లలితా సహస్ర నామములు- 601-700

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లలితా సహస్ర నామ స్తోత్రం
లలితా సహస్ర నామములు : 01-100  • 101-200  • 201-300  • 301-400  • 401-500  • 501-600  • 601-700  • 701-800  • 801-900  • 901-1000
లలితా త్రిపుర సుందరి


లలితా సహస్ర నామ స్తోత్రములోని ఏడవ నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.[1][2]

శ్లోకం 121[మార్చు]

  1. దరాందోళిత దీర్ఘాక్షీ - కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు గలది.
  2. దరహాసోజ్జ్వలన్ముఖీ - మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది.
  3. గురుమూర్తిః - గురువు యొక్క రూపముగా నున్నది.
  4. గుణనిధిః - గుణములకు గని వంటిది.
  5. గోమాతా - గోవులకు తల్లి వంటిది.
  6. గుహజన్మభూః - కుమారస్వామి పుట్టుటకు తల్లి అయినది.

శ్లోకం 122[మార్చు]

  1. దేవేశీ - దేవతలకు పాలకురాలు.
  2. దండనీతిస్థా - దండనీతి శాస్త్రము లోని విషయములుగా ఉండునది.
  3. దహరాకాశ రూపిణి - హృదయములో ఉండు చోటు రూపముగ ఉండునది.
  4. ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా - పాడ్యమి నుండి ముఖ్యమైన పౌర్ణమి వరకు ఉండు తిథివర్గముచే పూజింపబడునది.

శ్లోకం 123[మార్చు]

  1. కళాత్మికా - కళల యొక్క రూపమైనది.
  2. కళానాథా - కళలకు అధినాథురాలు.
  3. కావ్యాలాప వినోదినీ - కావ్యముల ఆలాపములో వినోదించునది.
  4. సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా - వింజామరలను కలిగియున్న ఎడమవైపున, కుడివైపున (వరుసగా) లక్ష్మీదేవి చేత, సరస్వతీదేవి చేత సేవింపబడునది.

శ్లోకం 124[మార్చు]

  1. ఆదిశక్తిః - ప్రథమముగా నున్న శక్తి స్వరూపిణి.
  2. అమేయా - కొలుచుటకు, గణించుటకు గాని, నిర్వహించుటకు గాని అలవికానిది.
  3. ఆత్మా - ఆత్మ స్వరూపిణి.
  4. పరమా - సర్వీత్కృష్టమైనది.
  5. పావనాకృతిః - పవిత్రమైన స్వరూపము గలది.
  6. అనేకకోటి బ్రహ్మాండజననీ - అనంతమైన సమూహములుగా నుండు బ్రహ్మాండములకు తల్లి.
  7. దివ్యవిగ్రహా - వెలుగుచుండు రూపము గలది.

శ్లోకం 125[మార్చు]

  1. క్లీంకారీ - ' క్లీం ' అను బీజాక్షరమునకు కారణభూతురాలు.
  2. కేవలా - ఒకే ఒక తత్వమును సూచించునది.
  3. గుహ్యా - రహస్యాతి రహస్యమైనది.
  4. కైవల్య పదదాయినీ - మోక్షస్థితిని ఇచ్చునది.
  5. త్రిపురా - మూడు పురములను కలిగి ఉంది.
  6. త్రిజగద్వంద్యా - మూడు లోకములచే పూజింపబడునది.
  7. త్రిమూర్తిః - త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రుల రూపములో ఉండునది.
  8. త్రిదశేశ్వరీ - దేవతలకు ఈశ్వరి.

శ్లోకం 126[మార్చు]

  1. త్ర్యక్షరీ - మూడు అక్షరముల స్వరూపిణి.
  2. దివ్యగంధాడ్యా - దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే ఒప్పునది.
  3. సిందూర తిలకాంచితా - పాపటయందు సిందూర తిలకముచే ప్రకాశించునది.
  4. ఉమా - ఉమా నామాన్వితురాలు.మూడు లోకములచే పూజింపబడునది.
  5. శైలేంద్ర తనయా - హిమవత్పర్వతము యొక్క కుమార్తె.
  6. గౌరీ - గౌర వర్ణములో ఉండునది.
  7. గంధర్వ సేవితా - గంధర్వులచేత పూజింపబడునది.

శ్లోకం 127[మార్చు]

  1. విశ్వగర్భా - విశ్వమును గర్భమునందు ధరించునది.
  2. స్వర్ణగర్భా - బంగారు గర్భము గలది.
  3. అవరదా - తనకు మించిన వరదాతలు లేనిది.
  4. వాగధీశ్వరీ - వాక్కునకు అధిదేవత.
  5. ధ్యానగమ్యా - ధ్యానము చేత పొందబడునది.
  6. అపరిచ్ఛేద్యా - విభజింప వీలులేనిది.
  7. జ్ఞానదా - జ్ఞానమును ఇచ్చునది.
  8. జ్ఞానవిగ్రహా - జ్ఞానమును మూర్తిగా దాల్చింది.

శ్లోకం 128[మార్చు]

  1. సర్వవేదాంత సంవేద్యా - అన్ని ఉపనిషత్తులచే చక్కగా తెలియబడునది.
  2. సత్యానంద స్వరూపిణీ - నిత్యసత్యమైన ఆనందమును స్వరూపముగా గలది.
  3. లోపాముద్రార్చితా - లోపాముద్రచే అర్చింపబడింది.
  4. లీలాక్లుప్త బ్రహ్మాండ మండలా - క్రీడా వినోదానికై కల్పింపబడి క్లుప్తీకరింపబడే బ్రహ్మాండముల సమూహము గలది.

