Jump to content

లభ్ సింగ్ ఉగోకే

వికీపీడియా నుండి
లభ్ సింగ్ ఉగోకే

శాసనసభ్యుడు
పదవీ కాలం
2022 మార్చి 10 – ప్రస్తుతం
ముందు చరణ్‌జిత్ సింగ్ చన్నీ (కాంగ్రెస్)
నియోజకవర్గం బదౌర్
ఆధిక్యత 37,558

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
తల్లిదండ్రులు బల్దేవ్ కౌర్ (త‌ల్లి)[1]

లభ్ సింగ్ ఉగోకే పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

లభ్ సింగ్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకియలోకి వచ్చి, వాలంటీర్గా చేరి బదౌర్ నియోజకవర్గంలోని 74 గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాడు. ఆయన 2017 బదౌర్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి పిర్మల్ సింగ్ గెలుపులో కీలకంగాను పనిచేశాడు, కానీ ఆయన 2021లో ఆప్ ను విడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బర్నాలా జిల్లా బదౌర్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం టికెట్ను ఆయనకు పార్టీ కేటాయించగా ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ చన్నీ పై 37,558 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (13 March 2022). "కొడుకు ఎమ్మెల్యే అయినా స్కూల్‌లో ఊడ్చే ప‌నికి వెళ్తున్న ఆప్ ఎమ్మెల్యే లాభ్ సింగ్ త‌ల్లి.. ఎందుకో తెలుసా?". Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.
  2. Sakshi (10 March 2022). "సీఎంను ఓడించిన సామాన్యుడు.. ఎవరతను?". Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.
  3. 10TV (10 March 2022). "హేమాహేమీలను ఓడించిన లాభ్ సింగ్, జీవన్ జ్యోత్ కౌర్ ఎవరు ? నెటిజన్ల ఆసక్తి" (in telugu). Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Mint (10 March 2022). "AAP's Labh Singh Ugoke who defeated CM Channi is a mobile repair shop staff" (in ఇంగ్లీష్). Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.