లుట్రోపిన్ ఆల్ఫా
| Clinical data | |
|---|---|
| వాణిజ్య పేర్లు | Luveris |
| అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
| ప్రెగ్నన్సీ వర్గం | ? |
| చట్టపరమైన స్థితి | ? |
| Identifiers | |
| ATC code | ? |
| Chemical data | |
| Formula | ? |
లుట్రోపిన్ ఆల్ఫా, అనేది లువెరిస్ బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది హైపోపిట్యూటరిజం కారణంగా మహిళల్లో వంధ్యత్వానికి చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక ఔషధం.[1] క్లోమిఫెన్ ప్రభావవంతంగా లేనివారిలో ఇది ఫోలిట్రోపిన్ ఆల్ఫాతో కలిపి ఉపయోగించబడుతుంది.[1][2] ఇది చర్మం కింద ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[1]
సాధారణ దుష్ప్రభావాలలో తలనొప్పి, వికారం, రొమ్ము నొప్పి, కడుపు నొప్పి, అండాశయ తిత్తులు ఉన్నాయి. [2] ఇతర దుష్ప్రభావాలలో రక్తం గడ్డకట్టడం, అండాశయ హైపర్‌స్టిమ్యులేషన్ సిండ్రోమ్, బహుళ గర్భధారణ వంటివి ఉండవచ్చు.[1][2] ఇది రీకాంబినెంట్ డిఎన్ఎ పద్ధతుల ద్వారా తయారు చేయబడిన లూటినైజింగ్ హార్మోన్ ఒక రూపం.[1]
లుట్రోపిన్ ఆల్ఫా 2000లో ఐరోపాలో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[3] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి 75 యూనిట్ మోతాదుకు దాదాపు £31 ఖర్చవుతుంది.[1] ఇది యునైటెడ్ స్టేట్స్‌లో వాణిజ్యపరంగా అందుబాటులో లేదు.[2]
మూలాలు
[మార్చు]- 1 2 3 4 5 6 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 787. ISBN 978-0857114105.
- 1 2 3 4 "Lutropin Alfa Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 3 November 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2021.
- ↑ "Luveris". ఒరిజినల్ నుండి 5 March 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2021.