అష్టమూర్తి
అష్ట మూర్తి | |
---|---|
సర్వేశ్వరుడైన సదాశివుడు ఎనిమిది రూపాలలో ఈ జగత్తును ఆవరించి ఉన్నాడు. పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు అనే ఈ ఎనిమిది రూపాలతో ఈ సృష్టి అంతటా నిండి నిబిడీకృతమై ఉన్న
పరమశివుడు, ఒక్కో రూపంలో ఒక్కో పేరుతో పిలువబడుతున్నాడు.
శివ పురాణం
[మార్చు]శివపురాణ ప్రారంభముననే స్తుతించబడిన రుద్ర స్తోత్రాంతర్గతమైన శివుని అష్టమూర్తి నిరూపణము మనకు ప్రత్యక్ష ప్రమాణంగా కనిపించగలదు.
వీరిలో మొదటి మూర్తి (ఈశ్వరుడు) 'శర్వుడు'. భూమిని అధిష్టించి ఉంటాడు. అనగా భూమిమూర్తిగా కలిగి ఉంటాడని అర్థం. ఇక జలాధిష్ఠాన మూర్తి భవుడు. సమస్త విధ అగ్నులకు మూర్తి రూపుడు రుద్ర నామధేయుడు. లోపలా బయటా నిరంతరం చలించే వాయు రూపుడు ఉగ్రుడు. ఐదోవాడు - పంచభూతాత్మకుడు - ఆకాశరూపుడు భీముడు. క్షేత్రజ్ఞుడై, జీవాత్మలో వసించే మూర్తి రూపుడు పశుపతి. సూర్యాంతర్వర్తియై ప్రకాశించే సప్తమూర్తి ఈశానుడు, ఇక సచ్చిదానంద మయుడైన యజమాన రూపుడై విరజిల్లువాడు శివుడు.[1]
- భూమి శర్వుడు
- నీరు భవుడు
- అగ్ని రుద్రుడు
- గాలి ఉగ్రుడు
- ఆకాశం భీముడు
- సూర్యుడు ఈశానుడు
- చంద్రుడు మహాదేవుడు
- జీవుడు పశుపతి
మూలాలు
[మార్చు]- ↑ "శివపురాణము/రుద్ర ఖండము/శివుని అష్టమూర్తి నిరూపణము - పంచ బ్రహ్మావతారాలు - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-08-24.