లలితా సహస్ర నామములు- 901-1000
Jump to navigation
Jump to search
లలితా సహస్ర నామ స్తోత్రములోని తొమ్మిది వందల నుండి వేయి నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.[1][2]
శ్లోకం 167
[మార్చు]- వీరగోష్ఠీ ప్రియా : వీరభక్తులు చేయు తీవ్రసాధన యెందు ప్రీతి కలిగినది
- వీరా : వీరత్వము కలిగినది
- నైష్కర్మ్యా : కర్మబంధము లేనిది
- నాదరూపిణీ : ఓంకారస్వరూపిణి
- విఙ్ఞాన కలానా : విఙ్ఞాన స్వరూపిణి
- కల్యా : మూలకారణము
- విదగ్ధా : గొప్ప సామర్ధ్యము కలిగినది
- బైందవాసనా : బిందువు ఆసనముగా కలిగినది
శ్లోకం 168
[మార్చు]- తత్త్వాధికా : సమస్త తత్వములకు అధికారిణి
- తత్త్వమయీ : తత్వస్వరూపిణి
- తత్త్వమర్ధ స్వరూపిణీ : తత్ = అనగా నిర్గుణ నిరాకర స్వరూపము , త్వం = ప్రత్యగాత్మ, తత్+త్వం స్వరూపముగ ఉన్నది
- సామగానప్రియా :సామగానమునందు ప్రీతి కలిగినది
- సౌమ్యా : సౌమ్య స్వభావము కలిగినది
- సదాశివకుటుంబినీ : సదాశివుని అర్ధాంగి
శ్లోకం 169
[మార్చు]- సవ్యాపసవ్య మార్గస్థా : వామ, దక్షిణ మార్గములలో పూజింపబడునది
- సర్వాపద్వినివారిణీ : అన్ని ఆపదలను నివారించునది
- స్వస్థా : మార్పులేకుండా ఉండునది
- స్వభావమధురా :సహజమైన మధురస్వభావము కలది
- ధీరా : ధైర్యము కలది
- ధీరసమర్చితా : ధీరస్వభావము కలవారిచే ఆరధింపబడునది
శ్లోకం 170
[మార్చు]- చైతన్యార్ఘ్య సమారాధ్యా :ఙ్ఞానులచే పూజింపబడునది
- చైతన్య కుసుమప్రియా : ఙ్ఞానము అనెడి పుష్పముల యెందు ప్రీతి కలిగినది
- సదొదితా : సత్యస్వరూపిణీ
- సదాతుష్టా : ఎల్లప్పుడూ సంతొషముతో ఉండునది
- తరుణాదిత్యపాటలా :ఉదయసూర్యుని వంటి కాంతి కలిగినది
శ్లోకం 171
[మార్చు]- దక్షిణా : దాక్షిణ్యము కలిగినది
- దక్షిణారాధ్యా : దక్షిణాచారముచే పొజింపబదుచున్నది
- దరస్మేరముఖాంబుజా : చిరునవ్వుతొ కూదిన ముఖపద్మము కలిగినది
- కౌళినీ : కౌళమార్గమున ఉపాసించబదుచున్నది
- కేవలా : సమస్తమునకు తాను ఒక్కటియే మూలమైనది
- అనర్ఘ్య కైవల్యపదదాయినీ :అత్యుత్తమమైన మోక్షము ప్రసాదించును
శ్లోకం 172
[మార్చు]- స్తోత్రప్రియా : స్తోత్రములు అనిన ఇస్టము కలిగినది
- స్తుతిమతే : స్తుతించుట అనిన ఇస్టము కలిగినది
- శ్రుతిసంస్తుత వైభవా : వేదములచేత స్తుతింపబడెడి వైభవము కలిగినది
- మనస్వినీ : మనస్సు కలిగినది
- మానవతీ : అభిమానము కలిగినది
- మహేశే : మహేశ్వర శక్తి
- మంగాళాకృతి: మంగలప్రదమైన రూపము కలిగినది
శ్లోకం 173
[మార్చు]- విశ్వమాతా : విశ్వమునకు తల్లి
- జగద్ధాత్రీ : జగత్తును రక్షించునది
- విశాలాక్షీ : విశాలమైన కన్నులు కలది
- విరాగిణీ : దేనిథోనూ అనుభందము లేనిది
- ప్రగల్భా : సర్వసమర్ధురాలు
- పరమోదారా : మిక్కిలి ఉదారస్వభావము కలిగినది
- పరామోదా : పరమానందము కలిగినది
- మనోమయీ : మనశ్శే రూపముగా కలిగినది
శ్లోకం 174
[మార్చు]- వ్యోమకెశీ : అంతరిక్షమే కేశముగా కలది
- విమానస్థా : విమానము (సహస్రారము) నందు ఉండునది
- వజ్రిణీ : వజ్రము ఆయుధముగా కలిగినది
- వామకేశ్వరీ : వామకేశ్వరుని శక్తి
- పంచయఙ్ఞ ప్రియా : నిత్యము చేయు పంచయఙ్ఞములచే ప్రీతి చెందునది
- పంచప్రేత మంచాధిశాయినీ :పంచప్రేతములచే ఏరడిన మంచముపై కూర్చుని ఉండునది.
