వక్రతా వ్యాసార్ధము, నాభ్యంతరము
Appearance
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
వక్రతా వ్యాసార్ధంతో పోలిస్తే గోళాకార దర్పణ వ్యాసం చిన్నదయితే వక్రతా వ్యాసార్ధము, నాభ్యంతరానికి రెట్టింపు ఉంటుందని రుజువు చేయవచ్చు.[1]
పుటాకార దర్పణము
[మార్చు]పుటాకార దర్పణము యొక్క ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తున్న కాంతి కిరణం AB దర్పణతలం వద్ద పరావర్తనం చెంది ప్రధాననాభి F లోంచి పోతుంది. పరావర్తన తలానికి పతనబిందువు వద్ద గీసిన లంబము BC . పరావర్తన సూత్రం నుంచి
- పతన కోణం ΔABC = పరావర్తన కోణం ΔCBF = θ
- కాని ΔABC =ఏకాంతర కోణం ΔBCF = θ
- కనక ΔBCF = ΔCBF
ΔBCF సమద్విబాహు త్రిభుజమవుతుంది. BF, CF భుజాలు సమానాలు. AB ప్రధానాక్షానికి దగ్గరగా ఉంటే BF దాదాపు PF ను సమానమని భవించవచ్చు.
- PF = CF = 1/2 PC
- f = r/2
- r = 2f
కుంభాకార దర్పణము
[మార్చు]కుంభాకార దర్పణము యొక్క ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తున్న కాంతి కిరణం AB దర్పణం వద్ద పరావర్తనం చెందుతుంది. పరావర్తన కిరణం F ద్వారా వస్తున్నట్లు ఉంటుంది. పరావర్తన తలానికి పతనబిందువు వద్ద గీసిన లంబము NBC, పరావర్తన సూత్రం నుంచి
- r = 2f
- పతన ΔABN = పరావర్తన ΔNBD = θ
- కాని ΔABN = అనురూప ΔBCF
- ΔNBD = శీర్షాభిముఖ ΔCBF
- ΔBCF సమద్విబాహు త్రిభుజమవుతుంది. BF , CF బుజాలు సమానాలు. AB కిరణం ప్రధానాక్షానికి దగ్గరగా ఉంటే BF దాదాపు PF ను సమానమని భవించవచ్చు.
- PF = CF = 1/2 PC
- f = r/2
- r = 2f
ఇది కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఇంటర్మీడియట్ భౌతిక శాస్త్రము ద్వితీయ భాగము (పేజి.నం.22-23) తెలుగు అకాడమి