లార్డ్ బైరన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
The Right Honourable
The Lord Byron
FRS
Portrait of Lord Byron by Thomas Phillips
పుట్టిన తేదీ, స్థలంజార్జి గార్డన్ బైరన్
(1788-01-22)1788 జనవరి 22
లండన్, ఇంగ్లండ్, గ్రేట్ బ్రిటన్
మరణం1824 ఏప్రిల్ 19(1824-04-19) (వయసు 36)
Missolonghi, Aetolia-Acarnania, Ottoman Empire (now Greece)
వృత్తికవి, రాజకీయ నాయకుడు
జాతీయతEnglish
పూర్వవిద్యార్థికేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
సాహిత్య ఉద్యమంRomanticism
ప్రభావంజాన్ మిల్టన్, అలెగ్జాండర్ పోప్, Edmund Spenser
జీవిత భాగస్వామిAnne Isabella Byron, Baroness Byron
భాగస్వామిClaire Clairmont
సంతానంAda Lovelace
Allegra Byron

సంతకం

జార్జి గార్డన్ బైరన్ (ఆంగ్లం: George Gordon Byron) రొమాంటిక్ ఉద్యమ హీరో, నిజమైన బైరానిక్ వ్యక్తీ, అందగాడు, దేన్నీ లెక్కచేయని వాడు. అంగవైకల్యం ఉన్నా అరిస్తోక్రాట్ గా వెలిగాడు. స్వేచ్ఛను కోరి, కలల్లో తేలి, మేధావి అయిన ప్రేమికుడు.

అడ్మిరల్ జాన్ బైరన్ బైరాన్ కవి తాత. తీవ్రస్వభావి కనుక ‘’ఫౌల్ వెదర్ జాక్ ‘’ అని మారు పేరుతో పిలిచే వారు. కవి బైరన్ అంకుల్ ఒకడు హత్య కేసులో ఉన్నాడు. ఈ స్వభావాలు వారసత్వంగా పొందిన బైరన్ కవి చిన్నప్పుడే స్నేహితుడితో ద్వంద్వ యుద్ధం చేశాడు. తండ్రిని ‘’మాడ్ జాక్ ‘’ అనే వారు. తండ్రి ఒక వివాహితను లేపుకు పోయి ఆమె మొగుడికి విడాకులిచ్చిన తర్వాత పెళ్లి చేసుకొన్నాడు. అగస్తా అనే కూతురు పుట్టింది. ఆమె డబ్బు అంతా హరించాడు. మొదటి జేమ్స్ రాజు బంధువులమ్మాయిని చేసుకొన్నాడు. ఈమె తండ్రి గర్వి, తీవ్ర మనస్తత్వం ఉన్నవాడు. ఆత్మహత్య చేసుకొన్నాడు .

ఇక జార్జి గార్డన్ విషయానికొస్తే 22-1-1788లో కాలు వంకరతో పుట్టి ఎన్ని ఆపరేషన్లు జరిగినా సరికాక, తల్లి విపరీత ధోరణులకు బాధ పడుతూ చాలా కాలం గడిపాడు .కొడుకును ఈ తల్లి ‘’చిన్నారి కుంటి కుంక ‘’అని పిలిచేది .తండ్రి డబ్బు జల్సాగా ఖర్చు చేసి తాగుడు తో చచ్చాడు .బైరన్ కు నర్సుగా ఉన్న మేరీ గ్రే తొమ్మిదేళ్లప్పుడు పాపం చేయవద్దని బోధిస్తూనే సెక్స్ లో మెకానిజం నూ బాగా నేర్పింది .ఇదే తర్వాత విజ్రుమ్భించింది .తండ్రి మరణం తో జార్జి గార్దన్ ఆస్తికి వారసుడైనాడు ఈయన చనిపోవటం తో బైరన్ కు తోమ్మిది ఏళ్ళ ప్పుడే లార్డ్ అయ్యాడు .న్యు స్తేడ్ ఆబ్బే లోని స్వంత ఎస్టేట్ కు తల్లి బైరన్ ను తీసుకు వెళ్ళింది .హారో స్కూల్ లో చదివాడు .స్వతంత్రుడు అవటం తో ఎవరినీ లెక్క చేసే వాడు కాదు .పదహారేళ్ళ వయసులో కజిన్ మేరీ చావర్త్ ను ప్రేమిస్తే ఆమె కూడా ప్రేమాయణం సాగించి చివరికి ఒక భూస్వామిని పెళ్లి చేసుకొన్నది .గుండె జారి గల్లంతైన బైరన్ విరహం తో ఎన్నో కవితలు ‘’వైడ్ –దిడ్రీం ‘’రాశాడు .సాహిత్యం లో మేటి అనిపించుకొన్నాడు .

