వంకా సత్యనారాయణ
స్వరూపం
వంకా సత్యనారాయణ | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1962 -1967 1972 - 1978 1994 - 1999 | |||
నియోజకవర్గం | పెనుగొండ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1923 పేకేరు, ఇరగవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | ||
మరణం | 2018 అక్టోబర్ 26 తణుకు | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | సీపీఐ | ||
జీవిత భాగస్వామి | వంక నాగమణి | ||
సంతానం | వంకా రామదాస్, వంకా రవీంద్రనాథ్, వంకా మోహన రావు, అరుణ, లక్ష్మి | ||
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు |
వంకా సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను పెనుగొండ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]వంకా సత్యనారాయణ విద్యార్థి దశ నుంచే స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో పాల్గొన్నాడు. అతను 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యాడు. వంక సత్యనారాయణ 1942లో సీపీఐ పార్టీలో చేరి 1962లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెనుగొండ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అతను తరువాత 1972,1994లో ఎమ్మెల్యేగా గెలిచాడు.
మరణం
[మార్చు]వంకా సత్యనారాయణ తణుకులోని అతను స్వగృహంలో అనారోగ్యంతో బాధపడుతూ 2018 అక్టోబరు 26న మరణించాడు. అతనుకు భార్య వంక నాగమణి, కుమారులు డా. వంక రామదాస్, వంక రవీంద్రనాథ్, వంక మోహన రావు కుమార్తెలు అరుణ, లక్ష్మి ఉన్నారు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (16 March 2019). "గెలుపు వీరులు...రికార్డుల రారాజులు". Archived from the original on 9 February 2022. Retrieved 9 February 2022.
- ↑ Andhra Jyothy (26 October 2018). "అసెంబ్లీ టైగర్ ఇక లేరు." Archived from the original on 9 February 2022. Retrieved 9 February 2022.
- ↑ The Hans India (27 October 2018). "Former MLA, Communist leader Vanka Satyanarayana passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 9 February 2022. Retrieved 9 February 2022.