శ్లోకం 175
[మార్చు]- పంచమీ : పంచకృత్యపరాయణి
- పంచభూతేశీ : పంచభూతములను ఆఙ్ఞాపించునది
- పంచసంఖ్యోపచారిణీ :శ్రీవిద్యోపాసకులచే 5 విధములుగా ఆరధింపబడునది
- శాశ్వతీ : శాశ్వతముగా ఉండునది
- శాశ్వతైశ్వర్యా : శాశ్వతమైన ఐశ్వర్యము కలది
- శర్మదా : ఓర్పు ను ఇచ్చునది
- శంభుమోహినీ : ఈశ్వరుని మోహింపజేయునది
శ్లోకం 176
[మార్చు]- ధరా : ధరించునది
- ధరసుతా : సమస్త జీవులను తన సంతానముగా కలిగినది
- ధన్యా : పవిత్రమైనది
- ధర్మిణీ : ధర్మస్వరూపిణి
- ధర్మవర్ధినీ : ధర్మమును వర్ధిల్ల చేయునది
- లోకాతీతా : లోకమునకు అతీతమైనది
- గుణాతీతా :గుణములకు అతీతమైనది
- సర్వాతీతా : అన్నిటికీ అతీతురాలు
- శమాత్మికా : క్షమాగుణము కలిగినది
శ్లోకం 177
[మార్చు]- బంధూక కుసుమ ప్రఖ్యా : బంధూక పుష్పం (మంకెన్న పువ్వు) వంటి ప్రకాశం కలిగినది
- బాలా :12 సంవత్సరముల లోపు బాలిక
- లీలావినోదినీ :బ్రహ్మాండములను సృస్టించు అను లీల యందు వినోదమును కలిగినది
- సుమంగళీ :మంగళకరమైన రూపము కలిగినది
- సుఖకరీ :సుఖమును కలిగించునది
- సువేషాఢ్యా :మంచి వేషము కలిగినది
- సువాసినీ :సుమంగళి.
శ్లోకం 178
[మార్చు]- సువాసిన్యర్చన ప్రీతా : సువాసినులు చేయు అర్చన యెందు ప్రీతి కలిగినది
- శోభనా :శోభ కలిగినది
- శుద్ధమానసా : మంచి మనస్సు కలిగినది
- బిందుతర్పణ సంతుష్టా : అమృత బిందు తర్పణము చే సంతృప్తి పొందినది
- పూర్వజా : అనాదిగా ఉన్నది
- త్రిపురాంబికా :త్రిపురములందు ఉండు అమ్మ
శ్లోకం 179
[మార్చు]- దశముద్రా సమారాధ్యా : 10 రకముల ముద్రలచే ఆరాధింపబదునది
- త్రిపురా : త్రిపురసుందరీ
- శ్రీవశంకరీ : సంపదలను వశము చేయునది
- ఙ్ఞానముద్రా : బొతనవ్రేలును చూపుడు వ్రేలితో కలిపి మిగిలిన 3వ్రేళ్ళను నిటారుగా ఉంచుట
- ఙ్ఞానగమ్యా : ఙ్ఞానము చే చేరదగినది
- ఙ్ఞానఙ్ఞేయ స్వరూపిణీ : ఙ్ఞానముచే తెలియబడు స్వరూపము కలిగినది
శ్లోకం 180
[మార్చు]- యోనిముద్రా : యోగముద్రలలో ఓకటి
- త్రికండేశీ :3 ఖండములకు అధికారిణి
- త్రిగుణా : 3 గుణములు కలిగినది
- అంబా : అమ్మ
- త్రికోణగా : త్రికోణమునందు ఉండునది
- అనఘాద్భుత చారిత్రా : పవిత్రమైన అద్భుత చరిత్ర కలిగినది
- వాంఛితార్ధ ప్రదాయినీ : కోరిన కోర్కెలు ఇచ్చునది.
శ్లోకం 181
[మార్చు]- అభ్యాసాతియ ఙ్ఞాతా : అభ్యాసము చేసిన కొలది బొధపడును
- షడధ్వాతీత రూపిణీ :6 మార్గములకు అతీతమైన రూపము కలిగినది
- అవ్యాజ కరుణా మూర్తి :ప్రతిఫలాపేక్షలేని కరుణ కలిగినది
- రఙ్ఞానధ్వాంత దీపికా : అఙ్ఞానమను అంధకారమునకు దీపము వంటిది
శ్లోకం 182
[మార్చు]- ఆబాలగోపవిదితా :సర్వజనులచే తెలిసినది
- సర్వానుల్లంఘ్య శాసనా : ఎవరునూ అతిక్రమించుటకు వెల్లులేని శసనము కలిగినది
- శ్రీచక్రరాజ నిలయా : శ్రీ చక్రము నివాసముగా కలిగినది
- శ్రీమత్ త్రిపురసుందరీ : త్రిపురాసురులనే ముగ్గురు రాక్షసులను (తారకాక్ష, విద్యున్మాలి, కమలాక్ష ) సంహరించిన పరమశివుని భార్య 'త్రిపుర సుందరి'
శ్లోకం 183
[మార్చు]- శ్రీశివా : శుభములను కల్గినది
- శివశక్తైక్య రూపిణీ : శివశక్తులు ఏకమైన రూపము కలిగినది
- లలితాంబికా : లలితానామమున ప్రసిద్ధమైన జగన్మాత
మూలాలు
[మార్చు]- ↑ "Untitled | PDF". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2023-07-08.
- ↑ Incarnation 14 (2020-08-31). "శ్రీ లలితా సహస్ర నామములు – 79 / Sri Lalita Sahasranamavali – Meaning – 79". Prasad Bharadwaj Incarnation 14 Blog (in ఇంగ్లీష్). Retrieved 2023-07-08.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)