పది హేడేళ్ళల్లప్పుడు ట్రినిటి కాలేజి లో చేరాడు. అయిదు వందల డాలర్ల అలవెన్స్ వచ్చేది .రూం ను అందం గా తీర్చి దిద్దుకోవటానికి దీన్ని ఖర్చు చేశాడు .యువ రాజు దర్జా వెలిగించాడు .అప్పుల అప్పారావు అయ్యాడు .కాలేజి నీతిని కాని డబ్బును కాని ఇవ్వదు అని స్నేహితుడికి ఉత్తరం రాశాడు .కొంత కవిత్వం గిలికాడు .కాని ఎవరూ మెచ్చ్చ లేదు ..ఉండలేక బయటికొచ్చాడు . మళ్ళీ చేరినా చదువు మీద శ్రద్ధ పెట్ట లేదు .రొమాంటిక్ నవలలు చదువుతూ ఫెన్సింగ్ వేస్తూ చదువు ఎగాగొట్టి కాల క్షేపం చేశాడు .కొందరు మంచి స్నేహితుల్ని సంపాదించుకొన్నాడు అందులో జాన్ కాం హాబ్ హౌస్ బైరన్ కు ఎక్సి క్యూటర్అయ్యాడు .గాంబ్లింగ్ లో ఆరితేరాడు .మొత్తం మీద ‘’ముక్కి’’ డిగ్రీ సాధించాడు .హౌస్ ఆఫ్ లార్డ్స్ లో స్థానం పొందాడు .’’ఇంగ్లీష్ బార్డ్స్ అండ్ స్కాచ్ రేవ్యూయర్స్ ‘’రాసి ప్రచురించాడు .ఇది పోప్ రచనా స్తాయిని పొందింది .పోప్ అంటే బైరాన్ కు మహా ఇష్టం .’’దంసియాడ్ ‘’రాసినా పేరు రాలేదు .

1809బైరాన్ కు మెజారిటీ వయసు వచ్చింది .దానితో బాటు అదృష్టమూ వరించింది .పన్నెండు వేల పౌండ్ల అప్పులు తీర్చాడు .ఆదాయం తగ్గింది రౌడీ పార్టీ తో కలిశాడు .ఈ బృందం లో ప్రతివాడు ఒక సన్యాసి వేషం వేసుకొనే సన్నాసే ..విందు ,మందు, చిందు లతో కాలం గడిపారు .ఇది లేడీ బైరన్ కు నచ్చలేదు .భార్యను వదిలేసి యూరప్ వెళ్లాడు .లిస్బన్ లో ఉన్నాడు .అక్కడి నుండి అయిదు వందల మైళ్ళు గుర్రం మీద ప్రయాణించి ‘’పెర్ఫెక్ట్ సైబీరియా ‘’చేరుకొన్నాడు మాల్టా వెళ్లి అల్బేనియా చేరాడు . కాం స్టంట్ నోపిల్ వెళ్లి హేల్లెస్ పాయింట్ లో ఈత కొట్టి ఏథెన్స్ కు వచ్చాడు .ఆర్ధర్ ఎడ్లిస్తాన్ తో స్నేహం చేశాడు .గ్రీస్ వెళ్లి ‘’పాఫియాన్ ప్లెజర్ ‘’అనుభవించి లండన్ చేరాడు .ఆస్తిని పర్య వేక్షించేవారి అలసత వలన రాబడి బాగా తగ్గిపోయింది బొగ్గుగనుల్లో బొగ్గు కాదుకదా సుఖమూ రాలేదని రాసుకొన్నాడు .తల్లి చని పోయింది .ఏదో పాపం తనను కుటుంబాన్ని పీడిస్తోందని గ్రహించాడు .ఐర్లాండ్ జాతీయ గాయకుడు కవి టాం మూర్ తో పరిచయమైంది .హౌస్ ఆఫ్ లార్డ్స్ లో మొదటి ప్రసంగం చేశాడు బైరన్ .ఆధునిక యంత్ర సామగ్రి రావటం తో వర్కర్లను తీసి వేయక తప్పలేదు .వాళ్లకు కోపం వచ్చి అన్నీ ధ్వంసం చేశారు .’’మెషీన్ రెకర్స్ ‘’అనే నాటకాన్ని జర్మన్ నాటక కర్త ‘’ఎర్నెస్ట్ టోల్లెర్ ‘’రాశాడు .ప్రభుత్వం ‘’ఫ్రెం బ్రేకర్స్ బిల్ ‘’ప్రవేశపెడితే బైరన్ వ్యతిరేకించాడు .పని చేసే వారిలో బైరన్ కు స్నేహితులెవరూ లేరు .

