లిబర్టీ షూస్ లిమిటెడ్
రకం | Public, (BSE 526596, NSE LIBERTSHOE) |
---|---|
పరిశ్రమ | Shoe |
స్థాపన | 1954 |
ప్రధాన కార్యాలయం | Karnal, Haryana [1] |
కీలక వ్యక్తులు | Adesh Gupta (CEO) |
ఉత్పత్తులు | Footwear |
మాతృ సంస్థ | Liberty Group |
వెబ్‌సైట్ | libertyshoes.com |
లిబర్టీ షూస్ లిమిటెడ్ అనునది భారతదేశానికి చెందిన ఒక పాదరక్షలు తయారు చేసే సంస్థ.
చరిత్ర
[మార్చు]1954 లో నెహ్రూ చే స్థాపించబడ్డ సహకార పాదరక్షల తయారీదారు మూసివేసే దశలో ఉన్నప్పుడు హర్యానా లోని కర్నాల్కు చెందిన గుప్తాలు సొంతం చేసుకున్నారు. ఆ సమయంలో కేవలం ఒక విదేశీ సంస్థ (బాటా) యొక్క ఉత్పత్తులపై ఆధారపడిన సగటు భారతీయ వినియోగదారునికి స్వేచ్ఛ ఇవ్వాలన్న ఉద్దేశంతో దీనికి ఈ పేరు నిశ్చయం చేశారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని నాణ్యమైన పాదరక్షలు అందించే ఉద్దేశంతో 1964 లో హంగరీ దేశంతో కలసి ఒప్పందం కుదుర్చుకొన్నది. చెకొస్లోవకియా నుండి 50,000 వేల పాదరక్షల ఆర్డరును సంపాదించింది. 70 వ దశకంలో హంగరీలో షో రూమును నెలకొల్పి అక్కడి రీటైల్ లోకి ప్రవేశించింది. 90 వ దశకంలో భారతదేశంలో గొలుసుకట్టు ఫ్రాంచైజీ షో రూమ్ లను నెలకొల్పినది. 2010 నాటికి మధ్యప్రాచ్య దేశాలకు కూడా విస్తరించింది.
బ్రాండులు
[మార్చు]లిబర్టీ ఈ క్రింది బ్రాండులతో పాదరక్షలను విక్రయిస్తుంది
- కూలర్స్
- ఫార్చ్యూన్
- ఫోర్స్ 10
- గ్లైడర్స్
- విండ్ సర్
- సెనో రిటా
- టిప్ టాప్ప్
- ఫూట్ ఫన్
- పర్ ఫెక్ట్
- ఫ్రీడం
- వారియర్
- వర్క్ మన్