ధ్యేయం

వికీపీడియా నుండి
(లక్ష్యము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయంలో పోస్టరుపై సూచించారు.

ధ్యేయాన్ని లక్ష్యం అని కూడా అంటారు. ధ్యేయాన్ని ఆంగ్లంలో గోల్ అంటారు. కోరుకున్న ఫలితాన్ని సాధించడానికి ఒక జంతువు లేదా వ్యక్తి లేదా వ్యవస్థ ఊహ ద్వారా ప్రణాళికను తయారు చేసుకొని అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ఒక క్రమపద్ధతి ప్రకారం అభివృద్ధిని సాధిస్తూ లక్ష్యంలోని చివరి స్థానానికి చేరడాన్ని ధ్యేయం అంటారు. అనేకమంది ప్రజలు నిర్ణీత సమయానికి తమ లక్ష్యాన్ని చేధించడానికి దృఢనిశ్చయంతో కృషి చేస్తుంటారు. ధ్యేయం యొక్క ఉద్దేశం స్థూలంగా ఎయిమ్ అర్థాన్ని పోలి ఉంటుంది. ముందుగా ఊహించిన ఫలితాన్ని సాధించడానికి మార్గదర్శకాలతో పాటు ప్రతిచర్యలు ఎదురవుతాయి. ధ్యేయంలోని ఒక అంశం లేదా భౌతిక లేదా అంతర్గత విలువలతో కూడినది ఏదైనా సరే సాధించడానికి కొంతమంది వ్యక్తులు నిబద్ధులై ఉంటారు.

ధ్యేయము-లక్షము- లక్ష్యము - అర్థ వివరణ

[మార్చు]
ధ్యేయము అనే పదానికి వివిధ నిఘంటువులు ఇచ్చిన అర్థాలు ఈ విధంగా ఉన్నాయి.
1.శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 - ధ్యేయము = సం. విణ. (అ.ఆ.అ.) - ధ్యాతవ్యము.
2.ధ్యేయము
శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 - విణ. లక్ష్యము, గుఱి.
3.ధ్యేయము
తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979 సంస్కృత విశేషణము= ధ్యానింపదగినది.
4.ధ్యేయము
ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) - ధ్యానింపదగినది.
5.ధ్యేయము
తెలుగు నిఘంటువు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి. - సం.వి. ధ్యానింప దగినది.

కాని వ్వవహారములో .... లక్ష్యము అనే అర్థములోనే వాడబడుతున్నది. ఉదా: వాడి ధ్యేయము ఈ పరీక్షలలో ప్రథమ స్థానములో నెగ్గడమే..... పైనుదహరించిన అర్తము వాడుకలో లేదు. అదే విధంగా లక్షము అనే పదానికి నిఘంటువులలో ఈ క్రింది విధంగా అర్తాలున్నాయి.

లక్షము
తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979 సంస్కృత విశేష్యము 1. గురి. 2. రపము. 3.వ్యాజము.
లక్షము
ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979 = గుఱి, గుఱుతు, నూరువేలు, లక్ష్యము.

ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యము ... ప్రతి పనికి ఒక లక్ష్యము

[మార్చు]

ప్రతి వ్యక్తికి, సమూహానికి, వ్వవస్థకు, సంస్థకు తాము చేయ బోయే పనికి ఒక లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించుకునే ముందుకు సాగుతారు. ఈ లక్ష్యాన్ని నిర్ణయించు కోవడమన్నది ఊహాజనితం కావచ్చు, ప్రణాళికా బద్ధంగా వ్రాత పూర్వకంగా ఏర్పాటు చేసుకున్నది కావచ్చు. మరేదైనా కావచ్చు. కాని తప్పనిసరిగా ఒక లక్ష్యం అంటు ఒక టుంటుంది. లక్ష్యము లేనిది గమ్యము లేని ప్రయాణము వంటిది. నిరుపయోగము. ప్రతి పనికి ఒక లక్ష్యము వుంటుంది. అది చిన్న పని గాని, పెద్ద పని గాని, మహా కార్యము గాని, దానికి ఒక లక్ష్యముంటుంది. అదే విధంగా మంచి పనికి గాని, చెడు పనికి గాని, దుర్మార్గపు పనికి గాని ఒల లక్ష్యము వుంటుంది. ఒక దొంగ, దొంగ తనానిని వెళుతూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించు కుంటాడు. ఆ విధంగా పని ప్రారంబిస్తాడు. ఒక నిరుద్యోగి ఉద్యోగము కొరకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ మార్గములో పాటు పడుతుంటాడు. ఒక కార్య సాధనకు ఒక మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ప్రణాళిక ప్రకారము పని చేస్తే లక్ష్యాన్ని సునాయాసంగా సాధించ వచ్చు. అందుకే లక్ష్య సిద్ధి ప్రాప్తి రస్తు. అంటూ దీవిస్తుంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=ధ్యేయం&oldid=3275269" నుండి వెలికితీశారు