యూరప్ పర్యటన లో ఉండగానే బైరాన్ దీర్ఘ కవిత ను స్పెన్సర్ స్తాన్జాలతో రాయటం ప్రారంభించాడు .గ్రీసు దేశం లో పూర్తీ చేశాడు .రెండు కాంటోలను 1818లో ముద్రించాడు.ఆ విషయాన్ని బైరన్ ‘’ Byron awoke one morning and found myself famous ‘’అని రాసుకొన్నాడు .ఇందులో విషయం బైరన్ దే.రొమాంటిక్ టచ్ ఇచ్చాడు అంతే..బైరన్ కు ఉన్న పురుషత్వం స్త్రీ మనస్సు ఆడవాళ్ళకు విపరీతమైన ఆకర్షణ అయింది చుట్టూ మూగే వారు .ఇతనికంటే ముందే వాళ్ళు అతన్ని ‘’ముగ్గులోకి దించే వారు ‘’.అప్పుడు పురుష సింహమే అయిపోయేవాడు .వల పన్ని పడేసేవాళ్ళు .అందం ఆకర్షణ రాచరికం ఉండటం తో అన్ని అంతస్తుల స్త్రీలు అతని తో సంగమించి సంతృప్తి చెందేవారు .అందులో మేరీ కరోలిన్ లాంబ్ ఒకరు .ఆమెకు భర్త కాబోయే ప్రధాని .యవ్వనోద్రేకం లో ఉన్న ఆమెను భర్త సుఖ పెట్టలేక పోతున్నాడని బైరన్ చెంత చేరి శృంగార లీలా విలాసం సాగించి ‘’ఈ లాంబ్ ఆ సింహానికి’’ ఎర అయి పోయింది .’’that beautiful face is my fate –mad ,bad ,dangerous to know ‘’అని డైరీలో రాసుకొంది.ఆడ వాళ్ళ శృంగార సామ్రాట్ అయ్యాడు .వాళ్ళ రక్షణా ఏడుగడ తానె అనిపించాడు .సర్వ సౌఖ్యాలు పొందాడు ,పొందించాడు .అదో లోకం గా గడిపాడు ఆ దక్షిణ నాయకుడు ..పడేయ్యటం పడ వేయించుకోవటం ‘’వీజీ ‘’అయి పోయింది .’’నాటీ’’అని అందరూ ప్రేమగా ఆప్యాయం గా పిలిచేవారు ఈ ‘’లవ్ లార్డ్ బైర’న్ ‘’ను .’’అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం –‘’తరం తరం నిరంతరం ఈ అందం ‘’గా గడిచి పోతోంది .కరోలిన్ ను యెంత దూరం చేయాలనీ ప్రయత్నించినా అంత మీద పడి పోతోంది .ఇప్పటికి మన శ్రుంగార లార్డ్ వయసు పాతిక మాత్రమె .

ఏది చేసినా పద్ధతి ప్రకారమే సాగించాడు .అన్న బెల్లా బైరాన్ కు సాయం చేసేది .కాని ఆమె ఇష్టం లేకుండా ముందుకు అడుగు వెయ్యలేక పోయాడు ఇంతలో లేడీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ జెం ఎలిజబెత్ అనేవివాహిత నలభై ఏళ్ళ పిల్లా జెల్లా తో ఉన్నావిడ బైరాన్ పై మోజు పడింది .ఎన్నో షరతులు పెడితే వదిలేశాడు .ఇంకా చాలా మంది గాలం వేస్తున్నారు మన’’కవి చేప’’ చిక్కటం లేదు .హాయిగా ప్రశాంతం గా గడపాలని కోరుకొన్నాడు .కవిత్వమే పరిష్కారం అని ఎంచుకొన్నాడు .1813లో ‘’ది జియనోర్ అండ్ ది బ్రిడ్ ఆఫ్ అబిదోస్ ‘’పబ్లిష్ చేశాడు .తర్వాత ‘’కార్సైర్ ‘’రాస్తే పన్నెండు వేల కాపీలు అమ్ముడు పోయాయి .న్యు స్తేడ్ ఆబ్బే ఎస్టేట్ ను లాభానికి అమ్మాడు .కాని కొనే వాడు పూర్తీ డబ్బు ఇవ్వలేక పోవటం తో బైరన్ కే దక్కింది .బిజీ బిజినెస్ మాన్ అయ్యాడు .ఒంటరితనం బాధిస్తోంది .

తన టర్కిష్ కద ఆధారం గా ‘’ది బ్రిడ్ ఆఫ్ అబిదోస్ ‘’ఇద్దరు విఫల ప్రేమికుల కదరాశాడు విషాద ‘’ఎపిజిల్ తు ఆగస్తా ‘’రాసాడు .బిడ్డను కన బోయే ముందు లేడీ మేల్బోర్న్ అనే అమ్మాయిని ప్రేమించి ఆమె చెల్లెలిని తీసుకొని యూరప్ వెళ్లాడు .పాపం చేస్తున్నావని ఆమె చెప్పినా పేడ చెవిని పెట్టాడు .పెళ్లి చేసుకోమని మేల బోర్న్ కోరుతోంది ,అనబెల్లా మీద మనసు దూరం కావటం లేదు .ఎటూ పాలు పోనీ స్థితి .కాని సృజన శక్తి మాత్రం విజ్రుమ్భిస్తూనే ఉంది .చెల్లెలు ఆగస్తా మాత్రం పాదరస బుద్ధి ఉన్న అన్న గారి జీవితం ఏమై పోతుందో అని కల వర పడుతోంది .1815లో అనబెల్లాను పెళ్లి చేసుకొన్నాడు .చర్చి లోంచి బయటికి రాగానే ‘’నన్ను సంస్కరించేంత గోప్పదానివా నువ్వు “’అని గురుడు పెట్రేగి పోయి అన్నాడు .పక్కలో పడుకోవచ్చా అని అడిగితే యవ్వనం దాటేదాకా పడుకోమ్మన్నాడు .తన సోదరితో బైరన్ ప్రేమకలాపం సాగిస్తున్నాడన్న రూమర్లు విన్నది .కాని అవి అబద్ధాలని నమ్మింది

