వట్టికూటి వెంకటసుబ్బయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ వట్టికూటి వెంకటసుబ్బయ్య:- వీరు నిద్రించే సమయంలో తప్ప, తన చేతిలో ప్రతి క్షణం, పలుగు పారతో గ్రామాలలో పర్యటించేవారు. పారిశుద్యం మెరుగుదల, మురుగు కాలువలకు మరమ్మత్తులు, సాగు భూములకు వెళ్ళే డొంకల మరమ్మత్తులు నిర్వహిం, చడమే, ఆయన విధిగా మార్చుకున్నారు. అందుకే తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటసుబ్బయ్య కాస్తా, "గుంటూరు గాంధీ"గా గుర్తింపు సాధించారు. ఆయన చేసినదంతా ప్రజాసేవ కార్యక్రమాలు కావడంతో ఆయన మరణించినా అందరిమదిలో చిరస్థాయిగా నిలిచి పోయారు.

  • గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామానికి చెందిన శ్రీ వట్టికూటి వెంకటసుబ్బయ్య, వ్యవసాయ పనులు చేసుకుంటూ, ప్రజాసేవ కార్యక్రమాలలో పునీతులయ్యారు. ఆయన మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలను ఆచరించాలనే ఆలోచనతో చొక్కాను విడిచిపెట్టినారు. ఆయన భుజాన పలుగు, పార ఉంచుకునే వీధిలోకి అడుగు పెడుతుండేవారు. గ్రామంలో పర్యటిస్తూ రహదారి వెంట పారిశుధ్యం మెరుగు పరిచేవారు. మురుగు నీరు పారుదల లేని పక్షంలో మురుగు కాలువలకు మరమ్మత్తులు చేసేవారు. పొలాలకు వెళ్ళే డొంకలు, బళ్ళు, రైతుల రాకపోకలకు వీలుగా శుభ్రం చేసేవారు. ఇలా నిత్యం ఇవే విధులుగా, ప్రజా సంరక్షక కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. కాలక్రమేణా దొప్పలపూడి గ్రామం నుండి జిల్లా ప్రధాన కేంద్రమైన గుంటూరులోనూ మురుగు కాలువలకు మరమ్మత్తులు చేపట్టేవారు. ఆయనకు మొక్కలు పెంచటం ఎంతో ఇష్టం.మాటలు చెప్పడం, నీతులు బోధించడం,

సందేశాలు ఇవ్వడం ఈ గాంధేయవాదికిఇష్టం ఉండేది కాదు. నేడు మనం జరుపుకుంటున్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా జీవించుతామని చెబుతుండేవారని గ్రామస్థులు చెప్పుచున్నారు.స్వచ్ఛభారత్ కు ఆనాటి గాంధేయవాదులు ఆదర్శ ప్రాయులు. తరువాత గుంటూరు నుండి హైదరాబాదు వెళ్ళి అక్కడ గూడా సేవాకార్యక్రమాలు చేపట్టినారు. ఇలా వట్టికూటి వెంకటసుబ్బయ్య కాస్తా "గుంటూరు గాంధీ"గా పేరుపొందినారు. గుంటూరులో చేసిన సేవాకార్యక్రమాలకు గుర్తింపుగా, గుంటూరు నగర కార్పొరేషను వారు, లక్ష్మీపురం ప్రధాన రహదారిలో గుంటూరు గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేసినారు. దొప్పలపూడి గ్రామస్థులు గూడా, ఆయన స్పూర్తితో గ్రామంలో, రుద్రభూమిని అభివృద్ధి పరచడమే గాకుండా, ఆ ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని గూడా ఏర్పాటుచేసినారు.గుంటూరు స్ధంభాలగరువు మహాప్రస్థానంలో ఆయన విగ్రహం నిర్మించారు. అది మనకు మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ ఉంటాయి. ఈ తరం యువతీ యువకులకు వెంకటసుబ్బయ్య అనే పేరు కంటే "గుంటూరు గాంధీ" అంటేనే తెలుస్తుంది. [ఈనాడు గుంటూరు రూరల్; జూలై-19,2013; 8వ పేజీ.]