Jump to content

లినక్స్ జర్నల్

వికీపీడియా నుండి
లినక్స్ జర్నల్
లినక్స్ జర్నల్ చిహ్నం
వర్గాలుకంప్యూటరు
తరచుదనంనెలవారీ
మొదటి సంచిక1994
ఆఖరి సంచికఆగష్టు 2011
సంస్థబెల్ టౌన్ మీడియా, ఇంక్.
దేశంఅమెరికా
భాషఆంగ్లము
వెబ్సైటుhttp://www.linuxjournal.com/

లినక్స్ జర్నల్ అనేది బెల్ టౌన్ మీడియాచే ప్రతీ నెలా విడుదలచేయబడే ఒక సాంకేతిక మాసపత్రిక. ఇందులో ప్రత్యేకంగా లినక్స్కు సంబంధించిన విషయాలను, సమాచారాన్ని ఓపెన్​సోర్స్ ఔత్సాహికుల కోసం అందిస్తుంది.

చరిత్ర

[మార్చు]

లినక్స్ కెర్నలు, లినక్స్ ఆధారిత నిర్వాహక వ్యవస్థల గురించి మొట్టమొదటిసారిగా ప్రచురించిన మాసపత్రిక లినక్స్ జర్నల్. తొలి సంపుటి 1994 మార్చిలో ఫిల్ హ్యూస్, బాబ్ యంగ్ (రెడ్ హ్యాట్ సహవ్యవస్థాపకుడు) లచే ప్రచురించబడింది. ఈ సంచికలో లినక్స్ కెర్నల్ సృష్టికర్త అయిన లినస్ టోర్వాల్డ్స్ తో ముఖాముఖి ప్రత్యేకంగా పేర్కొనబడింది.

ప్రచురించే విషయాలు

[మార్చు]

లినక్స్ అభివృద్ధికి సంబంధించిన అన్ని స్థాయిలను, లినక్స్ ఉపయోగించడం, అందులో పనిచేసే సాఫ్ట్​వేర్ పైనా లినక్స్ జర్నల్ వ్యాసాలను ప్రచురిస్తుంది, ఇందులో పరికరాల డ్రైవర్లను వ్రాయడం దగ్గర నుండి గింప్ తో ఛాయాచిత్రాలను సవరించడం వరకూ ప్రతీది ఉంటుంది. చేయడం ఎలా, ట్యుటోరియల్స్ (ఉపశిక్షణల) మాత్రమే కాకుండా, ప్రతీసంచికలోనూ లినక్స్ ఉత్పత్తుల యొక్క సమీక్షలు, చిట్కాలు, విపణి విశ్లేషణలు వంటివి కూడా ఉంటాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]