బైరన్ పరిస్థితి రోజు రోజుకూ కుంగి పోతోంది .డిప్రెషన్ లో పడిపోతే అనబెల్లా సేవ చేస్తోంది .డబ్బు చేతిలో ఆడటం లేదు మరీ ఉద్రేకం పెరిగింది .అప్పుల వాళ్ళు రోజూ వచ్చి చెవిలో రోద పెడుతున్నారు అనబెల్లా గర్భిణి .సాయం కోసం అగస్తా వచ్చింది .బైరాన్ ను ప్రశాంతం గా ఉంచగలిగింది సోదరి ఆగస్తా మాత్రమె అను బిడ్డ ను కన్నది .కాని బైరన్ కు ఇదేమీ పట్టలేదు .పిచ్చివాడై పోతున్నాడు .పిచ్చ పిచ్చగా భార్యను తిడుతున్నాడు బిడ్డ మీద ప్రేమే చూప లేదు కూతురికి ‘’అగస్తా ఆదా’’ పేరు పెట్టాడు .అగస్తాను పంపిడ్డామనుకొంటే ఆమె ఇక్కడే ఉండి పోయింది .బైరన్ ను ఎప్పుడూ ఎవరో ఒకరు కని పెట్టుకొని ఉండాల్సిన అవసరమేర్పడింది .అగస్తా తలిదండ్రులను చేరి మళ్ళీ తిరిగి రాలేదు .పెళ్లి సంబడం ఒక ఏడాది మాత్రమె .ఈ విడిపోవటం అనేక పుకార్లకు చోటు కల్పించింది .’’నాకు రెండొందల మంది తో సంబంధం ఉంది ‘’గర్వం గా చెప్పుకొనే మగధీరుడు అనేక అభియోగాల్లో చిక్కుకొన్నాడు .అగస్తా తో అక్రమ సంబంధం ఉందనీ చెవులు కొరుక్కున్నారు .కాని బైరన్ ఆమెలో తన తల్లినే చూసుకొన్నాడు. తల్లి ప్రేమ ను పొందలేని బైరాన్ ఆమె సన్నిధిలో ఆ మాతృప్రేమ రుచిని పొందుతున్నాడు .25-4-1816న మన లార్డ్ గారు సెమి రాయల్ దర్జాతో ముగ్గురు సేవకులు ,ఒక డాక్టర్ తో స్వయం గా ప్రవాస జీవితాన్ని ఎన్నుకొని లండన్ వదిలి వెళ్లి పోయాడు .కుళ్ళి కంపుకొట్టే ఈ సమాజానికి దూరం గా వెళ్తున్నానని చెప్పుకొన్నాడు బైరన్ .ఇరవై ఎనిమిదేళ్ళ ఈ కవి వీరుడు ఇంకా సాధించాల్సిన అద్భుతాలెన్నో ఉన్నాయి .

ఊరు మార్చినా బైరన్ తీరు మార్చుకోలేక పోయాడు .రాజ భోగాలు చిహ్నాలు వదల్లేదు కాని మనసు వ్యధా భరితమై ఉంది .మాథ్యూ ఆర్నోల్డ్ చెప్పినట్లు ‘’the pageant of his bleeding heart’’గా రక్తం కారుతున్న గుండెతో ఉత్సాహం గా ఉన్నాడు .ఆయన కారేజిలో మంచం పరుపు ,కుర్చీ ,రాత బల్ల ఉన్నాయి నెపోలియన్ అంటే అభిమానం ఈ హంగామా తో యూరప్ పర్యటన చేశాడు .జేనేవా చేరి షెల్లీ దంపతుల్ని చూశాడు .రాడికల్ ఫిలాసఫర్ విలియం గాద్విన్ ను కలుసుకొన్నాడు .తనకు ప్రేమాస్పదం గా ఉత్తరాలు రాసే క్లైర్ ను చూశాడు .చెడ తిరుగుడు తిరిగినా బైరన్ కు ‘’ఫ్రీ లవ్ సొసైటీ ‘’మీద ఇష్టం లేదు .కాని ఫ్రీ లవ్ వ్యాప్తికర్త షెల్లీ అంటే అభిమానం .షెల్లీ కూడా బైరన్ తీవ్ర భావాలకు ముచ్చటపడ్డాడు అతని సృజన కు జోహార్లిచ్చాడు .లోవేల్ పీకాక్ తో బైరన్ చాలా ప్రత్యేకమైన వ్యక్తీ అని కాని చంచల స్వభావం ఉన్నవాడని రాశాడు .

