వంగిపురం హరికిషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వంగిపురం హరికిషన్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు[1].

ఇతర విశేషాలు[మార్చు]

మే 30, 1963 తేదీన శ్రీమతి రంగమణి, V.L.N.చార్యులు దంపతులకు ఏలూరులో జన్మించాడు. అతను 8 సంవత్సరాల వయసులోనే తమ గురువుల కంఠాల్నీ, బంధువులు కంఠాల్నీ అనుకరించడం ప్రారంభించి మెల్లగా సమాజంలోని ప్రముఖుల, క్రికెట్ కళాకారుల, రాజకీయ నాయకుల, సినీ తారల, కవుల, గాయకుల గొంతును అనుసరించడం నేర్చుకున్నాడు. అంతేకాక పశుపక్ష్యాదుల శబ్దాలు, యంత్రాలు చేసే శబ్దాలు, సంగీత వాద్య పరికరాల శబ్దాలను పలికించడం నేర్చుకున్నాడు[2]. తన మొట్టమొదటి మిమిక్రీ ప్రదర్శన 1971లో విజయవాడలో జరిగింది.


మూలాలు[మార్చు]

  1. "మిమిక్రీ హరికిషన్‌కు ఆకృతి సుహృతి". Cite web requires |website= (help)
  2. "Hari Kishan-Mimicry,Hyderabad | eventaa". eventaa.com. Retrieved 2018-06-05.

ఇతర లింకులు[మార్చు]