శ్లోకం 129[మార్చు]

  1. అదృశ్యా - చూడబడనిది.
  2. దృశ్యరహితా - చూడబడుటకు వేరే ఏమీలేని స్థితిలో ఉండునది.
  3. విజ్ఞాత్రీ - విజ్ఞానమును కలిగించునది.
  4. వేద్యవర్జితా - తెలుసుకొనబడవలసినది ఏమీ లేనిది.
  5. యోగినీ - యోగముతో కూడి ఉంది.
  6. యోగదా - యోగమును ఇచ్చునది.
  7. యోగ్యా - యోగ్యమైనది.
  8. యోగానందా - యోగముల వలన పొందు ఆనంద స్వరూపిణి.
  9. యుగంధరా - జంటను ధరించునది.

శ్లోకం 130[మార్చు]

  1. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ - స్వేచ్ఛాసంకల్పశక్తి, జ్ఞానకారకమైన శక్తి, కార్యాచరణ శక్తుల స్వరూపిణిగా ఉంది.
  2. సర్వాధారా - సమస్తమునకు ఆధారమైనది.
  3. సుప్రతిష్ఠా - చక్కగా స్థాపించుకొనినది.
  4. సదసద్రూప ధారిణీ - వ్యక్తమైనదిగాను, వ్యక్తముకాని దానిగాను రూపమును ధరించునది.

శ్లోకం 131[మార్చు]

  1. అష్టమూర్తి: 8 రూపములు కలిగినది (పంచేంద్రియాలు, చిత్తము, బుద్ధి,అహంకారము)
  2. అజా : పుట్టుకలేనిది
  3. జైత్రీ : సర్వమును జయించినది
  4. లోకయాత్రా విధాయినీ :లోకములను నియమించునది
  5. ఏకాకినీ : ఏకస్వరూపిణీ
  6. భూమరూపా : భూదేవిరూపము ధరించునది
  7. నిర్ద్వైతా : అద్వైతము కలిగినది (రెందవది అనునది లేకుండుట)
  8. ద్వైత వర్జితా : ద్వైతభావము లేనిది

శ్లోకం 132[మార్చు]

  1. అన్నదా : సర్వజీవులకు ఆహారము ఇచ్చునది
  2. వసుదా : సంపదలిచ్చునది
  3. వృద్ధా : ప్రాచీనమైనది
  4. బ్రహ్మత్మైక్య స్వరుపినీ : ఆత్మ, పరమాత్మల ఐక్యస్వరూపిణి
  5. బృహతీ : అన్నిటికన్న పెద్దది
  6. బ్రాహ్మణీ : బ్రహ్మఙ్ఞాన స్వరూపిణీ
  7. బ్రాహ్మీ : సరస్వతీ
  8. బ్రహ్మానందా :బ్రహ్మానందస్వరూపిణీ
  9. బలిప్రియా : బలి(త్యాగము) యందు ప్రీతి కలిగినది

శ్లోకం 133[మార్చు]

  1. భాషారూపా : సమస్తభాషలు తన రూపముగా కలిగినది
  2. బృహత్సేనా : గొప్ప సైన్యము కలిగినది
  3. భావాభావ వివర్జితా : భావము, అభావము రెండింటినీ లేనిది
  4. సుఖారాధ్యా :సుఖులైనవారిచే (నిత్యతృప్తులు) ఆరాధింపబడునది
  5. శుభంకరీ : శుభములను కలిగినది
  6. శోభనా : వైభవములను కలిగినది
  7. సులభాగతి: : తేలికగా చేరతగినది

శ్లోకం 134[మార్చు]

  1. రాజరాజేశ్వరీ : ఈశ్వరుని హృదయేశ్వరీ
  2. రాజ్యదాయినీ : రాజ్యములను ఇచ్చునది
  3. రాజ్యవల్లభా : రాజ్యమునకు అధికారిణీ
  4. రాజత్కృపా : అధికమైన కరుణ కలది
  5. రాజపీఠనిశేవిత నిజాశ్రితా :తనను ఆశ్రయించినవారిని సింహాసనము పైన కూర్చొండపెట్టునది

శ్లోకం 135[మార్చు]

  1. రాజ్యలక్ష్మి: రాజ్యలక్ష్మీ రూపిణీ
  2. కోశనాధా : కోశాగారముకు అధికారిణీ
  3. చతురంగ బలేశ్వరీ : చతురంగ బలాలకు (రధ, గజ, తురగ, పదాదులు) అధిపతి
  4. సామ్రాజ్యదాయినీ : సామ్రాజ్యమును ఇచ్చునది
  5. సత్యసంధా : సత్యస్వరూపిణి
  6. సాగరమేఘలా : సముద్రములే వడ్డాణముగా కలిగినది

శ్లోకం 136[మార్చు]

  1. దీక్షితా : భక్తులను రకించుట యెందు దీక్ష వహించినది
  2. దైత్యశమనీ : రాక్షసులను సం హరించునది
  3. సర్వలోక వశంకరీ :సమస్తలోకములను వశము చేసుకొనునది
  4. సర్వార్ధదాత్రీ : కోరిన కోర్కెలన్నిటినీ తీర్చునది
  5. సావిత్రీ : గాయత్రీ మాత
  6. సచ్చిదానంద రూపిణీ : సత్,చిత్, ఆనందములే రూపముగా కలిగినది.

మూలాలు[మార్చు]

  1. "Untitled | PDF". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2023-07-08.
  2. Incarnation 14 (2020-08-31). "శ్రీ లలితా సహస్ర నామములు – 79 / Sri Lalita Sahasranamavali – Meaning – 79". Prasad Bharadwaj Incarnation 14 Blog (in ఇంగ్లీష్). Retrieved 2023-07-08.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)