లలితా సహస్ర నామములు- 401-500

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లలితా సహస్ర నామ స్తోత్రం
లలితా సహస్ర నామములు : 01-100  • 101-200  • 201-300  • 301-400  • 401-500  • 501-600  • 601-700  • 701-800  • 801-900  • 901-1000

లలితా సహస్ర నామ స్తోత్రములోని అయిదవ నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.[1][2]

శ్లోకం 87

[మార్చు]
  1. లలితా త్రిపుర సుందరి
    వ్యాపినీ - వ్యాపనత్వ లక్షణము కలది.
  2. వివిధాకారా - వివిధములైన ఆకారములతో నుండునది.
  3. విద్యావిద్యాస్వరూపిణీ - విద్యకు సంబంధించిన భాగమును, అవిద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా గలది.
  4. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముదీ - మహాకామేశ్వరుని కన్నులనెడు కలువపువ్వులకు ఆనంద వికాసమును కలిగించు వెన్నెలవెల్లువ.

శ్లోకం 88

[మార్చు]
  1. భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతిః - భక్తుల హృదయగతమైన అంధకార అజ్ఞానమును భేదించునట్టి కాంతితో కూడిన సూర్యకిరణ పుంజము.
  2. శివదూతీ - శివుని వద్దకు పంపిన దూతిక.
  3. శివారాధ్యా - శివునిచే ఆరాధింపబడునది.
  4. శివమూర్తిః - శివునియొక్క స్వరూపము.
  5. శివంకరీ - శుభములు చేకూర్చునది.

శ్లోకం 89

[మార్చు]
  1. శివప్రియా - శివునికి ఇష్టమైనది.
  2. శివపరా - శివుని పరమావధిగా కలిగినది.
  3. శిష్టేష్టా - శిష్టజనులు అనగా సజ్జనుల యందు ఇష్టము గలిగినది.
  4. శిష్టపూజితా - శిష్టజనుల చేత పూజింపబడునది.
  5. అప్రమేయా - ప్రమాణము లేనిది; ప్రమాణములకు లొంగనిది.
  6. స్వప్రకాశా - తనంతట తానే ప్రకాశించునది.
  7. మనోవాచామగోచరా - మనస్సు చేత వాక్కుల చేత గోచరము కానిది అనగా గ్రహింప వీలుకానిది.

శ్లోకం 90

[మార్చు]
  1. చిచ్ఛక్తిః - చైతన్య శక్తి.
  2. చేతనారూపా - చలించు తెలివి యొక్క రూపము.
  3. జడశక్తిః - ఒక స్థితిలో ఉండి పోవునట్లు చేయు శక్తి.
  4. జడాత్మికా - జడశక్తి యొక్క స్వరూపము.
  5. గాయత్రీ - గానము చేసిన వారిని రక్షించునది.
  6. వ్యాహృతిః - ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది.
  7. సంధ్యా - చక్కగా ధ్యానము చేయబడునది.
  8. ద్విజబృంద నిషేవితా - ద్విజుల చేత నిశ్శేషముగా సేవింపబడునది.

శ్లోకం 91

[మార్చు]
  1. తత్త్వాసనా - తత్ సంబంధమైన భావమే ఆసనముగా గలది.
  2. తత్ - ఆ పరమాత్మను సూచించు పదము.
  3. త్వమ్‌ - నీవు.
  4. అయీ - అమ్మవారిని సంబోధించు పదము.
  5. పంచకోశాంతరస్థితా - ఐదు కోశముల మధ్యన ఉండునది.
  6. నిస్సీమ మహిమా - హద్దులు లేని మహిమ గలది.
  7. నిత్యయౌవనా - సర్వకాలములందును యవ్వన దశలో నుండునది.
  8. మదశాలినీ - పరవశత్వముతో కూడిన శీలము కలది.

