Jump to content

లఖన్‌లాల్ దేవాంగన్

వికీపీడియా నుండి
లఖన్‌లాల్ దేవాంగన్

కేబినెట్ మంత్రి, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
22 డిసెంబర్ 2023
ముందు జై సింగ్ అగర్వాల్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
3 డిసెంబర్ 2023
ముందు జై సింగ్ అగర్వాల్
నియోజకవర్గం కోర్బా
పదవీ కాలం
8 డిసెంబర్ 2013 – 11 డిసెంబర్ 2018
ముందు బోధ్రామ్ కన్వర్
తరువాత పురుషోత్తం కన్వర్
నియోజకవర్గం కట్ఘోరా

ఉపాధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
29 సెప్టెంబర్ 2020
అధ్యక్షుడు విష్ణు దేవో సాయ్
అరుణ్ సావో

ఆహార, పౌర సరఫరా , వినియోగదారుల రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కార్యదర్శి
పదవీ కాలం
23 మే 2015 – 11 డిసెంబర్ 2018
తరువాత కున్వర్ సింగ్ నిషాద్

కోర్బా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్
పదవీ కాలం
16 జనవరి 2005 – 11 జనవరి 2010
ముందు శ్యామ్ కన్వర్
తరువాత జోగేష్ లాంబా

వ్యక్తిగత వివరాలు

జననం (1962-04-12) 1962 ఏప్రిల్ 12 (వయసు 62)
కోర్బా, మధ్యప్రదేశ్, భారతదేశం (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, భారతదేశంలో ఉంది)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు తులసీ రామ్ దేవాంగన్ (తండ్రి)
నివాసం కోర్బా, ఛత్తీస్‌గఢ్, భారతదేశం
పూర్వ విద్యార్థి ఎస్.ఎస్.సి
వృత్తి వ్యవసాయం, వ్యాపారం

లఖన్‌లాల్ దేవాంగన్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు కోర్బా నియోజకవర్గం & కట్ఘోరా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

లఖన్‌లాల్ దేవాంగన్ 1962 ఏప్రిల్ 12న కోర్బాలో జన్మించాడు, ఆయన తండ్రి పేరు దివంగత తులసీ రామ్ దేవాంగన్. లఖన్ లాల్ దేవాంగన్ బిఎ మొదటి సంవత్సరం వరకు పూర్తి చేశాడు. ఆయన 15 అక్టోబర్ 1982న రాంకుమారి దేవాంగన్ ను వివాహం చేసుకున్నాడు. వారికీ ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్ల ఉన్నారు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

లఖన్‌లాల్ దేవాంగన్ 2003లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి కోర్బా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడినప్పుడు, 2000 నుండి 2005 వరకు కొహడియా నుండి కౌన్సిర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2005 నుండి 2010 వరకు మున్సిపల్ కార్పొరేషన్ కోర్బాకు మేయర్‌గా పని చేశాడు. లఖన్‌లాల్ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా కట్టోరా నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, పార్లమెంటరీ కార్యదర్శిగా పని చేశాడు.

లఖన్‌లాల్ దేవాంగన్ 2018లో ఎన్నికల్లో ఓడిపోయి, 2023 ఎన్నికల్లో కోర్బా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రజై సింగ్ అగర్వాల్ పై 25629 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (22 December 2023). "Chhattisgarh Cabinet expansion: Nine BJP MLAs sworn in as Ministers" (in Indian English). Archived from the original on 23 December 2023. Retrieved 23 December 2023.
  2. ETV Bharat News (22 December 2023). "लखनलाल देवांगन एक करिश्माई नेता की कहानी, लगातार जीतने वाले नेताओं को चुनावी मैदान में दी पटखनी" (in హిందీ). Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.
  3. Andhrajyothy (22 December 2023). "Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 9 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం నేడు". Archived from the original on 23 December 2023. Retrieved 23 December 2023.
  4. India Today (4 January 2024). "Chhattisgarh Chief Minister allocates portfolios, ex-IAS O P Choudhary gets finance" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.