క్లైర్ పై ప్రేమ లేకున్నా ,కోరిక గాఢమైతే ఆమెకూడా లొంగింది .షెల్లీ దంపతులతో వీరిద్దరూ కలిసి మెలిసి ఉన్నారు .ఇది ఎక్కువ కాలం సాగలేదు ఆమెను వదిలిన్చుకొన్నాడు బైరన్ .చిలాన్ కోట కు వెళ్లి పోయాడు .ఇక్కడే ‘’ది ప్రిసనర్ ఆఫ్ చిల్లాన్ ‘’కవిత రాశాడు. క్లైర్ తో పడుకోన్నాడుకాని ఆమె అంటే అయిస్టమే.ఆమెను ఒక ప్రైవేట్ సెక్రటరీగా తన గజి బిజీ రచల కాపీయిస్ట్ గానే భావించాడు .గర్భవతిని అని ఆమె చెప్పింది .షెల్లీలు ఇంగ్లాండ్ వెడుతూ ఆమెను జాగ్రత్తగా చూసుకోమంటే సరే అన్నాడు .తన మనోభావాలను అగస్తాకు రాస్తూ ఈ యువతుల బాధ ఎక్కువైన్దన్నాడు .జేనేవా నుండి ఇంగ్లాండ్ కు ఒక బిడ్డను కనటానికే వచ్చానని రాసుకొన్నాడు .క్లైరా వెళ్ళిపోయినా బాధ తాగ్గలేదు .మెటా ఫిజిక్స్ కు మౌంటెన్స్ కు మధ్య ఊగిసలాడుతున్నాడు .దానినే కవిత గా ఇలా చెప్పాడు .’’there is a power upon me which withholds –and makes it my fatality to live for I have ceased –to justify my deeds unto myself –the last infirmity of evil’’.

అగస్తాకు తన గుండె బాధ అంతా ఉత్తరాల్లో వివరిస్తున్నాడు .ఇటలీకి చేరి మూడినెస్’’ ను వదిలిన్చుకొన్నాడు .మిలన్ లో హుషారుగా ఉన్నాడు .ఆడ్రియాటిక్ కు చేరాడు జూలియెట్ సమాధి చూశాడు. నవంబర్ లో చలి రోజున వెనిస్ వచ్చాడు .అంతా తడి గా చీకటిగా ఉందని పించింది .మానసిక ప్రశాంతత అక్కడ దొరకదనుకొన్నాడు .ఇక్కడే గొప్ప పేరు పొందిన లిరిక్స్ రాశాడు అందులో ‘’సో వెల్ గో నో మోర్ ఏ రొవింగ్ ‘’కవిత ఉంది .’’for the sword outwears its sheath –and the soul wears out the breast –and the heart must pause to breathe –and love itself have rest ‘’క్లైర్ నుంచి ఉత్సాహం తో ఉత్తరాలోస్తూనే ఉన్నాయి. షెల్లీలతో ఉన్న ఆమె బాత్ లో పెళ్లి చేసుకోంది కూతురు అల్లీగ్రా పుట్టిందని తెలిసి బైరన్ సంతోషించాడు .వెనిస్ దగ్గర బ్రెంతాలో ఒక కాటేజీ అద్దెకు తీసుకొని ఉన్నాడు .మార్గారిటా కాగ్నిఅనే మురికి వాడ పిల్ల తో తో సన్నిహితం గా మెలిగాడు .ఆమె నిప్పుల కుంపటి ..ఇంటి ని కుదిర్చిన మేరియానాతో తగాదాపడి జుట్టూ జుట్టూ పట్టుకోన్నారిద్దరూ .డబ్బున్న లార్డ్ కనుక సర్దుకు పోయారు .బైరన్ ఏది రాసినా ముందే డబ్బు చెల్లించే పబ్లిషర్ దొరికాడు .1818లో ‘’ డాన్ జువాన్ ‘’నవల ప్రారంభించాడు .అప్పులేవీ లేవు హాయిగా ఉన్నాడు .న్యుస్టేడ్ ఆబ్బే లక్ష పౌండ్లకు అమ్మేశాడు ఇటాలియన్ స్టేటస్ ప్రకారం ‘’ప్లూటోక్రాట్ ,అరిస్టోక్రాట్ ‘’అయ్యాడు .గ్రాండ్ కెనాల్ ఒడ్డున పలజో మోసినిగో కొని స్తిరపడ్డాడు .మందీ మార్బలం తో కుక్కా నక్కా ,నెమలి కొంగ కోతి లతో అక్కడ తిష్ట వేశాడు .