శ్లోకం 92

[మార్చు]
  1. మదఘూర్ణిత రక్తాక్షీ - పరవశత్వము వలన తిరుగుటచే ఎర్రదనమును పొందిన కన్నులు గలది.
  2. మదపాటల గండభూః - ఆనంద పారవశ్యము వలన తెలుపు, ఎరుపుల సమిశ్ర వర్ణములో ప్రకాంశించు చెక్కిళ్లు కలది.
  3. చందన ద్రవదిగ్ధాంగీ - మంచి గంధపు రసముతో పూయబడిన శరీరము గలది.
  4. చంపేయ కుసుమ ప్రియా - సంపెంగ పుష్పములందు ప్రీతి కలది.

శ్లోకం 93

[మార్చు]
  1. కుశలా - క్షేమము, కౌశల్యమును గలది.
  2. కోమలాకారా - సుకుమారమైన లేదా మృదులమైన స్వరూపము గలది.
  3. కురుకుల్లా - శ్యామలా దేవి
  4. కులేశ్వరీ - కులమార్గమునకు ఈశ్వరి.
  5. కులకుండాలయా - కులకుండమును నిలయముగా గలది.
  6. కులతత్పరసేవితా - కౌలమార్గమును అనుసరించువారిచే సేవింపబడునది.

శ్లోకం 94

[మార్చు]
  1. కుమార గణనాథాంబా - కుమారస్వామికి, గణపతికి తల్లి అయినది.
  2. తుష్టిః - తృప్తి, సంతోషముల రూపము.
  3. పుష్టిః - సమృద్ధి స్వరూపము.
  4. మతిః - బుద్ధి
  5. ధృతిః - ధైర్యము.
  6. శాంతిః - తొట్రుపాటు లేని నిలకడతనము గలది.
  7. స్వస్తిమతీ - మంచిగా లేదా ఉండవలసిన విధానములో ఉండు మనోలక్షణము గలది.
  8. కాంతిః - కోరదగినది.
  9. నందినీ = ఆనందిని అంటే ఆనందమును అనుభవించునది.
  10. విఘ్ననాశినీ - విఘ్నములను నాశము చేయునది.

శ్లోకం 95

[మార్చు]
  1. తేజోవతీ - తేజస్సు కలది.
  2. త్రినయనా - మూడు కన్నులు కలది.
  3. లోలాక్షీ కామరూపిణీ - స్త్రీలకు కూడా మోహము పుట్టు రూపము గలది.
  4. మాలినీ - మాలికారూపము చెల్లునది. లేదా మాల గలది.
  5. హంసినీ - హంసను (శ్వాసను) గలిగినది.
  6. మాతా - తల్లి.
  7. మలయాచల వాసినీ - మలయపర్వమున వసించునది.

శ్లోకం 96

[మార్చు]
  1. సుముఖీ - మంగళకరమైన ముఖము కలది.
  2. నళినీ - నాళము గలిగినది.
  3. సుభ్రూః - శుభప్రధమైన కనుబొమలు కలిగినది.
  4. శోభనా - సౌందర్యశోభ కలిగినది.
  5. సురనాయికా - దేవతలకు నాయకురాలు.
  6. కాలకంఠీ - నల్లని కంఠము గలది.
  7. కాంతిమతీ - ప్రకాశవంతమైన శరీరము కలది.
  8. క్షోభిణీ - క్షోభింపచేయునది అనగా మథించునది.
  9. సూక్ష్మరూపిణీ - సూక్ష్మశక్తి స్వరూపిణి.

శ్లోకం 97

[మార్చు]
  1. వజ్రేశ్వరీ - వజ్రేశ్వరీ నామంగల ఒక అతిరహస్యశక్తి.
  2. వామదేవీ - అందముగా నున్న దేవత.
  3. వయోవస్థా వివర్జితా - వయస్సు యొక్క ప్రభావం గాని అవస్థా ప్రభావం గాని లేనిది.
  4. సిద్ధేశ్వరీ - సిద్ధులకు అధికారిణి.
  5. సిద్ధవిద్యా - సిద్ధిని ప్రసాదించు విద్యారూపిణి.
  6. సిద్ధమాతా - సిద్ధులకు తల్లి, సిద్ధులను కొలుచునది.
  7. యశస్వినీ - యశస్సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు.

