Jump to content

వడ్లా సుబ్రహ్మణ్యం

వికీపీడియా నుండి
(వడ్ల సుబ్రమణ్యం నుండి దారిమార్పు చెందింది)

ఆచార్య వడ్లా సుబ్రహ్మణ్యం తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు.[1] లేఖకునిగా ఎన్టీఆర్‌ చెప్పిన రీతిలో వందలాది రాజకీయ ఉపన్యాసాలు రాశారు. నందమూరితో 1989లో పరిచయమై ఆయన దగ్గర చేరింది మొదలు 1996 జనవరి 18న పరమపదించిన ముందురోజు వరకు గడిపారు. ఆయన రాజకీయ ప్రసంగాలు సుదీర్ఘ సమాస భూయిష్టంగా, కఠినమైన ఆంధ్రా సంస్కృతి పదాల ప్రవాహాలతో ఉద్వేగంగా, ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలతో సాగేలా రాయించుకునేవారు. రచనలో కొట్టివేతలు, దిద్దివేతలు ఉంటే భగ్గుమనేవారు. ముత్యాల్లా మెరిసిపోయే దస్తూరీతో ఆయన దివంగత ఎన్టీఆర్‌ను మురిపించారు. తెలుగు భాషా సాహిత్య సుగంధాలతో ఎన్టీఆర్‌ను ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ తెలుగు విద్యాలయంలో ఆచార్యునిగా విధులను నిర్వహిస్తూ నందమూరి వద్ద లేఖకునిగా ఎటువంటి పారితోషికం ఆశించకుండా సుబ్రమణ్యం పనిచేశారు.[2] ఆయన అవధాన కార్యక్రమాలలో పాల్గొనేవారు.[3]

భావాలు

[మార్చు]
  • తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు అందరూ దిగాలుగా ఉంటే 'వెన్నెల ఉంటుంది, చీకట్లు ఉంటాయి బ్రదర్‌' అని తేలిగ్గా తీసుకోవడం ఆయనకే చెల్లింది. తెలుగుభాషకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది నందమూరే. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన రాజాధిరాజు. ఆయన సహచర్యంలో గడపడం రాజాస్థానంలో కవిగా పని చేయడమే.

రచనలు

[మార్చు]
  • క్రీడాభూమిక క్రీడాతత్వం[4]
  • తెలుగు సాహిత్యంలో క్రీడా వినోదాలు

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]