Jump to content

లీ కాస్పెరెక్

వికీపీడియా నుండి
లీ కాస్పెరెక్
2020 ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ సమయంలో న్యూజిలాండ్ తరపున బౌలింగ్ చేస్తున్న కాస్పెరెక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లీ మేఘన్ కాస్పెరెక్
పుట్టిన తేదీ (1992-02-15) 1992 ఫిబ్రవరి 15 (వయసు 32)
ఎడిన్‌బర్గ్, స్కాట్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబౌలింగ్ ఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టులు
తొలి వన్‌డే (క్యాప్ 133)2015 జూన్ 28 
న్యూజీలాండ్ - ఇండియా తో
చివరి వన్‌డే2021 సెప్టెంబరు 23 
న్యూజీలాండ్ - ఇంగ్లాండ్ తో
తొలి T20I (క్యాప్ 46)2015 జూలై 11 
న్యూజీలాండ్ - ఇండియా తో
చివరి T20I2023 జూలై 12 
న్యూజీలాండ్ - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2011/12వెస్టర్న్ ఆస్ట్రేలియా
2012–2013ఎసెక్స్
2012/13వెల్లింగ్‌టన్ బ్లేజ్
2013/14–2018/19ఒటాగో స్పార్క్స్
2018–2019యార్క్‌షైర్
2019యార్క్‌షైర్ Diamonds
2019/20–presentవెల్లింగ్‌టన్ బ్లేజ్
2020వెలాసిటీ
2022Northern Diamonds
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20
మ్యాచ్‌లు 39 46
చేసిన పరుగులు 299 104
బ్యాటింగు సగటు 17.58 6.11
100లు/50లు 1/0 0/0
అత్యధిక స్కోరు 113 19
వేసిన బంతులు 1,904 1,010
వికెట్లు 65 75
బౌలింగు సగటు 19.43 14.13
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 6/46 4/7
క్యాచ్‌లు/స్టంపింగులు 12/– 12/–
మూలం: ESPNcricinfo, 3 October 2022

లీ మేఘన్ కాస్పెరెక్ (జననం 1992, ఫిబ్రవరి 15) న్యూజీలాండ్ జాతీయ జట్టు తరపున ఆడుతున్న స్కాటిష్ క్రికెటర్. గతంలో స్కాటిష్ జాతీయ జట్టు తరపున ఆడిన లీ కాస్పెరెక్, ఉన్నతస్థాయి క్రికెట్ లో ఆడేందుకు న్యూజిలాండ్‌కు మారింది.[1]

స్కాట్లాండ్ కెరీర్

[మార్చు]

కాస్పెరెక్ 15 సంవత్సరాల వయస్సులో 2007 కౌంటీ ఛాలెంజ్ కప్‌లో ఇంగ్లీష్ కౌంటీ పక్షాలకు వ్యతిరేకంగా స్కాట్‌లాండ్ తరపున ఆడింది.[2] 2008లో యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో ఐర్లాండ్, నెదర్లాండ్స్లతో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.[3] 2008 ప్రారంభంలో, దక్షిణాఫ్రికాలో జరిగిన 2008 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ కోసం కాస్పెరెక్ స్కాట్లాండ్ జట్టులో ఎంపికయింది. ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో ఆడింది.[4]

న్యూజిలాండ్ కెరీర్

[మార్చు]

కాస్పెరెక్ న్యూజిలాండ్‌లో మొదటి సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం 86 పరుగులు చేసింది, ఒక వికెట్ తీసింది. 2013-14 సీజన్ కోసం, ఒటాగో స్పార్క్స్ ( డునెడిన్‌లో ఉంది) కి మారింది, రెండు అర్ధ సెంచరీలు సాధించింది. కాంటర్‌బరీతో జరిగిన ఒక మ్యాచ్‌లో 6 వికెట్లతోపాటు, [5] పోటీలో ప్రధాన వికెట్-టేకర్‌గా 18 వికెట్లు పడగొట్టింది.[6] తరువాతి సీజన్‌లో, 15 వికెట్లు తీసి ఒటాగో ప్రధాన వికెట్ టేకర్‌గా, పోటీలో నాల్గవ స్థానంలో నిలిచింది.[7]

