లేడీ హార్డింజ్ వైద్య కళాశాల

వికీపీడియా నుండి
(లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

లేడీ హార్డింజ్ వైద్య కళాశాల అనేది భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉన్న ఒక మహిళా వైద్య కళాశాల. 1916 లో స్థాపించబడిన ఇది 1950 లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మెడికల్ సైన్సెస్ ఫ్యాకల్టీలో భాగమైంది. ఈ కళాశాలకు భారత ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది.[1][2]

చరిత్ర

[మార్చు]
లేడీ[permanent dead link] హార్డింజ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో నర్సులు, 1921

భారతదేశ రాజధాని ఢిల్లీకి మార్చినప్పుడు, అప్పటి వైస్రాయ్ భార్య లేడీ హార్డింజ్ మహిళల కోసం ఒక మెడికల్ కాలేజీని స్థాపించాలని నిర్ణయించుకుంది. అలాంటి కళాశాల లేకపోతే, భారతీయ మహిళలు మెడిసిన్ చదువడం అసాధ్యమని ఆమె గుర్తించింది. 1914 మార్చి 17 న లేడీ హార్డింజ్ దీనికి పునాది రాయి వేసింది. 1911-12లో క్వీన్ మేరీ సందర్శన జ్ఞాపకార్థం ఈ కళాశాలకు క్వీన్ మేరీ కాలేజ్ & హాస్పిటల్ అని పేరు పెట్టారు. లేడీ హార్డింజ్ 1914 జూలై 11 న మరణించే వరకూ కళాశాల కోసం రాచరిక సంస్థానాల నుండి ప్రజల నుండి నిధులు సేకరించడంలో చురుకుగా పాల్గొనేది. [3]

ఈ కళాశాలను 1916 ఫిబ్రవరి 7 న ఇంపీరియల్ ఢిల్లీ ఎన్క్లేవ్ ప్రాంతంలో బారన్ హార్డింజ్ ప్రారంభించాడు. క్వీన్ మేరీ సూచన మేరకు, కళాశాలకు, ఆసుపత్రికీ దాని స్థాపకురాలి జ్ఞాపకార్థం లేడీ హార్డింజ్ పేరు పెట్టారు. మొదటి ప్రిన్సిపాల్ డాక్టర్ కేట్ ప్లాట్. మొదటి బ్యాచ్‌లో 16 మంది విద్యార్థులను చేర్చుకున్నారు. ఈ కళాశాల అప్పుడు పంజాబ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నందున, విద్యార్థులు లాహోర్లోని కింగ్ ఎడ్వర్డ్ మెడికల్ కాలేజీలో తుది పరీక్షలకు హాజరుకావలసి వచ్చేది. 1950 లో ఇది ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మారింది. 1954 లో పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రారంభించారు. [4] రూత్ విల్సన్ గా ఉన్నపుడు కళాశాలలో మొదటి శస్త్రచికిత్స ప్రొఫెసర్ గా పనిచేసిన డాక్టర్ రూత్ యంగ్ సిబిఇ, 1936 నుండి 1940 వరకు ప్రిన్సిపాల్‌గా పనిచేసింది. [5] లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉన్న రెండు ఆసుపత్రులలో ఒకటైన కళావతీ శరణ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ను 1956 లో నిర్మించారు. ప్రారంభంలో, కళాశాల ఒక పాలకమండలి నిర్వహించే స్వయంప్రతిపత్తి సంస్థగా ఉండేది. 1953 సంవత్సరంలో, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిపాలనా మండలి సంస్థ నిర్వహణకు అధికారికంగా బాధ్యత తీసుకుంది. 1978 ఫిబ్రవరిలో, పార్లమెంటు చట్టం ప్రకారం ఈ నిర్వహణను భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్వాధీనం చేసుకుంది. [6] డైరెక్టర్ ప్రొఫెసర్లలో ఒకరిని కళాశాలలో అత్యంత సీనియర్ పదవైన కళాశాల అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. [7]

మూలాలు

[మార్చు]
  1. "Lady Hardinge Medical College". University of Delhi. Archived from the original on 2 February 2011.
  2. "Lady Hardinge Medical College, New Delhi". Medical Council of India. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 8 జనవరి 2017.
  3. "A fine balance of luxury and care". Hindustan Times. 21 July 2011. Archived from the original on 27 July 2014.
  4. "A fine balance of luxury and care". Hindustan Times. 21 July 2011. Archived from the original on 27 July 2014.
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Young అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. "Lady Hardinge Medical College". Faculty of Medical Sciences, University of Delhi. Archived from the original on 17 డిసెంబరు 2016. Retrieved 8 January 2017.
  7. "Management". Lady Hardinge Medical College Alumni Association. Archived from the original on 25 నవంబరు 2016. Retrieved 8 January 2017.