వడ్డీ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వడ్డీ : (ఆంగ్లం : Interest లేదా Usury )
వడ్డీ ఒక రుసుం లేదా ఫీజు లాంటిది, అప్పు తీసుకుని ఆ అసలుకు కొంత ఫీజు లేదా కాంపెన్‌జేషన్ లేదా ప్రతిఫలం చెల్లించునటువంటిది. వెరసి, అప్పు తీసుకున్న రొక్కానికి ప్రతిఫలంగా కొంత సొమ్ము ముట్టజెప్పడం.[1] లేదా, డిపాజిట్టు చేసిన రొక్కములకు ప్రతిగా పొందే ఫలము.[2] కొన్ని అసళ్ళు అయిన రొక్కము, షేర్లు, కోనుగోలుదార్ల సరకులు, అడమాణము, తాకట్టు (hire purchase), ఫైనాన్సు లీజులు వగైరాలు కూడా ఈ వడ్డీని కలిగివుంటాయి. మనమేదైనా బ్యాంకు నుండి రుణసహాయం పొందాలంటే, వాటికి అసలు, వడ్డీ చెల్లించవలసినదే. పోలీసులుగుర్తించిన తొమ్మిది ప్రధానమైన ఆర్థిక నేరాలలో వడ్డీ వ్యాపారం ఒకటి.
వడ్డీలో రకాలు
[మార్చు]మీటర్ వడ్డీ
[మార్చు]రోజుకు ఇంత అని చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ అసలును మించి పోతుంది.రోడ్డు పక్కన తోపుడు బండ్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు తమ వ్యాపారానికో, ఇంటి అవసరాలకో రోజువారి వడ్డీ తీసుకుంటున్నారు. రోజంతా రెక్కలు, ముక్కలు చేసుకొని సంపాదించిన దాంట్లో అధిక మొత్తం సాయంత్రానికి వడ్డీ వ్యాపారికి ముట్ట చెప్పుకుంటున్నారు.పరిస్థితులు బాగోలేక సెలవు తీసుకుంటేనో, వ్యాపారం జరగకపోతేనో ఆరోజు వారు వణికిపోవాల్సిందే. ఆ తరువాతిరోజు రెండు రోజుల మొత్తం కలిపి చెల్లించాల్సి ఉంటుంది. రూ.10వేలు రోజువారి వడ్డీకి తీసుకుంటే రూ.వెయ్యి మినహాయించుకొని రూ.9000 చేతిలో పెడతారు. రోజుకు రూ.100 చొప్పున 100 రోజుల్లో రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం రూ.800 ఇస్తే సాయంత్రం రూ. వెయ్యి ఇవ్వాలి
సూక్ష్మ ఋణాలు(Micro Finance)
[మార్చు]ఈ సంస్థలు పోటీపడి గ్రామీణ ప్రాంతాల్లో పేదవర్గాలకు రుణాలు ఇస్తున్నాయి. గ్రూపులను ఏర్పాటుచేసి లీడర్‌ను బాధ్యురాలిగా చేస్తున్నారు. ఆయా గ్రూపుల పనితీరు ఆధారంగా రూ. 10 వేలు నుంచి రూ. 50 వేలు, లక్ష వరకు రుణాలు ఇస్తున్నారు. వారు తీసుకున్న మొత్తాన్ని బట్టి వారానికి ఒకసారి కిస్తీ చెల్లించాలి.చెల్లించని పక్షంలో సంస్థ ప్రతినిధుల రౌడీయిజంతో మహిళలను వ్యభిచారంలో దించుతున్నారు.కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ అంతర్జాతీయ సమాజం నుంచి తక్కువ వడ్డీకి నిధుల్ని లేదా గ్రాంటుల్ని తెచ్చి నిరుపేదలకు నామమాత్రపు వడ్డీకి అందించి పేదరికం నుంచి వారిని బయటపడేయడానికి సూక్ష్మరుణ వ్యవస్థ ఏర్పాటు చేశారు.మన రాష్ట్రంలో కూడా పొదుపును బృందాల నుంచే సేకరించి, వాళ్లకే తక్కువ వడ్డీకి ఒక్కో అవసరానికి ఒక్కో రేటుతో అప్పులిచ్చి, వచ్చిన లాభాలను తిరిగి ఆ బృందాలలోని సభ్యులకే పంచే ఆరోగ్యకరమైన సహకార రుణ వ్యవస్థ ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ విధానం పేదల్ని పీల్చి పిప్పిచేసే భయంకరమైన వ్యాపారంగా మారింది.బ్యాంకులనుండి సాధారణ వడ్డీకి తెచ్చిన సొమ్మును పేదలకు అప్పులిచ్చి 40 - 50 శాతం వడ్డీని వసూలు చేస్తున్నారు.
తాకట్టు పేరుతో ఇళ్ళు, స్థలాలు స్వాధీనం
[మార్చు]తనఖా పేరుతో ఇళ్లు, స్థలాలతో పాటు ఆభరణాలు, ఇతర ఆస్తులను వడ్డీ వ్యాపారులు మింగేస్తున్నారు.వడ్డీకి తీసుకునే వారు తమ ఇల్లు లేదా స్థలం లేదా బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు.ఆ మొత్తం చెల్లించలేని స్థితిలో వడ్డీ వ్యాపారులు బలవంతంగా ఆయా స్థలాలు, ఇళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు. రౌడీషీటర్లు, గూండాలు ఏం చేస్తారో అనే భయంతో బాధితులు పోలీసు స్టేషను వరకు రాలేకపోతున్నారు. ఒకరికి వడ్డీ చెల్లించడానికి మరొకరి వద్ద అప్పు చేయడం, వారి వడ్డీ చెల్లించడానికి వేరొకరి వద్ద అప్పులు చేస్తూ కష్టాలలో మునిగి పోతున్నారు.