అదేమీ ఖర్మమో ఇంత సంపద ఉన్నా ఇంకా సుఖం లేదనుకొంటున్నాడు .ఇంగ్లాండ్ వార్తలు శుభ సూచికం గా లేవు అక్కడికి వెళ్ళిన తర్వాత మరీ దారుణ వార్తలు వినాల్సి వచ్చింది .అగస్తా అన్నబెల్లాలు వచ్చి సాయం చేస్తున్నారు అగస్తాను రక్షించే ఉద్దేశ్యం తో అనబెల్లా ఉంటోంది .సోదరుడు బైరన్ తో ఆమె ప్రవర్తన జుగుప్స కలిగిస్తోందని పద్ధతి మార్చుకోమని కౌన్సెలింగ్ ఇస్తోంది .అగస్తా రాసిన ప్రేమ లేఖలను బైరన్ తిరిగి ఇచ్చేశాడు .’’నిన్ను నువ్వు కించ పరచు కోవద్దు ‘’అని సలహా ఇచ్చాడుకూడా .’’మనం మానవ మాత్రులం .మనం కలిసి ఉండాలని దైవ నిర్ణయం .వచ్చి ఇక్కడే ఉండు ‘’అని రాశాడు .ఆమె తిరస్కరించింది .ఉత్తరాలు రాయటం తాగ్గించింది .విడిపోవటం పతనం కాకూడదని బైరన్ నిర్ణయించాడు ‘’all suffering doth destroy ,or is destroyed –even by the sufferer and in each event ends’’అని కవిత చెప్పాడు .

బుర్ర్ర బానే ఉన్నా శరీరం దెబ్బ తింటోంది.లావయ్యాడు ముందుగానే జుట్టు తెల్లబడింది .డాన్ జువాన్ ను హుషారుగా రాస్తూనే ఉన్నాడు .వచనం అనుకొంటే కవితా దోరణి లో సాగుతోంది .ఇందులో సాహస కృత్యాలు సెటైర్ త్రుణీకారం అన్నీ ఉన్నాయి ‘’don Juan is one of the most personal aswell as one of the most enlivening long poems ever written ‘’అని పించుకోంది.’’టర్న్ కోట్ లేక్ పోయెట్స్’’అని పించుకొన్నవర్డ్స్ వర్త్ సూతీ లకు ఎదురొడ్డి రాసిన కవిత్వం ఇది వాళ్ళని అవహేళన చేస్తూ రాసిన పంక్తులెన్నో ఉన్నాయి దీనిని ‘’ masterly virtuoso performance ‘’అన్నారు .దీన్ని రాస్తూనే తాను ఏమిటో తన భావాలేమిటో నిర్వచనం చేశాడు .జ్ఞాపకాలను ,అనుభవాలను రాయాలని సంకల్పించాడు .దీని రాత ప్రతిని ముర్రే అనే పబ్లిషర్ కు ఇస్తే మళ్ళీ ఇంకొక స్కాండల్ లో ఇరుక్కుపోతాడేమో నని తగల బెట్టేశాడు .

         బైరన్ కు కస్టాలు ప్రారంభమయ్యాయి .నెర్వస్ అయిపోయాడు .కలత చెందుతున్నాడు .బాదర బందీ తగ్గించేసుకొన్నాడు .తెరిస్సా గుస్సియోలి తో పరిచయం అయింది .మన వాడికి ముప్ఫై ఒకటి ఆమెకు పందొమ్మిది .ఆమెకు అప్పటికే పెళ్లి అయింది బైరన్ తో చనువుగా ఉంటోంది పార్టీలకు వెంట తిప్పుకొంటున్నది . అది ఇటలీ సంప్రదాయమే నట .బైరన్ ఒక ‘’లవర్ సర్వెంట్’’ .ఆమె భర్తకు ఇదంతా తెలుసు .కాని ఏమీ చేయలేని స్థితి .భార్యా భర్తా ఎక్కడికి వెళ్ళినా కుక్క లాగా వెంట వెళ్ళాల్సి వచ్చేది ఆమె బలవంతం మీద అయిష్టం గానే వెళ్ళే వాడు .’’the die is cast –and I must but bitterly pass the rubicon .Every thing is to be risked for a woman one likes’’అని తోకాడించు కొంటూ వెళ్ళేవాడు లార్డ్ బైరన్ .ఆమె గర్భం విచిన్నమైనప్పుడు మన వాడిని సహాయానికి ఉంచారు .నయం అయిన తర్వాతా తెర్రేసా తో కలిసి గుర్రపు స్వారి చేశాడు వందకు పైగా ఆమెకు ప్రేమ లేఖలు గిలికాడు .బొలోనా వెళ్లారు దంపతులు .బైరన్ వెంట వెళ్లాడు .అక్కడా సుఖం దొరకలేదు చూపు సుఖమేకాని శారీరక సౌఖ్యం పొందలేక దిగులు .తనను తానూ చవటాయ్ వెర్రి వెధవాయ్ అయి పోతున్నానేమో నని ఆందోళన .తెరెసా తనను మోసం చేస్తోందని దిగులు .ఇవన్నీ అగస్తాకు రాస్తున్నాడు ఆమె ఓదారుస్తూనే ఉంది .తెరిస్సా ధైర్యం చేసి  ఒక ప్రైవేట్ ఇంట్లో ఉంది.కౌంట్ గుస్సియోలి తిరిగి వచ్చాడు రేవీనా కు భార్యను తీసుకు పోవటానికి నిశ్చయించాడు .బైరన్ ను ఇక తమ తో రావద్దని చెప్పాడు .హతాశుడై ప్లాటోనిక్ ప్రేమ వర్షిస్తూనే ఉన్నాడు .కాని ఆమెకు జ్వరం వచ్చి బైరన్ తన వద్ద ఉండాలని కోరుకొన్నది .తప్పిందికాదు విసనకర్ర విసరటం ,పెళ్ళాడిన స్త్రీకి గుర్తింపు పొందిన ప్రేమికుడుగా ఉండటం చేస్తున్నాడు .తన హీన దీన స్థితిని ‘’ I have been more ravished myself than any body since Trojan war ‘’అని రాసుకొన్నాడు .

