Jump to content

లాటరీ

వికీపీడియా నుండి
ఫిన్లాండు లాటరీ టిక్కెట్లు

లాటరీ అనే పదాన్ని డచ్ లోని లాటరిజ్ అనే పదం నుంచి తీసుకున్నారు.

పూర్వకాలంలో పన్నులు ప్రజలు భారంగా భావించడం వల్ల ఈ రూపంలో నిధులు రాబట్టే వారు. ఈ పద్ధతి అనేక రాజ్యాల్లో ప్రజోపయోగ కార్యక్రమాల కోసం రాజులే నిర్వహించేవారు. క్రీ.పూ 5వ శతాబ్దంలో చైనాలోని హేన్ వంశరాజులు ఈ పద్ధతి ద్వారానే చైనా గోడ నిర్మాణానికి నిధులు సేకరించారు. రోమ్ లో అగస్టీస్ సీజర్ లాటరీ టికెట్లను విక్రయించారు. లాటరీలో ఎంపికైన వారికి కొన్ని బహుమానాలి దక్కేవి. మిగులు నిధులు రోమ్ నగర పునరుద్ధరణకు వాడేవారు. లాటరీ అసలు ఉద్దేశమే అది. తర్వాత పలు దేశాల్లో కొనసాగింది. 17వ శతాబ్ద కాలంలో నెదర్లాండ్స్ లో పేదరిక నిర్మూలన కోసం చాలా తరచుగా లాటరీలు నిర్వహించేవారు.

లాటరీ అంటే నొప్పి తెలియకుండా వసూలు చేసే పన్ను, కాకపోతే కట్టిన వాళ్ళే కడుతుంటారు. దీన్నే అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ "లాటరీ ఉత్తమ పన్ను. ఇష్టమున్న వాళ్ళే చెల్లిస్తుంటారు" అని వ్యాఖ్యానించారు. లాటరీ ఏ దేశంలో నిర్వహించినా నిర్వాహకులు, టికెట్లు కొన్నవారికంటే ప్రభుత్వాలే ఎక్కువ లాభపడుతున్నాయి. ఉదాహరణకు అమెరికాలో 314 మిలియన్ డాలర్లు గెలుచుకున్న వ్యక్తికి ఒకే సారి అంతా కావాలంటే పన్నులు పోను వాళ్ళకు దక్కేది కేవలం 114 మిలియన్లే. దాదాపు ప్రపంచమంతటా విజేతకు వార్తల్లో ప్రకటించే బహుమతిలో సగం కూడా దక్కదు.

విశేషాలు

[మార్చు]

ప్రస్తుతం నిర్వహిస్తున్న వాటిలో అతి పురాతన లాటరీ డచ్ దేశంలోని "స్టాట్స్ లాటరిజ్". ప్రపంచంలో పెద్ద లాటరీ స్పానిష్ క్రిస్ మస్ లాటరీ. ఏడాదికోసారి తీసే ఈ లాటరీ ద్వారా పంచే మొత్తం సుమారు 14 వేల కోట్ల రూపాయలు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో 16-18 శతాబ్దాల మధ్య నిర్మించిన చర్చిలన్నీ లాటరీల ద్వారా వచ్చిన ఆదాయంతో కట్టినవే. సూపరినాలొట్టో అన్నింటికన్నా క్లిష్టమైన లాటరీ. 62 కోట్ల మందిలో ఒకరికి తగులుతుంది. లాటరీల వల్ల బ్రిటన్ లో 2,500 లకు పైగా కొత్త మిలియనీర్లు పుట్టుకొచ్చారు. ఈ ఘనత నేషనల్ లాటరీదే. ఒక్క టిక్కెట్టుపై ఎక్కువ మొత్తాన్ని చెల్లించిన కంపెనీ అమెరికాకు చెందిన మెగామిలియన్స్. ప్రైజు మనీ విలువ 390 మిలియన్ డాలర్లు. అతి తక్కువగా (రెండు డాలర్లు) చెల్లించేదీ ఇదే. ఫిలిప్పీన్స్ లొట్టో డ్రా ఆసియాలో అతిపెద్ద లాటరీ.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=లాటరీ&oldid=3947607" నుండి వెలికితీశారు