శ్లోకం 98

[మార్చు]
  1. విశుద్ధి చక్రనిలయా - విశుద్ధి చక్రములో వసించునది.
  2. ఆరక్తవర్ణా - రక్తవర్ణములో నుండునది.
  3. త్రిలోచనా - మూడు లోచనములు కలది.
  4. ఖట్వంగాది ప్రహరణా - ఖట్వాంగాది ఆయుధములు ధరించునది.
  5. వదనైక సమన్వితా - ఒకే ఒక నోటితో సమన్వయింపబడిన రూపము గలది.

శ్లోకం 99

[మార్చు]
  1. పాయసాన్న ప్రియా - పాయసాన్నములో ప్రీతి గలది.
  2. త్వక్ స్థా - చర్మధాతువును ఆశ్రయించి ఉండునది.
  3. పశులోక భయంకరీ - పశుప్రవృత్తికి భయమును కలుగచేయునది.
  4. అమృతాది మహాశక్తి సంవృతా - అమృతా మొదలైన మహాశక్తులచేత పరివేష్టింపబడి యుండునది.
  5. ఢాకినీశ్వరీ - ఢాకినీ అని పేరుగల విశుద్ధి చక్రాధిష్టాన దేవత.

శ్లోకం 100

[మార్చు]
  1. అనాహతాబ్జ నిలయా - అనాహత పద్మములో వసించునది.
  2. శ్యామభా - శ్యామల వర్ణములో వెలుగొందునది.
  3. వదన ద్వయా - రెండు వదనములు కలది.
  4. దంష్ట్రోజ్వలా - కోరలతో ప్రకాశించునది.
  5. అక్ష్మమాలాదిధరా - అక్షమాల మొదలగు వాటిని ధరించి యుండునది.
  6. రుధిర సంస్థితా - రక్త ధాతువును ఆశ్రయించి ఉండునది.

శ్లోకం 101

[మార్చు]
  1. కాళరాత్ర్యాది శక్త్వౌఘవృతా - కాళరాత్రి మొదలైన పన్నెండి మంది శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.
  2. స్నిగ్థౌదన ప్రియా - నేతితో తడిపిన అన్నములో ప్రీతి కలది.
  3. మహావీరేంద్ర వరదా - శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైన వన్నీ సమకూర్చునది.
  4. రాకిణ్యంబా స్వరూపిణీ - రాకిణీ దేవతా స్వరూపిణి.

శ్లోకం 102

[మార్చు]
  1. మణిపూరాబ్జనిలయా - మణిపూర పద్మములో వసించునది.
  2. వదన త్రయ సంయుతా - మూడు ముఖములతో కూడి యుండునది.
  3. వజ్రాదికాయుధోపేతా - వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.
  4. డామర్యాదిభిరావృతా - డామరము, ఆదిభి మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.

శ్లోకం 103

[మార్చు]
  1. రక్తవర్ణా - ఎర్రని రక్త వర్ణంలో ఉండునది.
  2. మాంసనిష్ఠా - మాంస ధాతువును ఆశ్రయించి ఉండునది.
  3. గుడాన్న ప్రీతమానసా - గుడాన్నములో ప్రీతి కలది.
  4. సమస్త భక్త సుఖదా - అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖసంతోషాలను ప్రసాదించునది.
  5. లాకిన్యంబా స్వరూపిణీ - లాకినీ దేవతా స్వరూపముగా నున్నది.

మూలాలు

[మార్చు]
  1. "Untitled | PDF". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2023-07-08.
  2. Incarnation 14 (2020-08-31). "శ్రీ లలితా సహస్ర నామములు – 79 / Sri Lalita Sahasranamavali – Meaning – 79". Prasad Bharadwaj Incarnation 14 Blog (in ఇంగ్లీష్). Retrieved 2023-07-08.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)