తెరెసా ఆరోగ్యం కుదుటబడి బ్రిటీష డిప్లమాటిక్ కార్పస్ కు బైరన్ సేవలు అవసరమని చెప్పి తమతో రమ్మన్నాడు ఈ కామెడీ ఇలా సాగుతూనే ఉంది .అందుకే ‘’Byron was more captured than captivated ‘’అన్నారు .చివరికి ఆమె భర్తనుంచి విడిపోవాలనుకోంది .విడాకులు అసాధ్యం .తలిదండ్రులు ఆమెనే సమర్ధింఛి కోర్టుకు వెళ్లి భర్త ఆమెను క్రూరం గా హిం సిస్తు న్నాడన్నారు . ఆమె గెలిచింది .కాని బైరాన్ కు ఈ విజయం అచ్చి రాలేదు .వెళ్లి పోతున్నానని చెప్పితే ఏడ్చేసింది వెళ్ళిన తర్వాత పుట్టింటికి చేరింది . .

బైరన్ తన కవిత్వం రా స్తూనే ఉన్నాడు .ఉత్సాహం ప్రేరణ కావాల్సి వస్తున్నాయి డాన్ జువాన్ లో ఐదో అధ్యాయం మొదలెట్టాడు .మెరీనో ఫెలీరియో ,సర్దానాపలాస్ ,ది తు ఫోస్కారి అనే మూడు ట్రాజెడీలు రాశాడు అతని ‘’విజన్ ఆఫ్ జడ్జి మెంట్ ‘’కు పేరు బాగా వచ్చింది .అతని రాజకీయ దోరణులు ఇబ్బంది కలిగిస్తున్నాయి .నిఘా ఉంచారు .కూతురు అల్లీగ్రా ఏమైందో ననే ఆందోళన ఎక్కువైంది. బాగా చలిగా ఉండే కాన్వెంట్ లో ఉంచారాపిల్లను .అయిదేళ్ళ పిల్ల జబ్బు చేసి చచ్చిపోయిన్దని తెలిసింది .లిబరల్స్ పరిస్థితి దారుణం .గామ్బాలను దేశం వదిలిపోమ్మనే ఒత్తిడి ఎక్కువైంది ..ఆలస్యం చేస్తూ చివరికి పీసా చేరి షెల్లీలను కలిశాడు .మేలోడ్రమటిక్ స్టాంజాలు అద్భుతం గా రాస్తున్నాడు .షెల్లీ బృందం లో తానొక ‘’యాహూ ‘’గాడి గా ఉన్నానను కొన్నాడు .బైరన్ ఉంటున్న ఇంట్లో నుంఛి లీహంట్ బయటికి నెట్టేసి ఆక్రమించాడు .బైరన్ ను నానా దుర్భాషలాడి అవమానించాడు .

తెరెసా ఉత్తరాలు రాస్తూ డాన్ జువాన్ ను ఆపెయ్యటం కాని లేదా ఇంకాస్త శృంగారాన్ని రంగరించి ,అవినీతిని తగ్గించి రాయమని కోరింది .నిజం గా ఆమె అతి గర్విష్టి .1822లో బైరన్ చావుకు దగ్గరయ్యాడు .షెల్లీ ఆకస్మిక చావుకు బాధపడి అంత గోప్పకవి స్వార్ధ రహితుడు ఎవరూ లేరని మెచ్చాడు గ్రీకులు స్వాతంత్ర యుద్ధం చేస్తున్నారు అక్కడికి వెళ్లి గ్రీకు కమిటీ సభ్యుడయ్యాడు .గేనోవా వెల్లాలనుకొంటే తెరెసా తానూ వస్తానంటే వద్దని వెళ్ళిపోయాడు .గ్రీస్ చేరాడుకాని శుభ సూచనలేవీ కనీ పించలేదు .గ్రీకుల్లో అంతర్య్ద్ద్ధం తీవ్రం గా ఉంది .వాతావరణమూ బాగా లేదు .అనుకోకుండా జబ్బు పడ్డాడు తన చావు డ్రమాటిక్ గా సమాప్తం అవ్వాలని అనుకొన్నాడు ఒక గ్రీకు కుర్రాడితో హోమో సెక్స్ లో పాల్గొని ఎన్నో ఏళ్లుగా మనసులో ఉన్న కోర్కె ను తీర్చుకొన్నాడు .వాడికోసం ఒక కవిత కూడా రాశాడు ‘’if Greece should fall ,I will bury myself in its ruins .If she should establish her independence I will take up residence in some part or other perhaps Attica ‘’అని గ్రీకు స్వాతంత్రం కోసం కల కన్నాడు .గ్రీసు చేరి, తానూ ఉద్యమం లో పాల్గోనాలనుకోన్నాడుకాని అవకాశం ఇవ్వలేదు .యుద్ధం చేస్తూ వీర మరణం పొందాలనుకొన్న వాడు మంచం మీద జబ్బు పడి చనిపోవాల్సి వచ్చ్చింది .మలేరియా సోకింది డాక్టర్ల మీద బైరన్ కు గురి లేదు ,19-4-1824న ‘’నాకూతురు నా చెల్లెలు ‘’ అని కలవరిస్తూ లార్డ్ బైరన్ కవి చనిపోయాడు .

