లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC)
సంస్థ వివరాలు
అధికార పరిధి Department of Space
ప్రధానకార్యాలయం Trivandrum
వార్షిక బడ్జెట్ See the budget of ISRO
కార్యనిర్వాహకులు Mr. S Somanath, Director
Parent agency ISRO
వెబ్‌సైటు
lpsc.gov.in

లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC) ఇస్రోకు చెందిన పరిశోధన, అభివృద్ధి సంస్థ.[1] దీనికి రెండు కేంద్రాలు - కేరళ లోని వళియమాల వద్ద ఒకటి,  బెంగళూరులో మరొకటి - ఉన్నాయి. వీటికి తోడుగా తమిళనాడులోని మహేంద్రగిరి వద్ద ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్సు ఉంది.

LPSC, వాహక నౌకల ద్రవ ఇంధన, క్రయోజెనిక్ ఇంధన ప్రొపల్షన్ దశలను అభివృద్ధి చేసే పనిలో ఉంది. అవే కాక, వాహక నౌకల, ఉపగ్రహాల అనుబంధ చోదక (ప్రొపల్షన్) వ్యవస్థలను కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తారు. వాహక నౌకలకు సంబంధించిన లిక్విడ్ ప్రొపల్షన్ దశలు, క్రయోజెనిక్ ప్రొపల్షన్ దశలు,  వాహక నౌకలు, ఉపగ్రహాల నియంత్రణ వ్యవస్థలు తిరువనంతపురంలో చేస్తారు. సున్నితమైన నిర్మాణాలు, ట్రాన్స్‌డ్యూసర్ల అభివృద్ధి, ఉపగ్రహ చోదక వ్యవస్థల ఏకీకరణ బెంగళూరులో  చేస్తారు. వీటన్నిటి, శాసనసభ, పరీక్ష మొదలైన వాటిని మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్సులో చేస్తారు.

పిఎస్‌ఎల్‌వి యొక్క ద్రవ ఇంధన చోదిత దశలను ఎస్‌ఎల్‌వి3, ఎఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి ల నియంత్రణ వ్యవస్థలను, ఇన్‌సాట్, ఐఆర్‌ఎస్ ల  ప్రొపల్షన్ వ్యవస్థలను, ప్రెజర్ ట్రాన్స్‌డ్యూసర్లను  LPSC ఉత్పత్తి చేస్తుంది. LPSC తయారు చేసిన క్రయోజెనిక్ అప్పర్‌స్టేజిని జిఎస్‌ఎల్‌విలో విజయవంతంగా ఉపయోగించారు.

LPSC వళియమాల[మార్చు]

ఇది LPSC యొక్క ప్రధాన కార్యాలయం. ఇది వివిధ దశలను, ఇంజన్లను, వాహక నౌకల, ఉపగ్రహాల సంబంధిత నియంత్రణా వ్యవస్థలను, పరికరాలను సరఫరా చేస్తుంది. [2][3]

వళియమాలలో కింది కార్యక్రమాలు చేస్తారు:[2]

  • వాహక నౌకలు, ఉపగ్రహాల కోసం భూమిపై దాచి ఉంచగలిగే చోదక వ్యవస్థలు, క్రయోజెనిక్ చోదక వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధి
  • సిస్టమ్ డిజైన్, ఆర్కిటెక్చరు
  • సిస్టమ్ ప్రాజెక్టుల నిర్వహణ
  • భూమిపై దాచి ఉంచగలిగే చోదక, క్రయోజెనిక్ చోదక ఇంజన్లు, వ్యవస్థల నిర్వహణ
  • వాహక నౌకల చోదక నియంత్రణ వ్యవస్థల సమీకృతం
  • తక్కువ స్థాయి థ్రస్టర్ల పరీక్ష

LPSC బెంగళూరు[మార్చు]

ఇస్రో యొక్క ఉపగ్రహ కార్యక్రమాల అవసరాల కోసం ఇది పనిచేస్తుంది. సెన్సర్లు, ట్రాన్స్‌డ్యూసర్లను ఇది తయారుచేస్తుంది.[3] ఇక్కడ జరిగే కార్యక్రమాలు:[2]

  • మోనో ప్రొపెల్లెంట్ థ్రస్టర్లు, పరికరాల డిజైను, అభివృద్ధి
  • వాహక నౌకల చోదక వ్యవస్థలను సమకూర్చడం
  • ట్రాన్స్‌డ్యూసర్ల అభివృద్ధి, ఉత్పత్తి
  • వాహక నౌకల దశల ట్యాంకులు, నిర్మాణాలను నిర్వహించడం

LPSC మహేంద్రగిరి[మార్చు]

2014 ఫిబ్రవరి 1 న ఈ సంస్థ పేరును ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ గా మార్చి, ఇస్రో అధీనంలోని స్వతంత్ర సంస్థగా మార్చారు. అంతకుముందు ఇది LPSC వళియమాల అధీనంలో ఉండేది.[4] ఇక్కడ జరిగే ముఖ్య కార్యక్రమాలు:[2]

  • ద్రవ ఇంజన్లు, దశల కూర్పు, సమీకరణ
  • ద్రవ ఇంజన్లు, దశల పరీక్ష
  • అప్పర్ స్టేజీ ఇంజన్ల కోసం హై ఆల్టిట్యూడ్ పరీక్ష
  • ప్రొపెల్లెంట్ స్టోరేజీ సౌకర్యం

ఇవి కూడా చూడండి[మార్చు]

  • భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ
  • సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం

బయటి లింకులు[మార్చు]

మూలాలు వనరులు[మార్చు]

  1. LPSC Webpage
  2. 2.0 2.1 2.2 2.3 "Home-History Liquid Propulsion Systems Centre". Archived from the original on 27 జనవరి 2014. Retrieved 5 February 2014.
  3. 3.0 3.1 "ISRO Centres-Liquid Propulsion Systems Centre". Retrieved 5 February 2014.
  4. "Isro's Mahendragiri centre elevated, gets more powers". Retrieved 3 February 2014.