2015 మేలో, 2015 భారత పర్యటన కోసం జట్టులో స్థానం పొందింది.[8] ఐదు వన్డే ఇంటర్నేషనల్, మూడు ట్వంటీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఆడింది.[9][10] తొలి వన్డేలో అరంగేట్రం చేసి 10 ఓవర్లు బౌలింగ్ చేసి 3/39 సాధించింది.[11] తర్వాత 2015లో, టూరింగు శ్రీలంకకు వ్యతిరేకంగా, కాస్పెరెక్ 4/27తో తన తొలి వన్డే నాలుగు వికెట్లు తీసింది.[12]

2016 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ20 ఇంటర్నేషనల్‌లో, కాస్పెరెక్ మూడు ఓవర్లలో 4/7 తీసుకున్నది.[13]

2020 జనవరిలో, ఆస్ట్రేలియాలో జరిగే 2020 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టులో పేరు పొందింది.[14]

2020-21లో న్యూజిలాండ్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో 2వ మహిళ వన్డే సమయంలో, కాస్పెరెక్ 10 ఓవర్లలో 6/46తో ముగించింది.[15] మూడు మ్యాచ్‌లలో రెండు మాత్రమే ఆడినప్పటికీ, 9 వికెట్లతో వన్డే లెగ్ ఆఫ్ ది సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచింది.[16]

మూలాలు

[మార్చు]
  1. Steve Hepburn (13 May 2015). "Cricket: Long and winding road to call-up"Otago Daily Times. Retrieved 5 October 2015.
  2. Women's miscellaneous matches played by Leigh Kasperek – CricketArchive. Retrieved 5 October 2015.
  3. Scotland women's matches played by Leigh Kasperek – CricketArchive. Retrieved 5 October 2015.
  4. Records / ICC Women's World Cup Qualifying Series, 2007/08 - Scotland Women / Minor cricket (one-day/limited overs) / Batting and bowling averages – ESPNcricinfo. Retrieved 5 October 2015.
  5. Bowling in New Zealand Women's One-Day Competition 2013/14 (ordered by wickets) – CricketArchive. Retrieved 5 October 2015.
  6. Otago Women v Canterbury Women, New Zealand Women's One-Day Competition 2013/14 – CricketArchive. Retrieved 5 October 2015.
  7. Women's limited-overs matches played by Leigh Kasperek Archived 2018-08-05 at the Wayback Machine – CricketArchive. Retrieved 5 October 2015.
  8. "Leigh Kasperek included in NZ women squad" – ESPNcricinfo. Retrieved 5 October 2015.
  9. Women's ODI matches played by Leigh Kasperek – CricketArchive. Retrieved 5 October 2015.
  10. Women's International Twenty20 matches played by Leigh Kasperek Archived 2016-03-09 at the Wayback Machine – CricketArchive. Retrieved 5 October 2015.
  11. India Women v New Zealand Women, ICC Women's Championship 2014 to 2016/17 – CricketArchive. Retrieved 5 October 2015.
  12. "Priest ton sets up big New Zealand Women win" – ESPNcricinfo. Retrieved 5 November 2015.
  13. (28 February 2016). "Kasperek's four-for sets up easy win for New Zealand" – ESPNcricinfo. Retrieved 28 February 2016.
  14. "Lea Tahuhu returns to New Zealand squad for T20 World Cup". International Cricket Council. Retrieved 29 January 2020.
  15. "Full Scorecard of AUS Women vs NZ Women 2nd ODI 2020/21 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-04-11.
  16. "Australia Women tour of New Zealand, Australia Women in New Zealand 2020/21 score, Match schedules, fixtures, points table, results, news". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-04-11.

బాహ్య లింకులు

[మార్చు]