Jump to content

లవ్లీ చౌబే

వికీపీడియా నుండి
లవ్లీ చౌబే
2022లో లవ్లీ చౌబే
వ్యక్తిగత సమాచారం
జాతీయతభారతీయురాలు
జననం (1980-08-03) 1980 ఆగస్టు 3 (వయసు 44)
రాంచీ, జార్ఖండ్, భారతదేశం

లవ్లీ చౌబే భారతదేశానికి చెందిన అంతర్జాతీయ మహిళా లాన్‌ బౌల్స్‌ క్రీడాకారిణి. ఆమె 2022లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో లాన్‌బౌల్స్‌లో భారత మహిళల జట్టు తరపున ప్రాతినిధ్యం వహించి, స్వర్ణ పతకం గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

లవ్లీ చౌబే జార్ఖండ్‌లోని రాంచీలో 1980 ఆగస్టు 3న జన్మించింది. ఆమెది మధ్యతరగతి కుటుంబానికి చెందినది. ఆమె తల్లి హౌస్ కీపర్‌గా పనిచేస్తుండగా, ఆమె తండ్రి కోల్ ఇండియాలో రిటైర్డ్ ఉద్యోగి. లవ్లీ చౌబే జార్ఖండ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆమె ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు శాఖలో పని చేస్తుంది.

క్రీడా జీవితం

[మార్చు]

లవ్లీ చౌబే 2008లో జాతీయ ఈవెంట్‌లో తొలిసారిగా పాల్గొని తొలి ప్రదర్శనలోనే బంగారు పతకాన్ని గెలిచింది. ఆమె 2013లో ఆసియా పసిఫిక్ లాన్ బౌల్ పోటీలో, మిక్స్‌డ్ పెయిర్స్ విభాగంలో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. లవ్లీ చౌబే 2014లో అంతర్జాతీయ పోటీల్లో చతుర్వార్షిక ఈవెంట్‌లో అరంగేట్రం చేసి, 2018లో ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో పాల్గొని 5వ స్థానంలో నిలిచింది. లవ్లీ చౌబే 2014లో జరిగిన 10వ ఆసియా లాన్ బౌల్స్ ఛాంపియన్‌షిప్‌ల నుండి మహిళల పెయిర్స్ & సింగిల్స్‌లో రెండు రజత పతకాలు, 2013లో ఆసియా పసిఫిక్ టోర్నమెంట్ నుండి మిక్స్‌డ్ పెయిర్స్‌లో స్వర్ణ పతాకం గెలిచింది.

లవ్లీ చౌబే 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల ఫోర్స్ లాన్ బౌల్స్ ఫైనల్‌లో భారత మహిళల జట్టు 17-10తో దక్షిణాఫ్రికాను ఓడించి, భారతదేశానికి మొట్టమొదటి లాన్ బౌల్స్ బంగారు పతకాన్ని గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది.[2]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (3 August 2022). "బంతులాటలో బంగారం". Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
  2. Sakshi (3 August 2022). "ఊహించని ఫలితం.. 'ఆనందం నాలుగింతలు'". Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.