లినక్సు ఫార్మటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Linux Format
Linux Format 243 cover.jpg
సంపాదకులుNeil Mohr
వర్గాలుLinux
తరచుదనం13 per year
ముద్రించిన కాపీలు19,000 Jan-Dec 2014
మొదటి సంచిక2000; 23 సంవత్సరాల క్రితం (2000)
సంస్థFuture plc
దేశంUnited Kingdom
భాషEnglish
వెబ్సైటుlinuxformat.com
ISSN1470-4234

లినక్సు ఫార్మటు , ఇది బ్రిటన్ దేశపు మొదటి లినక్సు పత్రిక! అంతే కాకుండా బ్రిటనులో ఇది ప్రస్తుతము అత్యధికంగా అమ్ముడవుతున్న పత్రిక. ఒక్క బ్రిటను మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలకు దీనిని ఎగుమతి చేస్తున్నారు.

ఈ పత్రికలో కూడా ఇతర కంప్యూటరు పత్రికలలాగానే అన్ని విషయాలూ ఉంటాయి, కానీ ఇవి లినక్సు వినియోగదారులకోసం ప్రత్యేకంగా వ్రాస్తారు. ఇందులో సమీక్షలు, సాంకేతిక విషయాలు, ట్యుటోరియల్లు మొదలైనవి ఉంటాయి. ఈ పత్రికలో వ్యాసాలు అన్ని స్థాయిలలోని వినియోగదారుల కోసం వ్రాస్తారు.

ఈ పత్రిక ప్రతి సంవత్సరం పదమూడు పర్యాయములు ప్రచురిస్తారు. పత్రికతో పాటూ ఒక సీడీ లేదా డీవీడీ వస్తుంది. ఈ సీడీలలో ఏదో ఒక పంపిణీ లినక్సు వస్తుంది.

ఈ పత్రిక ఫ్యూచర్ పబ్లిషింగు వారు ప్రచురిస్తున్నారు. ఇది 1999 లో ప్రారంభమయిన ఈ పత్రికను ఇటాలియన్, గ్రీకు, రష్యన్ భాషలలోకి తర్జుమా కూడా చేస్తున్నారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]