ సంస్థకు అసాధారణ సేవలకు గాను వరల్డ్ స్కౌట్ కమిటీ ప్రదానం చేసిన వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది స్కౌట్ మూవ్మెంట్ యొక్క ఏకైక విశిష్టత అయిన బ్రాంజ్ వుల్ఫ్ పురస్కారాన్ని మజుందార్ అందుకున్నారు.[1]
ఆమె 1965లో పద్మశ్రీ అందుకున్నారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "List of recipients of the Bronze Wolf Award". scout.org. WOSM. Archived from the original on 2020-11-29. Retrieved 2019-05-01.
- ↑ "Padma Shri Awardees". National Portal of India. Archived from the original on 5 జనవరి 2016. Retrieved 22 January 2019.