బైరన్ కవి కవిత్వం అతని జీవిత విధానమే .అది కదిలించదు ప్రేరణ కల్గించదు .కీట్స్ కవి ‘’సెన్సస్ తో జీవిస్తే ,బైరన్ ‘’సెన్సేషన్ ‘’జీవించాడు బైరన్ టెక్నిక్కులు అతని వేగం ,తెలివి ,అజాగ్రత్త చేష్టలకు దర్పణాలు .అంత్యప్రాస హిట్ కాని ఫట్ కాని అవుతుంది .అతని సాహిత్య పరిజ్ఞానం విస్ఫోటనమే అని పిస్తుంది .’’oh 1might I kiss those eyes of fire?’’అన గల నేర్పున్నవాడు .బైరన్ సృజన శీలి మాత్రమె కాదు స్వయం వ్యక్తిత్వం ఉన్న నటుడు కూడా .నాటక రంగంపై అభిరుచి అతని లో ఉన్న కవిని దెబ్బ తీసింది .కవులపై ప్రేమ అతని కి స్త్రీలపై ఉన్న ప్రేమకంటే నీచం .కవితా దృక్పధాన్ని అర్ధం చేసుకోకుండా రాశాడు .సెన్సేషన్ మాత్రమె బైరన్ కవిత్వాన్ని బతికించింది .అతనిలోని సెక్సువల్ ఎనర్జీ ఊగినట్లు అతని కవితా పంక్తులు ఊగుతాయి .రొమాంటిక్ శక్తి సామర్ధ్యాలకు బైరన్ రాసిన ‘’డాన్ జువాన్ ‘’గొప్ప ఉదాహరణ మాస్టర్ పీస్ అన వచ్చు .సగం ఫిలాసఫర్ అంటారు బైరన్ ను .’’an ardent lover,a ruthless libertine –is creator intended him to be both a paragon and a paradox ,an amoral but some how indignant onlooker who wants to face a lying world with the truth ‘’అని ఆవిష్కరించారు ఆయన రాసిన జువాన్ ఆధారం గా .

‘’చైల్డ్ హోరాల్డ్స్ పిల్గ్రిమేజ్ ‘’బైరాన్ సాధించిన మరో విజయం మాన్ఫ్రేడ్ కవిత ఉత్సాహాన్నివ్వటమే కాక గోప్పకవిత అనిపిస్తుంది .బైరన్ జీవితాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ‘’కిం ‘’కవిత చదవాలి .అందులో ఇటలీ విప్లవం ,అతని పాత్ర తెలుస్తాయి .దీన్ని లేక్ కవులు హారర్ కవిత్వం అన్నారు .’’వర్డ్స్ వర్త ది రాజీ పద్ధతి అయితే బైరన్ ది తిరుగు బాటు ‘’అని కాల్ రిడ్జి జడ్జి చేశాడు .బైరన్ ఒక తరాన్ని పూర్తిగా ప్రభావితం చేశాడు .డాస్తోవిస్కి లాంటి వారికి ప్రేరణ గా నిలిచాడు. గోదేకు జర్మన్ రోమాం టి క్స్ కు మార్గ దర్శి అయ్యాడు .స్వేచ్చను ప్రేమించిన ప్రేమికుడు బైరన్ .మనిషివిలువను గుర్తించాడు .ఎక్కడా స్తిరం గా ఉండలేక ఇమడలేక సంచారి గా జీవించాడు .అందుకే బైరన్ ను‘’exiled pilgrim of eternity .he had that within him which shall tire torture and time ‘’.

బైరానిక్ హీరోలను సృష్టించాడు అతని విధానాన్ని ‘’బైరో మానియా ‘’అంటారు .అతని ప్రభావం ఖండాంతరంగా వ్యాపించింది .బైరన్ సొసైటీ ఏర్పడి స్మారకోపన్యాసాల నేర్పరుస్తున్నారు .రొమాంటిక్ ఉద్యమానికి గొప్ప ప్రేరకుడు బైరన్ .