వడ్డీ వ్యాపారుల చట్టం
[మార్చు]- వడ్డీ వ్యాపారులు ఇక లైసెన్సులకు బదులు తమ పేరును నమోదు చేయించుకోవాలి. రిజిస్టరు కాని వ్యాపారులెవరూ అప్పులను ఇవ్వడానికి సాధ్యంకాదు. ప్రతి వ్యాపారి నగదు పుస్తకాన్ని, ఇతర ఖాతా పుస్తకాలు నిర్వహించాలి.
- వ్యాపారులు గరిష్ఠంగా ఎంత వడ్డీని వసూలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంది. అసలును వడ్డీ మించకూడదు.
- వడ్డీ వ్యాపారులతో పాటు బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని వాటిని తిరిగి అప్పులుగా ఇచ్చేవారూ ఈ చట్ట పరిధిలోకి వస్తారు.
- ఎరువులు, క్రిమి సంహారక మందులను అప్పుగా ఇచ్చి వడ్డీ రాబట్టే వ్యాపారులకూ ఈ చట్టం వర్తిస్తుంది.
చట్టం పరిధిలోకి తేవలసిన విషయాలు
[మార్చు]- చాలామంది వడ్డీ వ్యాపారులు రుణ గ్రహీతలకు రాతపూర్వక పత్రాలివ్వకుండా అప్పుల్ని ఇస్తుంటారు. వారు రుణ గ్రహీతలతో సంతకాలు చేయించుకుని ఆయా పత్రాలను తమవద్ద భద్రపరచుకుంటారు. ఇలాంటివారిని నియంత్రించే చర్యలు చట్టంలో చేర్చాలి.
- కౌలు రైతులకు బ్యాంకు రుణాలను పెంచాలి.రిజిస్టరు అయిన వ్యాపారి కౌలుదారుకు అప్పు ఇచ్చేలా కౌలుదారుల చట్టాన్ని మార్చాలి.భూ యజమానుల హక్కులకు భంగం కలగదని భరోసా ఇచ్చి కౌలుదారులకు వ్యవస్థీకృత రుణాలు ఇప్పించాలి.
- అధిక వడ్డీలతో ఘోరాలకు పాల్పడుతున్న సూక్ష్మ రుణ (మైక్రో ఫైనాన్సు) సంస్థలను కూడా ఈ చట్టం పరిధిలోకి తేవాలి.
దుష్ఫలితాలు
[మార్చు]ప్రపంచంలో వడ్డీల వలన కోట్లకొలది కుటుంబాలు ఆర్థిక బంధనాల్లో చిక్కుకున్నాయి. మానవులలో వుండవలసిన కనీస నైతిక విలువలు, ఇతర సోదర మానవుల పట్ల వుండవలసిన కనీస జాలి, కరుణ, దయ లాంటి మానవతా విలువలు ఈ వడ్డీ వ్యవస్థ వలన నశించాయి, నశిస్తున్నాయి.
వడ్డీ నిషేధిత సమాజాలు
[మార్చు]క్రైస్తవం, హైందవం, ఇస్లాం, ఈ సమాజాలలో ధార్మిక నిర్వచాల ఆధారంగా వడ్డీ నిషేధం. వడ్డీని నీతిబాహ్యమైనదనీ, అనైతికమనీ, అధర్మమనీ పేర్కొంటారు, కానీ, వడ్డీ చక్ర బంధనాల నుండి విముక్తి కాలేని సమాజ సముదాయాలు.
వడ్డీ ధర్మమే
[మార్చు]యూదసమాజం, జైన సమాజం, ఈ రెండు సమాజాలు వడ్డీని ధర్మమేనని భావిస్తాయి. ప్రపంచంలో యూద వడ్డీ వ్యవస్థ సుపరిచితమే. అలాగే భారత్ లో జైనులు సాధారణంగా కష్ట జీవులు కారు. వీరు చిన్నా చితకా వ్యాపారాలూ చేయరు. వీరి వ్యాపారాలు స్థితిమంతమైనవి, వీటికి మూలాధారం వడ్డీయే.
ఇవీ చూడండి
[మార్చు]
మూలాలు
[మార్చు]- ↑ Sullivan, arthur; Steven M. Sheffrin (2003). Economics: Principles in action. Upper Saddle River, New Jersey 07458: Prentice Hall. p. 261. ISBN 0-13-063085-3. Archived from the original on 2016-12-20. Retrieved 2021-02-24.
{{cite book}}
: CS1 maint: location (link) - ↑ Sullivan, arthur; Steven M. Sheffrin (2003). Economics: Principles in action. Upper Saddle River, New Jersey 07458: Prentice Hall. p. 506. ISBN 0-13-063085-3. Archived from the original on 2016-12-20. Retrieved 2021-02-24.
{{cite book}}
: CS1 maint: location (link)
బయటి లింకులు
[మార్చు]- సాధారణ వడ్డీ కేలికులేటర్
- చక్రవడ్డీ కేలికులేటర్