లీ డి ఫారెస్ట్
లీ డి ఫారెస్ట్ (ఆగష్టు 26, 1873 - జూన్ 30, 1961) తన ఖాతాలో 180 పైగా పేటెంట్లను వేసుకున్న ఒక అమెరికన్ ఆవిష్కర్త. ఇతను "కనిపించని గాలి యొక్క రహస్య సామ్రాజ్యాన్ని నేను కనుగొన్నాను" అనే ప్రసిద్ధ వ్యాఖ్యతో తనకు తానే "రేడియో పితామహుడు" (ఫాదర్ ఆఫ్ రేడియో) అనే పేరు పొందాడు. చలన చిత్రాల తెర మీద బొమ్మకు తగ్గట్లుగా మాట, సంగీతం కూడా జత చేసి వార్నర్ సోదరులు ఓ సంచలనాత్మక విజయం సాధించగా, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్' ప్రక్రియను లీ డి ఫారెస్ట్ కనిపెట్టారు. 1904లో జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ మొదటి రేడియో ట్యూబ్, డయోడ్‌ను కనిపెట్టగా, 1906లో రాబర్ట్ వాన్ లీబెన్, లీ డి ఫారెస్ట్ స్వతంత్రంగా ట్రయోడ్ అని పిలిచే యాంప్లిఫైయర్ ట్యూబ్‌ను అభివృద్ధి చేశారు. తరచుగా 1907లో లీ డి ఫారెస్ట్ వాక్యూమ్ ట్యూబ్ (శూన్య నాళిక) ను కనిపెట్టడంతో ఎలక్ట్రానిక్స్ ప్రారంభమైనట్లు చెప్పబడుతుంది. తరువాత 10 ఏళ్ల కాలంలోనే, ఆయన కనిపెట్టిన పరికరాన్ని రేడియో ట్రాన్స్‌మిటర్‌లు, రిసీవర్‌లలో ఉపయోగించారు, అంతేకాకుండా సుదూర టెలిఫోన్ కాల్‌లకు కూడా దీనిని ఉపయోగించడం జరిగింది.
చిత్రమాలిక
[మార్చు]-
De Forest Audion from 1906
-
Audion ట్యూబ్ లతో లీ డీ ఫారెస్ట్
-
లీ డి ఫారెస్ట్ మూడో భార్య మేరీ మాయో
మూలాలు
[మార్చు]ఇతర లింకులు
[మార్చు]- Lee de Forest, American Inventor
- Dr. Lee De Forest internet radio project & forum
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో లీ డి ఫారెస్ట్ పేజీ
- Lee De Forest at IEEE
- Lee De Forest Archived 2009-09-22 at the Wayback Machine at National Inventors Hall of Fame
- De Forest Phonofilm Sound Movie with Eddie Cantor (1923) యూట్యూబ్లో
- Stephen Greene's Who said Lee de Forest was the "Father of Radio"?
- Eugenii Katz's Lee De Forest
- Cole, A. B., "Practical Pointers on the Audion: Sales Manager – De Forest Radio Tel. & Tel. Co.," QST, March, 1916, pages 41–44:
- Hong, Sungook, "A History of the Regeneration Circuit: From Invention to Patent Litigation" University, Seoul, Korea (PDF)
- PBS, "Monkeys"; a film on the Audion operation (QuickTime movie)
- Adams, Mike, Lee de Forest and the Invention of Sound Movies, 1918-1926, The AWA Review (vol. 26, 2013).